31, జనవరి 2011, సోమవారం

టమాట సూప్

టమాట సూప్ కావలసినవి
 టమాటాలు 4
కార్న్ఫ్లోఫ్లోర్  2 స్పూన్
 మిరియాలు  4
 ఉప్పు 1 స్పూన్
 పంచదార 1 స్పూన్
 ఉల్లిపాయ  1
 బటర్ 5 స్పూన్స్
అల్లం చిన్నముక్క
 బ్రెడ్ 2 స్లయ్సు
 తయారుచేయువిధానం: టమాటాలు,అల్లం, ఉల్లిపాయ,2  గ్లాసుల నీరు చేర్చి5 నిముషాలు ఉడకనివ్వాలి  చల్లరేకమిక్సిలోవేసి గ్రైండ్ చెయ్యాలి,గ్రైండ్ చేసిన తరువాత వడపోయాలి. 2  స్పూన్లకా ర్న్ ఫ్లోర్ 1 గ్లాసు నీరు చేర్చి కలపాలి దాన్ని టమాట నీటిలో కలిపి స్టవ్ మీద పెట్టి 5 నిముషాలు మరగనివ్వాలి. మిరియాలపొడి,ఉప్పు,పంచదార కలపాలి,బ్రెడ్  చిన్న ముక్కలుగా కట్ చేసి నేతిలో వేయించాలి. అందించేముందు 1 స్పూన్ బటర్ ,బ్రెడ్ ముక్కలు వెయ్యాలి  

కార్నసూప్

కార్నసూప్ కావలసినవి   మొక్కజోన్నగింజలు 1 కప్
 కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
ఉల్లిపాయ 1
 మిరియాలు 4
బటర్1 స్పూన్ 
 అల్లం చిన్న ముక్క
  తయారుచేయువిధానం మొక్కజోన్నగింజలు ;అల్లం ;ఉల్లిపాయ ఉడకపెట్టాలి చల్లరేక సగం మొక్కజోన్నగింజలు విడిగా పెట్టుకుని మిగతా సగం గింజలు ;ఉల్లిపాయ ;అల్లం మిక్సిలో వేసి2 గ్లాసుల నీరు చేర్చి  వడపోసుకోవాలి ఇంకో గ్లాసెడు నీరు తీసుకుని  కార్న్ఫ్లోర్  కలపాలి అన్ని కలిపి స్టవ్ మీద పెట్టి 5 నిముషాలు కలుపుతుంటే సూప్ రెడి అవుతుంది కప్ లోకి తీసి ఉడికిన మొక్కజోన్నగింజలు బటర్ వేసి  అందించాలి     

29, జనవరి 2011, శనివారం

మినపరోట్టి [దిబ్బరోట్టి ]

మినపరోట్టి [దిబ్బరోట్టి ] కావలసినవి 
 మినపప్పు 2 కప్స్
 బియ్యం రవ్వ4 కప్స్
 జీలకర్ర 1 స్పూన్
 నూనె 2 స్పూన్స్
 ఉప్పు తగినంత
తయారు చేయు విధానం 
  నాలుగు ఘంటలముందుమినపప్పు నానపెట్టాలి  నానిన పప్పు మిక్సిలో మెత్తగా గ్రైండ్ చేసుకునిరవ్వ;  జీలకర్ర ;ఉప్పు కలపాలి ఇంకో నాలుగు ఘంటలు నానపెట్టి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసుకుని ఈ పిండి వేసి మూత పెట్టాలి రెండు వేపుల కాల్చుకోవాలి ఇది అల్లంచట్ని; కొబ్బరిచట్ని తో తినవచ్చు  

కాజు బర్ఫీ

కాజు బర్ఫీ కావలసినవి:
 జీడిపప్పు 1 కప్
 పంచదార 1 కప్
 ఏలకులు  4 
 పాలు -1/2 కప్ 
తయారుచేయు విధానం  : అరగంట ముందు  పాలల్లో  జీడిపప్పు నానపెట్టాలి. నానిన తరువాత మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.  స్టవ్ మీద బాణలి పెట్టి గ్రైండ్ చేసిన జీడిపప్పుముద్దని; పంచదార కలిపి గరిటెతో తిప్పుతూ కొంచెం దగ్గర పడ్డాక,యాలకుల పొడి వేసి,స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పరిచి చల్లారాక డయమండ్ ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి.అంతే.

కేబేజీ పచ్చడి

కేబేజీ పచ్చడి కావలసినవి
 కేబేజీ పావు కేజీ
 చింతపండు చిన్నముద్ద
 ఎండుమిర్చి 2
మెంతులు సగంస్పూన్
 పచ్చిమిర్చి 2
 కొత్తిమీర
  తగినంత ఉప్పు
 పోపుకి మినపప్పు ;ఆవాలు ;జీలకర్ర 1 స్పూన్
 నూనె 2 స్పూన్లు
   తయారుచేయు విధానం   స్టవ్ మీద బాణలి పెట్టుకుని నూనె వేసుకుని పోపువేయించుకోవాలి కేబేజీ ;చింతపండు పచిమిర్చికూడా వేసి మగ్గపెట్టుకోవాలి చల్లారేక ఉప్పు ;కొత్తిమీర చేర్చ్చి మిక్సిలో గ్రైండ్ చేసుకోవాలి ఇది అన్నం లో బాగుంటుంది 

లవంగమొగ్గలు

లవంగమొగ్గలు కావలసిన పదార్దాలు
    మైదా  ఒక కప్
 పంచదార ఒక కప్
లవంగాలు పది
    కొబ్బరి ఒక కప్ తురుము
  సరిపడనూనే
   ఏలకులు నాలుగు
    తయారు చేయు విదానం    కొబ్బరితురుము పంచదార కలిపి బాణలిలో వేసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ  ఉంటె  పాకంవచ్చి గట్టిపడుతుంది ఏలకుల పొడివేసి పక్కన పెట్టుకోవాలి మైదాలో నీళ్ళు కలిపి పూరిపిండిలా కలపాలి చిన్న నిమ్మకాయంత ఉండలు చేసుకుని పల్చగా పూరీలు వత్తుకోవాలి  పూరి మద్యలో కొబ్బరి ఉండ పెట్టి పూరిని నాలుగు వేపుల మడత పెట్టి లవంగంగుచ్చాలి  అన్ని ఇలా చేసుకున్నాక స్టవ్ మీద నూనె పెట్టుకుని వేయించుకోవాలి 

మల్లె మొగ్గలు

మల్లె మొగ్గలు కావలసిన పదార్దాలు :-
మైదా   ఒక కప్
పంచదార ఒక కప్
కాజు పది
యాలకులు నాలుగు
కొబ్బరిపొడి నాలుగు స్పూన్స్
 నూనె తగినంత
 
    తయారుచేయు విదానం :
   మైదా ను పూరిపిండిలా కలుపుకుని పూరిచేసుకోవాలి  పూరి మద్యలో చాకుతో చివరివరకుకకుండానాలుగుసార్లు కట్  చేసుకుని చుట్టుకోవాలి బాణలిలో నునే పెట్టుకుని   మల్లెమొగ్గలు వేయించుకోవాలి     పంచదార తీగపాకం చేసుకుని   పాకంలోవేసి  తీయాలి  పైన జీడిపప్పు యాలకులపొడి కొబ్బరిపొడి చల్లుకోవాలి

నిమ్మకాయకారం

నిమ్మకాయకారం కావలసిన పదార్దాలు
 నిమ్మకాయలు 2 
ఎండుమిర్చి 5 
మెంతులు 1 స్పూన్ 
సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1 స్పూన్
 అవాలుజీలకర్ర 1 స్పూన్
 ఉప్పు తగినంత
 తయా రుచేయువిదానం ఎండుమిర్చి .మెంతులు .సెనగపప్పు .మినపప్పు ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి; చల్లారేక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నిమ్మకాయ రసం గిన్జలేకుండారసం  తీసుకుని ఉప్పుకలిపి పొడి  కలుపుకోవాలి 

28, జనవరి 2011, శుక్రవారం

ఆలూ-మేథి


కావలసినవి:


బంగాలాదుంప-3
మెంతికూర-1 కట్ట
ఉల్లిపాయ-1
ఆవాలు- 1 స్పూన్
జీలకర్ర-1 స్పూన్
ధనియాలపొడి-1/2 స్పూన్
మినపప్పు-1/2 స్పూన్
చింతపండు రసం-4 లేద 5 స్పూన్స్
పచ్చిమిర్చి-4
పసుపు- చిటికెడు
కరివేపాకు
కొత్తిమీర
ఉప్పు
నూనె

తయారు చేసె విధానం:

ముందుగా కుక్కర్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు , పోపు వేయించాలి.
తరువాత పచ్చి మిర్చి , కరివేపాకు , పసుపు వేసుకోవాలి.
తర్వాత బంగాలదుంప ముక్కలు, మెంతికూర , చింతపండు రసం ,ధనియాల పొడి,ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ విజిల్ పెట్టాలి .
కుక్కర్ 3 విజిల్స్ ఆపేసి రాగానె ,,ఒక డిష్ లోకి తీసుకుని,,,పైన కొత్తిమీర చల్లాలి.


****ఇష్టమైన వాళ్ళు అల్లం-వెల్లుల్లి ముద్ద వేసుకోవచ్చు.****

డబుల్ కా మీఠ

కావలసినవి :

బ్రెడ్ - 6
పాలు - 1 కప్పు
పంచదార-1/2 కప్పు
నెయ్యి - 4 స్పూన్స్
జీడిపప్పు
కిస్ మిస్
బాదంపప్పు
రోజ్ ఎస్సె న్స్ లేదా వెనీలా ఎస్సె న్స్ - 3 చుక్కలు

తయారు చేసే విధానం :

ముందుగా బ్రెడ్ ముక్కలుగా చేసి నేతి లో వేయించుకోవాలి.
తర్వాత ఇంకొక బానలిలో పాలు , పంచదార ఎస్సె న్స్ వేసి మరిగించుకోవాలి.
బాగ మరిగిన పాలల్లొ బ్రెడ్ ముక్కలని వేసి దగ్గరపడేదాక ఉంచాలి.
చివరగా జీడిపప్పు, కిస్ మిస్ , బాదం వెయ్యాలి.





అటుకుల ఉప్మా

టుకుల ఉప్మా కావలసినవి
 అటుకులు 1   కప్ 
ఆలు 1
  ఉల్లిపాయ 1
  కేరట్  1 
  బటాని తగినంత 
  టమాట 1
  పచ్చిమిర్చి2 
  కరివేపాకు 
  పల్లీలు తగినన్ని 
  పోపుకి సెనగపప్పు ;మినపప్పు ఆవాలు ;జీలకర్ర ;ఎండు మిర్చి స్పూన్ చొప్పున  ఉప్పు తగినంత 
 తయారుచేయు విధానం   2  స్పూన్ల నూనె బాణలిలో వేసుకుని పోపు వేయించుకోవాలి కూరలన్నీaచిన్న ముక్కలుగా కోసుకుని పోపులోవేసి వేయించుకోవాలి అటుకులు తడిపి నీరు తీసేసి కూరముక్కలతోకలిపి 5 నిముషాలు వేయిస్తే అటుకుల ఉప్మా రెడి 

సేవ్ పూరి

సేవ్ పూరి   కావలసినవి
 మైదా 1 కప్
 సన్న కారపూస పావు కప్  [ seve ]
 ఉల్లిపాయ 1
  చింతపండు రసం పావు కప్                                                        
 పెరుగు పావు కప్
 కొత్తిమీర కట్ట 1
 ఉప్పు  1 స్పూన్
 నూనె  తగినంత
 పంచదార  1 స్పూన్
  తయారుచేయువిధానం 
 మైదా కొంచెం నీళ్ళు పోసుకుని పూరిపిండిలా కలపాలి పూరిలా వత్తుకుని చిన్న మూత తో చిన్న పూరిలా కట్ చేసుకోవాలి నునేస్టవ్ మీద పెట్టుకుని వేయించుకోవాలి  గరిటతో నొక్కుతుంటే పొంగుతాయి చింతపండురసం కొత్తిమీర  ;ఉప్పు /;పంచదార మిక్సిలో వేసి గ్రీన్ చట్ని చెయ్యాలి ;పెరుగు గిలక్కొట్టి కొంచెం ఉప్పు పంచదార కలపాలి ; ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి    ఇప్పుడు పొంగిన పూరి తీసుకుని ఒకవేపు  నొక్కితే గిన్నెల అవుతుంది దానిలో గ్రీన్ చట్ని పావు స్పూన్ వెయ్యాలి దానిమీద ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి దానిమీద పావు స్పూన్ పెరుగు వేసి పైన కారపూస వేస్తె తినడానికి రెడి 

27, జనవరి 2011, గురువారం

కరివేపాకు పచ్చడి

   కరివేపాకు    పచ్చడి కావలసిన పదార్దాలు
 కరివేపాకు కట్ట 2
 చింతపండు కొంచెం
 మెంతులు 1 స్పూన్
 ఎండుమిర్చి 5
ఆవాలు జీలకర్ర 1 స్పూన్
 బెల్లం చిన్నముక్క
  తయారుచేయువిదానం
 కరివేపాకు కడిగి అరపెట్టాలి  మెంతులు /ఎండుమిర్చి /ఆవాలు 'జీలకర్ర వేయించుకోవాలికరివేపాకుకుడా   వేసి మగ్గపెట్టాలి .చింతపండు బెల్లం ఉప్పు అన్ని కలిపి మిక్సి లోవేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి

మైసూర్ బజ్జి

మైసూర్ బజ్జి కావలసిన పదార్దాలు
 మైదా 1 కప్
 పెరుగు సగం కప్
 పచ్చిమిర్చి  2
వంటసోడా చిటికెడు                            
  సరిపడా ఉప్పు
 చిన్న ఉల్లిపాయ
తగినంత నునే
 తయారుచేయు విదానం
 మైదా పెరుగులో గంట ముందుగ నానపెట్టాలి పచ్చిమిర్చి మెత్తగా నూరి కలపాలి ఉల్లిపాయ సన్నగా తరిగి కలపాలి ఉప్పు  వంటసోడా కలిపి నూనెలో బజ్జీలు వేయించుకోవాలి 

26, జనవరి 2011, బుధవారం

మజ్జిగ పులుసు

మజ్జిగపులుసుకావలసినవి 
 కవ్వం తో చిలికిన మజ్జిగ
 సెనగపప్పు 1  స్పూన్
  స్పూన్ ధనియాలు 1
మిరియాలు4
 కొబ్బరి చిన్న ముక్క అల్లం, చిన్నముక్క
 పచ్చిమిర్చి 2
అనపకాయ .టమోటా ములక్కాడ,కేరట్  ముక్కలు  తగినన్ని
 సెనగపప్పు.ధనియాలు .మిరియాలు ముందు నానపెట్టుకోవాలి నానిన తరువాత కొబ్బరి పచ్చిమిర్చిఅల్లం  కూడా కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి గ్రైండ్ చేసిన ముద్దని మజ్జిగలో కలిపి కూర ముక్కలు  కలిపి  ఉప్పు కూడా కలిపి స్టవ్ మీద పెట్టి ముక్కలు ఉడికే వరకు కలుపుతూ ఉండాలి 

బీరకాయ తొక్కు పచ్చడి

బీరకాయ తొక్కు పచ్చడి కావలసినవి
 బీరకాయ తొక్కు
 తగినంత చింతపండు
 టమోటా 1
పచ్చిమిర్చి 2
బెల్లం  చిన్న ముక్క
 పోపుకి మినపప్పు 1 స్పూన్ 
  ఆవాలు .జీలకర్ర 1 స్పూన్
 ఎండుమిర్చి 2
 ఉప్పు తగినంత
 తయారుచేయువిధానం
2 స్పూన్ల నూనె వేసుకుని బీరకాయతోక్కు .టమోటా .పచ్చిమిర్చి ,మగ్గపెట్టుకోవాలి పోపు వేయించుకుని అన్ని కలిపి మిక్సిలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి 

బూడిద గుమ్మడి కాయ పచ్చి వడియాల కూర

బూడిద గుమ్మడి కాయ పచ్చి వడియాల  కూర 
 బూడిద గుమ్మడికాయ చిన్నది
 మినపప్పు 1 గ్లాసు
 పచ్చిమిర్చి కారం కావలసినన్ని                     
 ఉప్పు తగినన్న్త
 మినపప్పు నానపెట్టుకోవాలి  గుమ్మడికాయ తరుక్కుని చిన్న ముక్కలు చేసుకుని ఉప్పు కలిపి బట్టలో మూట  కట్టి పైన బరువ్   పెట్టాలి నీరంతా పోతుంది మినపప్పు కొంచెం నీరుపోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకునిఉప్పు కలుపుకుని  నునే పెట్టుకుని వడ లు వేయించుకోవాలి ఇవి అన్నం లో బాగుంటాయి

కొత్తిమీర పచ్చడి

కొత్తిమీర పచ్చడి కావలసినవి 
 కొత్తిమీరకట్ట పెద్దది 1
 చింతపండు  చిన్న నిమ్మకాయంత
 బెల్లం చిన్నముక్క                                              
  రుచికి తగినంత ఉప్పు
 ఎండుమిర్చి 4
 పోపుకి
 ఆవాలు జీలకర్ర 1 స్పూన్

 నునే 2   స్పూన్స్
 తయారుచేయువిదానం 
  కొత్తిమీర  కడిగి అరపెట్టుకోవాలి నునేవేసి ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేయించి కొత్తిమీర వేసి మగ్గపెట్టాలి అన్నికలిపి మిక్సిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి

25, జనవరి 2011, మంగళవారం

చాట్ పూరి

 కావలసినవి
 మైదా 1 కప్
 సన్నకారపూస
 ఉల్లిపాయ 1
 ఉడికించిన ఆలు 1
 కొత్తిమీర కట్ట
 పెరుగు పావు కప్
 చింతపండు రసం పావుకప్
 పంచదార 1  స్పూన్
 తగినంత ఉప్పు
 తగినంత నూనే
 తయారుచేయువిధానం : మైదాలో   తగినంత నీరుపోసి కలుపుకుని చిన్న అప్పడాలు చేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ కొత్తిమీర  సన్నగా కట్ చేసుకోవాలి చింతపండురసం ఉడకపెట్టాలి దానిలో సగం ఉప్పు సగం పంచదార కలపాలి. పెరుగు గిలకొట్టుకుని దానిలో మిగతా సగం ఉప్పు పంచదార కలపాలి ప్లేటు తీసుకుని నాలుగు అప్పడాలు ముక్కలు చేసుకుని దానిమీద చింతపండు రసం 2 స్పూన్లు చల్లాలి దానిమీద ఉల్లిపాయ కొత్తిమీర చల్లాలి దాని పైన పెరుగు 2 స్పూన్లు వేసి పైన కారపూస వెయ్యాలి.అంటే చాట్ పూరి తయార్.

భెల్ పూరి

భెల్ పూరి కావలసినవి
 మరమరాలు   2 కప్
వేయించిన పల్లీలు పావు కప్
ఉల్లిపాయ 1
టమోటా 1
 కొత్తిమీర 1 కట్ట
 పచ్చిమిర్చి 2
నిమ్మకాయ సగం చెక్క
 తగినంత ఉప్పుకారం
 తయారుచేయువిధానం:టమోటా,ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. గిన్నె తీసుకుని కట్ చేసుకున్న ముక్కలు మరమరాలు, పల్లీలు బాగా కలిపి ఉప్పు కారం నిమ్మరసం కలపాలి.

24, జనవరి 2011, సోమవారం

పల్లి పెరుగు పచ్చడి

పల్లి  పెరుగు పచ్చడికావలసినవి
 పల్లీలు పావుకప్
 పెరుగు 1 కప్
 టమోటా 1
కొత్తిమీర 1 కట్ట
 పచ్చిమిర్చి 2
 ఉప్పు తగినంత
 తయారుచేయువిధానం పల్లీలు వేయించుకుని పొడిచేసుకోవాలి, టమోటా,కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. పెరుగు గరిటెతో గిలకొట్టుకోవాలి,  పెరుగులో పల్లిపొడి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి , తరువాత కట్ చేసుకున్న ముక్కలు ఉప్పు కలుపుకోవాలి.   ఇది ఇడ్లి /దోస కి బాగుంటుంది  

మెంతిబద్దలు

మెంతిబద్దలు కావలసినవి
 మామిడికాయ 1
 కారం 1 కప్
 మెంతిపిండి పావు కప్
 ఉప్పు పావుకప్
 నూనేపావుకప్
 తయారుచేయు విధానం :
మామిడికాయ సన్నగా ముక్కలు కోసుకోవాలి మెంతులు ఎర్రగా వేయించుకుని పొడి చేసుకోవాలి కారం 'మెంతిపిండి ఉప్పు నూనెలో కలుపుకుని మామిడికాయ ముక్కలు కలుపుకోవాలి 

చిలకడ దుంపల పచ్చడి [SWEET POTATO]


 కావలసినవి
 చిలకడ దుంపలు 2
 చింతపండు తగినంత
 పచ్చిమిర్చి 2
  మినపప్పు 1  స్పూన్
 ఆవాలు ;జీలకర్ర 1 స్పూన్
 ఎడుమిర్చి 2 
 చిటికెడు పసుపు
  ఉప్పు తగినంత
  తయారుచేయు  విదానం  చిలకడదుంప పైన తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి ఈ ముక్కలు చింతపండు పచ్చిమిర్చి ఉప్పు చిటికెడు పసుపు మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పోపు వేయించుకుని కలుపుకోవాలి  ఇది అన్నం లో తినవచ్చు     

20, జనవరి 2011, గురువారం

కొత్తిమీర పాఠోలి

కావలసిన పదార్ధాలు:
కొత్తిమేర  1 కప్
 సెనగపిండి 1  కప్
 ఉల్లిపాయ 1
 మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1  స్పూన్
 నూనే తగినంత
 కారం 1  స్పూన్
 తయారుచేయు విదానం:
 కొత్తిమీర సన్నగా తరగాలి సెనగపిండి కొంచెం నీరు కలిపి బజ్జిపిండిలా కలపాలి, కలిపిన పిండిలో కొత్తిమీర,ఉప్పు,కారం కలపాలి. స్టవ్ మీద బాణలి పెట్టి 4 స్పూన్ల నూనే వేసి పోపు వేయించాలి,తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపి వేయించాక , దానిలో బజ్జి పిండివేసి  పొడి పొడిగ కలుపుకుంటూ వేయించుకోవాలి.
కొత్తిమీర పాఠోలి సిద్ధం. నచ్చిన వారు మెంతి కూరతో కూడా ఇలా  చేసుకోవచ్చు.

పనీర్ బటర్ మసాలా


కావలసినవి.
1)పనీర్:-300 గ్రా
2)టమాటాలు:-2
3)కొత్తిమీర:-4 రెమ్మలు
4)వెన్న లేక నెయ్యి-3 చెంచాలు
5)కర్రి మసాలా:-1 1/2 చెంచాలు
6)ఉల్లి పాయ:- 2
7)కారం:-1 చెంచా
8)అల్లం వెల్లుల్లి ముద్ద:- 1 చెంచా
9)పెరుగు:- 2 చెంచాలు
10)ఉప్పు:- సరిపడ
11)నూనె:- సరిపడ.
12)పంచదార:-రుచి కి 1/2 చెంచా తీపి వద్దు అనుకుంటే వెయ్యక పొయిన ఏమి కాదు.
నచ్చే వాళ్ళు ఎరుపు రంగు కూడ వేసుకొవచ్చు.

తయారు చేయడం ఇలా :-
ముందు పనీర్ ని మూకుడు లో వెన్న లేక నెయ్యి లో కొంచెం ఎర్రగా అయ్యే వరకు వెయించాలి.తరువాత ఉల్లి టమోటా చిన్న చిన్న ముక్కలు గా తరగాలి. మూకుడు లో నూనె పొసి ఉల్లిపాయ ముక్కలు వేసి వెయించాలి అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పొయే వరకు వెయించాలి,దానిలో కర్రి మసాలా,కారం,ఉప్పు వేసి బాగా సువాసన వచ్చేదాక వేయించాలి తరువాత టమాటాలు మిక్సిలో వేసి బాగ మెత్తగా అయ్యాక తీసి ఆ వేగిన వాటిలో కలిపి ఉడకపెట్టాలి.ముందు వేయించిన పనీర్ కూడ వేసి కొంచెం దగ్గరయ్యాక అందులో కొంచెం పేరుగు వేసి 5 నిమిషాలు ఉంచిన తరువాత కొత్తిమీర చల్లాలి.
ఈ కూర బిర్యని లొ రోటీ,చపాతి లొ బావుంటుంది.

వెజిటబుల్ పూరి


కావలసినవి:

1 కప్పు గోధుమపిండి
2 క్యారట్
1 చిన్న బీట్ రూట్
1 కట్ట పాలకూర
2 పచ్చిమిర్చి
3 కప్పులు నూనె
సరిపడ ఉప్పు

తయారు చేసే విధానం:

ముందుగా క్యారట్,బీట్ రూట్,పాలకూర, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్
చేసి ముద్దలా చెయ్యలి.

ఇప్పుడు గోధుమపిండిలో ఈ మిశ్రమాన్ని కలిపి పూరి పిండి ల గట్టిగ కలుపుకోవాలి.
అవసరమైతె కొంచుం నీళ్ళతో లేదా కొంచుం నూనెతొ కలిపి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ పిండిని పూరిలలా చేసుకోవాలి.

బానలిలో నూనె వేడిచేసి పూరిలని వేయించుకోవాలి.

ఈ పూరీలు టొమాతో సాస్ తో లేదా చిల్లి సాస్ తో లేదా ఏదైనా చట్నీ తో
తింటే బావుంటుంది.

గోరు చిక్కుడు పాఠోలి



కావలసినవి :
గోరుచిక్కుడు చిన్నచిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి.
4 స్పూన్స్ సెనగపిండి.
4 స్పూన్స్ నూనె
1 స్పూన్ ఆవాలు
1 స్పూన్ జీలకర్ర
1 స్పూన్ మినపఫ్ఫు
2 ఎండుమిర్చి
1 స్పూన్ కారం
సరిపడ ఉప్పు
కరివేపాకు
తయారు చేసే విథానం:
ముందుగా గోరు చిక్కుడు ముక్కలు ఉడికించి పెట్టుకోవాలి. బానలిలో నూనె వేసి పోపు వేయించుకోవాలి.
వేగిన నూనెలొ కరివేపాకు వేయాలి.
సెనగపిండిని నీల్లల్లో కలిపి పేస్ట్ లా చేసుకుని దానిలో సరిపడ ఉప్పు , కారం వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని వేయించిన పోపు లొ వేసి పొడిపొడిగా అయ్యేవరకు వేయించుకోవాలి.
బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గొరు చిక్కుడు ముక్కల్ని వేసి కొంచుం ఉప్పు వేసి కలుపుకున్సి 3 నిముషలు వేయించుకోవాలి.
గోరు చిక్కుడు పాఠోలి రెడి.
ఈ పాఠోలిని ఇంక ఇలాగ కూడా చేసుకోవచ్చు.శనగ పప్పు కాని,పెసరపప్పుతో గాని చేసుకోవచ్చు.వాటితో చేసేటప్పుడు ,ముందుగా ఆ పప్పుని నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి.మిగిలినదంతా పైన చెప్పిన విధంగా చేసుకోవచ్చు.


19, జనవరి 2011, బుధవారం

కాలిఫ్లవర్ పచ్చడి.


కాలిఫ్లవర్ 1
చింతపండు 150 గ్రా.
ఉప్పు చిన్న గ్లాసులో 3 వంతులు
కారం పావు కిలో
ఆవ పిండి 3స్పూన్స్ లు
మెంతి పిండి 4 స్పూన్స్ లు
నూనె అర కేజి
నిమ్మ కాయలు 3
కాలిఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని శుభ్రంగా కడిగి తడిపొయే వరకు ఆరపెట్టు కోవాలి.నీళ్ళు కాచి చింతపండు నీళ్ళలో వెయ్యలి. తరువాత చింతపండు మిక్స్షి లో మెత్తగా అయ్యెవరకు వేయ్యలి. తరువాత బేసిన్ లో కాలిఫ్లవర్ ముక్కలు,చింతపండు ముద్ద,ఉప్పు,కారం,మెంతి పిండి,ఆవపిండి నూనె పోసి కలపాలి.కొంచెం ఆవాలు జీలకర్ర,ఎండుమెరపకాయలు పొపు కలపాలి.నిమ్మ కాయలు రసం పిండి బాగ కలిపితే పచ్చడి రేడి.
తినే వారు వెళ్ళుళ్ళిపాయలు ఇంగువ వేసుకొవచ్చు.
చింతపండులో నీళ్ళు ఉంటే చింతపండు రుబ్బేటప్పుడు దానిలొ కలపచ్చు.

సేమ్య పులిహోర

కావలసినవి:
1 కప్పు సేమ్య
3 లేక 4 చెంచాలు చింతపండు రసం
1 స్పూన్ శనగపప్పు
1 స్పూన్ మినపప్పు
1 స్పూన్ ఆవాలు
పచ్చిమిర్చి
మిరపకాయలు
జీడిపప్పు
కరివేపాకు
సరిపడ ఉప్పు
చిటికెడు పసుపు
తయారు చేసే విధానం:
ముందుగా సేమ్యాని వేడి నీటిలో ఉడకపెట్టాలి.
ఉడికిన సేమ్యాని పసుపు వేసిన చల్లని నీటిలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇలా చేస్తే సేమ్యా పొడి పొడిగ ఉంటుంది.
తర్వాత బాణాలిలో 4 స్పూన్స్ నూనె వేసి పోపు వేయించుకోవాలి.
పోపు వేగిన తర్వాత చింతపండు రసం , ఉప్పు వేసి 2 నిముషాలు ఉడికించుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న సేమ్య లొ వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసి కలుపుకుంటె సేమ్యా పులొహోర రేడి.

18, జనవరి 2011, మంగళవారం

అల్లం పచ్చడి

కావలసిన పదార్ధాలు :
అల్లం -1/4 కేజీ
చింతపండు- 1/2 కేజీ
బెల్లం-1/4 కేజీ
మెంతులు-50 గ్రాములు
జీలకర్ర-1 టీ స్పూన్
ఆవాలు-1 టీ స్పూన్
ఉప్పు తగినంత
పసుపు -చిటికెడు
కారం-1/4 కిలో

తయారుచేసే విధానం :
వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకోవాలి. అల్లం బాగా కడుగుకొని తొక్క తీసివేయాలి.తడి ఆరేవరకు ఎండలో ఆరబెట్టుకోవాలి.
బాణాలిలో మెంతులు నూనెలేకుండా వేయించుకొని పొడి చేసిపెట్టుకోవాలి.ఆరిన అల్లాన్ని రెండు చెంచాల నూనె వేసి వేయించుకోవాలి.వేయించిన అల్లం,నానబెట్టిన చింతపండు,బెల్లం,ఉప్పు,మెంతిపొడి,పసుపు,కారం  మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి.బానాలిలో నాలుగు చెంచాల నూనె వేసి ,ఆవాలు,జీలకర్ర వేసి వేయిన్చుకున్నాక,మిక్సిలో వేసిన పచ్చడిని 5 నిమిషాలు వేగిన పోపులో వేసి కాసేపు గరిటెతో అటుఇటు తిప్పి పెట్టుకోవాలి.
వెల్లులి ఇస్ష్టపడే వారు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు.

17, జనవరి 2011, సోమవారం

బీరపొట్టుతో పప్పు

చాలామంది బీరకాయలు తొక్కతీసాక  పడేస్తారు,దానిలో మచి పీచు (fiber),ఇనుము (iron ) పుష్కలంగా ఉంటాయి.
ఇవాళ దానితో పప్పు ఎలా చేసుకోవచ్చో చెప్తున్నాను.


 కావలసిన  పదార్దాలు
 కందిపప్పు- 1 కప్
 బీరకాయ పైన తొక్క-1 కప్
 పోపుకి  మినపప్పు-1 స్పూన్
 ఆవాలు ,జీలకర్ర-1స్పూన్
 ఎండుమిర్చి-1
 పచ్చిమిర్చి-1
 కరివేపాకు ఒకరెమ్మ
తయారుచేయు విధానం:
పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం బద్దలాగా ఉడకపెట్టుకుని వార్చుకోవాలి.బీరకాయ తొక్కుని మిక్సిలో వేసి పొట్టులా చేయాలి.
మినపప్పు,జీల కర్ర,ఆవాలు,మిరపకాయ,పచ్చి మిర్చి,కరివేపాకు రెండు చెంచాల నూనెలో వేయించుకుని,అందులో బీరపొట్టు నీరు పిండేసి పోపులో వేసి ఒక నిమిషం మూత  పెడితే మగ్గుతుంది,అప్పుడు పప్పు వేయాలి,తరువాత ఉప్పు కూడా కలిపి ఒక నిమిషం కదిపితే పొడి పొడిగా అవుతుంది. బీరపొట్టు పప్పు వేడి  వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాల బాగుంటుంది.

హాయ్ !!!!!

పండగ అందరు బాగా చేసుకున్నార? నేను ఈ సంవత్సరం అమెరికాలో ఉన్నాను.మా మనవడికి బోగిపళ్ళు పోసాము.
మా పెద్ద మనవరాలు గొబ్బిళ్ళు పెట్టుకుంది ఇండియాలో,చిన్న మనవరాలు కూడా భోగిపళ్లు పోయిన్చుకుంది.మా పండుగ బాగా జరిగింది.
ఇంక ఈ నెల నేను కూరలు,పచ్చళ్ళు పోస్ట్ చేయబోతున్నాను. 

15, జనవరి 2011, శనివారం

సంక్రాంతి శుభాకాంక్షలు

                                                                                                                             దీప్తి  

సంక్రాంతికి స్వాగతం

మకర సంక్రాంతి మన ముఖ్యమైన పండుగ.ముగ్గులు,పిండివంటలతో ఈ పండుగని ఆహ్వానిద్దామా మరి?
హితులు,సన్నిహితులందరికి ఇదే నా ఆహ్వానం.మీరు కూడా పండుగ వంటలని,రకరకాల ముగ్గులని పోస్ట్ చెయ్యండి.

మీ ,
సుశీల

14, జనవరి 2011, శుక్రవారం

బాదం హల్వా

బాదం పప్పు:-1/4 కి.లొ
జీడిపప్పు:-100గ్రా
పంచదార:-1/4కి.లొ
నెయ్యి:-50గ్రా
బాదం పప్పు ముందు రోజు నాన పెట్టాలి.చేసే ముందు జీడిపప్పు గంట ముందు నానపెట్టాలి.బాదం పప్పు పైన పొట్టు తీసి మిక్సిలో వేయ్యాలి.బాదం పప్పు కొంచెం నలిగాక జీడిపప్పు కూడ వేసి కొంచెం నీళ్ళు పోసి మిక్సి పెట్టాలి. పంచదార కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చాక రుబ్బిన ముద్ద నెయ్యి వేసి కలపాలి.దగ్గర పడ్డక పళ్ళెం లో నెయ్యి రాసి దానిలో పోసి ముక్కలు క్రింద కోసుకోవాలి.
బాదం పప్పు వేయకుండా జీడి పప్పు వేస్తే జీడిపప్పు హల్వా.

మైదా హల్వా

మైదా పిండి:- 1 గ్లాసు
పంచదార:-1 గ్లాసు
డాల్డా లేక నెయ్యి:-1 గ్లాసు
జీడిపప్పు:-25గ్రా.
యాలకల పొడి:-కొంచెం
మైదా పిండి ని నీళ్ళ తో కలిపి 1 గంట నాన పెట్టాలి.తగినంత నీరు పోసి పంచదార స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి. మైదా పిండి లో పైన తేరుకున్న నీరు పారపోసి ఆ పిండి ని పంచదార పాకం లో వేసి నెయ్యి వేసి కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది. దానిలో వేయించిన జీడిపప్పు,యాలకల పొడి వేసి పళ్ళెంలో నెయ్యి రాసి దానిలో పోసి ముక్కలు గా కోసుకోవాలి.
హాయ్ !
ఇవాళ నేను తరచూ చూసే సైట్ కౌముది.నెట్ ని నా బ్లోగ్ లిస్టు లో పెట్టాను.కౌముది ఒక ఆన్ ల్లైను పత్రిక.ఆసక్తి ఉన్నవాళ్లు చూడవచ్చు.ఇంకా  deals4 fun అనే సైట్ అమెరికా లో ఉండే మనవాళ్ళకి ఉపయోగపడుతుంది.ఈ సైటులో అన్ని వస్తువులకి సంబంధించిన మంచి మంచి deals ఉన్నాయ్.

13, జనవరి 2011, గురువారం

చక్కరపొంగలి

బియ్యం 1 గ్లాసు
పెసర పప్పు 1 గ్లాసు
పంచదార 1 గ్లాసు
కొబ్బరి ముక్కలు 1 గ్లాసు
నెయ్యి 1 గ్లాసు
జీడి పప్పు 25 గ్రా
యాలకుల పొడి
నీరు:5గ్లాసు
బియ్యం,పెసర పప్పు,కొబ్బరి ముక్కలు నెయ్యి వేసి వేటికి అవి వేయించాలి. వాటిలో 5 గ్లాసులు నీరు పోసి కుక్కర్ లో పెట్టి 5 విజిల్లు వచ్చే వరకు ఉంచాలి.జీడి పప్పు కూడ వేయించి పక్కన పెట్టుకోవాలి.కుక్కర్ లో నుంచి తీసి స్టవ్ మీద పెట్టి పంచదార వెయ్యాలి. దగ్గర పడే వరకు నెయ్యి వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ మీద నుంచి తీస్తే చక్కర పొంగలి రెడి.
సూర్య ప్రభ

కట్టుపొంగలి

కట్టుపొంగలి  కావలసినవి:-
బియ్యం - 1 కప్పు
పెసరపప్పు-1/2 కప్పు
మిరియాలు -1 స్పూన్
ఆవాలు, జీలకర్ర -1స్పూన్
పచ్చి మిర్చి-2
కరివేపాకు ఒక రెమ్మ
నెయ్యి-2 స్పూన్
నూనే  ఒకస్పూన్
జీడి పప్పు తగినంత   
తయారుచేయు విధానం
స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని జీడి పప్పు,మిరియాలు,ఆవాలు,జీలకర్ర,మిర్చి,కరివేపాకు వేయించుకోవాలి. బియ్యం, పెసరపప్పు కడుక్కుని  తగినన్ని నీళ్ళు పోసి వేయించుకున్న పోపువేసి తగినంత  ఉప్పు వేసి  కుక్కర్లో  మూడు విజిల్స్ వచ్చేవరకు పెట్టుకుని తీసాక,పైన నేయ్యివేసుకుంటే బాగుంటుంది.

9, జనవరి 2011, ఆదివారం

రవ్వకేసరి



బొంబాయి రవ్వ:-1 గ్లాసు.
పంచదార:-1 గ్లాసు.
ఏలకులు:-4
జీడిపప్పు:-50గ్రా.
నెయ్యి
2గ్లాసుల నీరు స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి.మరిగేకా రవ్వ పోసి కొంచెం ఉడికేక పంచదార వేసి కలుపుతూ ఉండాలి.బాగ ఉడికేక నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి.దగ్గర పడ్డాకా ఏలకులు పొడి కలిపి జీడిపప్పు వేయించి దానిని దేనిలో కలిపి ప్లెటులో పోసి ముక్కలు గా కోసుకొవాలి.
వీటితో బొబ్బట్టులు గా చేసుకొవచ్చు.వాటిని సొజ్జ అప్పాలు అంటారు.

బొబ్బట్టు



శెనగపప్పు :- 1 గ్లాసు.
పంచదార:-మూడు వంతులు(గ్లాసు)
మైదా:-1/4కిలో
ఏలకులు:-4
మైదాపిండిని చపాతి పిండి కన్నా కొంచెం పలచగా కల్పి నూనె పోసి ఉంచాలి. 1 గంట నానాలి. శెనగపప్పు నీరు పోసి మెత్తగా ఉడకపెట్టాలి. ఉడికేకా చిల్లుల గిన్నెలోనికి వార్చుకోవాలి. నీరు వారేకా శెనగపప్పు,పంచదార కల్పి మెత్తగా రుబ్బుకోవాలి.ఏలకులు మెత్తగా పొడి చేసి ముద్ద లో కలుపుకోవాలి.ముద్ద ని చిన్న ఉండలు గా చేసి,మైదా పిండి ముద్ద ని కొంచెం తీసుకొని చేతికి నూనె రాసుకొని మైదాపిండి ముద్ద ని చేతితో పూరిలాగా చేసుకుని దానిలో శెనగపిండి ముద్దని పెట్టి దానిని మూసి వేసి దానిని ప్లాస్టిక్ కవర్ మీద కాని అరటి ఆకు మీద కాని నూనె రాసి పలచగా వత్తాలి.పెనం స్టవ్ మీద పెట్టి కాగాక బొబ్బట్టు దాని మీద వేసి వేగనివ్వాలి.అంతే బొబ్బట్టు తయారు.

సేమియా పాయసం

కావలసినవి:-
1)సేమియా-1 గ్లాసు
2)పంచదార-1 1/2 గ్లాసులు.
3)పాలు-12గ్లాసులు.
4)ఏలకులు-6
5)జీడిపప్పు-50గ్రా.
6)కిస్ మిస్:-10గ్రా.
7)నేయ్యి:- 3 స్పూన్స్.
చేసే విధానం:-
బాణిలో నేయ్యి వేసి దానిలో సేమియా వేసి వేపాలి. కొంచెం ఎర్రపడ్డాక తీసి పక్కన పెట్టుకోవాలి.అప్పుడు బాణిలో పాలు పొసి కాగిన తరువాత వెయించిన సేమియా వేసి ఉడకనివ్వాలి.ఉడికిన తరువాత దానిలొ పంచదార వేయ్యాలి.జీడిపప్పు నేతిలో వేయించి దాన్ని కిస్ మిస్ వేయ్యాలి.ఏలకులు లో పంచదార వేసి గ్రైండ్ చేస్తె బావుంటుంది.ఏలకులు కూడ కలిపితే సేమియా పాయసం రేడి.

బాదుషా

కావలసిన పదార్ధాలు:
మైదా-1 కేజీ
నెయ్యి లేదా డాల్డా  - 100 గ్రాములు
వంట సోడా-1/4 టీ స్పూన్
పంచదార- 1/౩ కేజీ
పెరుగు -1/3 కప్
నీళ్ళు- చిన్న కప్పు 
యాలకులు- 4

తయారుచేయు విధానం:
మైదాలోకరిగించిన  నెయ్యి  లేదా డాల్డా  మరియు పెరుగు వేసి పూరి పిండిలా కలిపి 2 గంటలు నానపెట్టాలి.తరువాత చిన్న వుండాలా చేసి మధ్యలో వేలితో నొక్కాలి.స్టవ్ మీద బాణాలిలో నూనె పోసి  కాగాక సన్న మంట మీద వేయించుకోవాలి.వేగిన బాదుషాలని పక్కన పెట్టుకోవాలి.
పంచదార పాకం తయారి: గిన్నెలో నీరు పోసి ,దానిలో పంచదార కరిగించుకొని తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ,తయారైన బాదుషాలని పాకంలో ముంచి తియ్యాలి.బాదుషా తయారైనట్టే.

అరిసెలు

కావలసిన పదార్దాలు 
     బియ్యం  ఒక కేజీ 
     బెల్లం - 3/4 కేజీ
     నువ్వులు -100 గ్రాములు
     నెయ్యి- రెండు స్పూన్
తయారు చేయు విధానం   బియ్యం ముందు రోజు నానపెట్టుకోవాలి.మరుసటి రోజు నీరంతా తీసివేసి మిక్సి లో వేసి పిండి చెయ్యాలి. మెత్త జల్లెడలో పిండి జల్లించుకోవాలి.ఒక గిన్నెలో నీరు పోసి అందులో బెల్లం చేర్చి ముదురు పాకం చెయ్యాలి.ముదురు పాకం వచ్చాక స్టవ్ ఆపుచేసి   పాకం లో బియ్యం పిండి కలుపుతూ కొంచెం  కొంచెంగా  వెయ్యాలి.  మొత్తం వేసాక  నెయ్యి వేసి కలపాలి నిమ్మకాయంత ఉండ తీసుకుని  అరిటాకు మీదకాని ఫాలిదిన్  కవర్ మీదకాని  చేత్తో వత్తుకుని అరిసెలు వేయించుకోవాలి.



8, జనవరి 2011, శనివారం

దద్దోజనం

 కావలసిన పదార్దాలు:
  బియ్యం ఒక కప్
  పెరుగు రెండు  కప్పులు
  మినపప్పు ఒక టీ స్పూన్
  ఆవాలు 1/2 టీ స్పూన్
 జీలకర్ర  1/2 స్పూన్
 మెంతులు  1/2 స్పూన్
 ఎండు మిరపకాయలు రెండు
 పచ్చి మిర్చి రెండు
 కొత్తిమీర  ఒక కట్ట
 చిన్న అల్లం ముక్క
 శొంటి చిన్న ముక్క
పసుపు, ఉప్పు తగినంత      
 తయారుచేయు విధానం:
 అన్నం వండుకుని కొంచెం చల్లరేక పెరుగు,పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి.అల్లం ,శొంటి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగా
 చేసి ,పెరుగన్నంలో కలిపేసుకోవాలి.
 స్టవ్ మీద భాణాలి పెట్టి రెండు స్పూన్లు నూని వేసి పైన చెప్పిన మినపప్పు, ఆవాలు, జీలకర్ర,  మెంతులు,ఎండు మిరపకాయలు   వేయించుకుని సిద్ధం గా ఉన్న పెరుగు అన్నం లో కలపాలి.  పైన కొత్తిమీర చల్లు కోవాలి. అంతే దద్దోజనం సిద్ధం.

7, జనవరి 2011, శుక్రవారం

కజ్జికాయలు

 కావలసిన పదార్దాలు :
  మైదా -1 కప్
  పుట్నాల పప్పు-1 కప్
  పంచదార -1 కప్
  ఎండు కొబ్బరి -1/2కప్
  జీడి పప్పు తగినంత
  ఏలకులు -4
  నూనే వేయించడానికి సరిపడా
తయారు చేయు విదానం :
పుట్నాలపప్పు ,కొబ్బరి, పంచదార  మిక్సి లోవేసుకుని పిండి చేసుకోవాలి.  ఏలకులు పొడి చేసుకుని కలుపుకోవాలి.  జీడిపప్పుపిండిలో  కలుపు కోవాలి. మైదా  పూరిపిండిలా కలుపుకుని  పూరిచేసుకోవాలి.   పూరి మధ్యలో రెండు స్పూన్ల పొడినివేసి,చేతితో మూయవచ్చు లేదా  కజ్జికాయల చెక్కతో చేసుకోవచ్చు .బాణాలిలో నూనె కాగాక బంగారు రంగులో వచ్చేదాకా
వేయించుకొని తీసేయ్యాలి.

6, జనవరి 2011, గురువారం

పాని పూరి

పూరి కి కావలసినవి :-
బొంబాయి రవ్వ  ఒక కప్పు    
మైదా ఒక కప్పు

పానీ కి కావలసినవి :-
పుదీనా  ఆకు -1 కప్పు
చింతపండు రసం-1/4  కప్పు
పచ్చిమిర్చి-4
మిరియాలు-4
ఆవాలు, జీలకర్ర-1/2 టీ స్పూన్
నిమ్మకాయ రసం-4 స్పూన్స్
సరిపడా ఉప్పు
పంచదార-1 స్పూన్
బఠానీలు-1/2 కప్పు

తయారు చేయు విదానం :-
 గంట ముందుగ బొంబాయి రవ్వ,  మైదా పిండి పూరి పిండిలా కలిపి పెట్టుకోవాలి.
 పుదీనా ఆకూ, చింత  పండు రసం, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, నిమ్మ రసం, ఉప్పు,  పంచదార, అన్ని కలిపి మిక్సిలో వేసి    
 మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. గ్రైండ్ చేసిన తరువాత  వడపోసి, దాని లో రెండు  గ్లాసుల నీళ్ళు పోసి కలిపి తయారు చేసి పక్కన    
 పెట్టుకోవాలి.పాని  తయారైనట్టే.
 పిండిని చిన్న చిన్న పూరిల్లా  వత్తుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని  సరిపడా  నూనె వేసి గరిట తో నొక్కుతూ  వేయించు  
 కోవాలి. నూనెలో వేసి గరిటతో నొక్కుతూ  చేస్తే  పొంగుతాయి.ఇప్పుడు పూరి కూడా తయార్.బఠానీలని కొద్దిగా నీరు  
 పోసి,తగినంత ఉప్పు వేసి ఉడికించుకుని తినేటప్పుడు పూరిలో వేసుకుని,తరువాత పానీ వేసుకుని  తింటే చాల బాగుంటుంది.

రవ్వ లడ్డు

 కావలసినవి   :
 బొంబాయి రవ్వ ఒక కప్  
 పంచదార  ఒక కప్
 రెండు స్పూన్స్  నెయ్యి 
 జీడి పప్పు కావలసినంత
యాలకులు  -4
  కొబ్బరి తురుము 4 స్పూన్
తయారు చేసే విధానం
 నెయ్యి  వేడిచేసుకుని జీడిపప్పువేయించాలి  బొంబాయి రవ్వకూడా వేసి కొంచెం వేయించుకోవాలి కొబ్బరి పంచదార  కూడా వేసి బాగా కలిపితే కొంచెం దగ్గర పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి లడ్డులు చేయి తడి చేసు కుంటూ చేసుకోవాలి.

చెగొడీలు



కావలసిన పదార్ధాలు:
బియ్యం పిండి -1 కప్పు
పెసర పప్పు- 1/4 కప్పు
జీల కర్ర- 1 చెంచా
నూనె వేయించడానికి సరిపడా
ఉప్పు,కారం తగినంత
తయారుచేసే విధానం:
ముందుగ పెసర పప్పు నానాబెట్టుకోవాలి.ఒక గ్లాసు నీళ్ళు స్టవ్ మీద పెట్టాలి ,నీళ్ళు మరుగుతున్నప్పుడే జీలకర్ర ,ఉప్పు,కారం కలుపుకుని స్టవ్ ఆపుకొని, బియ్యపిందిని కలుపుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ పిండికలపాలి.ఒక చెంచా నూనె వేసి కలిపితే పిండి గట్టిబడదు.
పిండి చల్లారిన తరువాత చిన్న చిన్న ఉండలు చేసుకొని,వర్తులాకారంలో చేగోడిలా చుట్టుకొనే ముందు కొంచెం నానబెట్టిన పెసరపప్పు అద్ది ,కాగిన నూనెలో వేయించుకోవాలి.

సున్నుండ

కావలసిన పదార్ధాలు :
మినపప్పు -1 కప్పు
పంచదార- 1 కప్పు
నెయ్యి -1/4 కప్పు
తయారుచేయువిధానం:
మినపప్పుని దోరగా వేయించుకుని ,చల్లారాక బాగా మెత్తగా పిండి పట్టాలి.అలాగే పంచదార కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.మెత్తగాచేసిన మినప్పిండిలో ఈ పంచదారని కలిపి ఉంచుకోవాలి.
తరువాత నెయ్యి కరగబెట్టుకోవాలి.కరగబెట్టిన నెయ్యిలో పిండి కలిపి లడ్డులు చేసుకోవాలి.
అంతే సంక్రాంతి మినపసున్ని తయార్.

5, జనవరి 2011, బుధవారం

వెజిటబల్ కట్లెట్

కావలసిన పదార్దములు: 
ఉడికించిన బంగాళాదుంప పెద్దది -1
ఉల్లిపాయ తురుము - 1 కప్పు 
క్యాబేజీ తురుము - 1 కప్పు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి-2
కార్న్ ఫ్లోర్- 1 కప్పు
బియ్యంపిండి - 4 చెంచాలు
ఉప్పు,కారం తగినంత
బ్రెడ్ పొడి -1 కప్పు

తయారు చేయు విధానం:  
కార్న్ ఫ్లోర్ ,బియ్యం పిండి నీళ్ళుపోసి బజ్జి పిండిల కలుపుకుని పక్కన పెట్టుకోవాలి .
ముందుగా కొంచెం జీలకర్ర ,ఆవాలు ,ఎండు మిరపకాయి నూనెలో వేసి వేయించుకోవాలి.
 అందులో ఉడికించిన బంగాళదుంప ,క్యాబేజీ,ఉల్లిపాయలను వేసి మగ్గనివ్వాలి .
ఇప్పుడు మగ్గిన కూరని చల్లరనిచ్చి,  నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుని ,వడలా ఒత్తి, పిండిలో ముంచి బ్రెడ్ పొడి అద్ది
పెనం మీద నూనె వేసి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవచ్చు,లేదా నూనెలో వేయించుకోవచ్చు.
ఇది సాస్తో తింటే బాగుంటుంది.

టొమటొ ఆమ్లెట్

కావలసిన  పదార్దాలు    
          టమాటాలు  నాలుగు  
          శనగ పిండి 1 కప్
          బియ్యం పిండి 4 స్పూన్స్
          ఉప్పు  కారం  సరిపడా
          ఉల్లిపాయ ఒకటి
          కొత్తిమీర  కట్ట
 తయారుచేయు విధానం:
   టమాటాలు  ఉల్లిపాయ  కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి
   శనగ  పిండి బియ్యం పిండిలని  నీళ్ళుపోసి దోసపిండిలా కలుపుకోవాలి
   తరిగిన  కురముక్కలు ఉప్పు కారం కలిపి  పెనం మీద దోసలా  పోసుకోవాలి
   కారంగా  కావాలని అనుకునే వారు పచ్చి మిర్చి వేసుకోవచ్చు.

వెజిటెరియన్ స్ప్రింగ్ రోల్

కావలసిన పదార్ధములు :
కాబెజి తురుము  ఒక కప్పు
కారెట్  తురుము ఒక కప్పు
ఉల్లిపాయి తురుము ఒక కప్పు
మైదా పిండి ఒక కప్పు
ఉప్పు, కారం, నునే  సరిపడా


తయారు చేయు విధానము :
మైదా పిండి ని పూరి పిండి లా కలుపు కోవాలి
కాబెజి, కారెట్, ఉల్లిపాయి ల తో  కూర కింద చేసుకోవాలి.స్టవ్ మీద మూకుడు పెట్టి ఉడికిన కూరల్లన్ని పోపులో వేసి బాగా కలపాలి 
తరువాత పూరి పిండి ని చపాతీ లా పల్చ గా ఒత్తుకుని పొడుగుగా  కట్ చేసుకుని
మధ్య లో కూర పెట్టి రోల్ చేసి, ఆ రోల్ ని సరిపడా గా కట్ చేసుకుని నూనే లో వెయించు కోవాలి.
ఇది సాస్ తో  తినవచ్చు.


బ్రెడ్ బజ్జి

కావలసిన పదార్దాలు
బ్రెడ్ నాలుగు స్లయిసులు
కార్న్ ఫ్లోర్ ఒక  కప్
ఉప్పు కారం తగినంత


తయారు చేయు విధానము :
 బ్రెడ్ డయమండ్ ఆకారం లో కట్ చేసుకుని  పెట్టుకోవాలి.
 కార్న్ ఫ్లూర్ లో నీళ్ళు పోసి బజ్జి పిండిలా తయారు చేసుకుని  ఉప్పు కారం కలపాలి.
 నూనె వెడి చేసుకొని  పిండిలో బ్రెడ్ ముంచి ఎర్రగా వేయించు కోవాలి. 
 ఇవి సాస్ తో తింటే బాగుంటాయి.

సగ్గుబియ్యం వడ

కావలసిన పదార్ధాలు:
 ఒక కప్ సగ్గుబియ్యం 
బియ్యం పిండి -4 చెంచాలు            
బంగాళదుంప ఒకటి 
ఉప్పు,కారం తగినంత
తయారీ విధానం :
ముందుగ సగ్గుబియ్యం ఒక గంట నానబెట్టాలి.బంగాళదుంపని  ఉడికించి  పక్కన పెట్టుకోవాలి .
తరువాత, నానినా  సగ్గుబియ్యంలో ఉడికించిన  బంగాళదుంప మరియు  బియ్యంపిండి,ఉప్పు,  కారం సరిపడా వేసి కలుపుకోవాలి.
కాగిన నూనెలో సగ్గుబియ్యం పిండిని వడలు లాగ  చేసి ఎర్రగా వేయించుకోవాలి. 
ఇది టొమాటొ చెట్నీతో  కాని సాస్ తో కాని తినవచ్చు.





నా గురించి కొంత

నా పేరు సుశీల ,
నేను గృహిణిని. నాకు కొన్ని అభిరుచులు ఉన్నాయి.అవి మీ లాంటి సుజనులన్దరితో పంచుకోవడానికే,ఈ నా చిన్ని ప్రయత్నం.
నాకు తినడం కన్నా,తినిపించడం అంటే ఇష్టం. కాబట్టి,ముందుగ కొన్ని సులువిన వంటలతో మీ ముందుకు.