24, ఫిబ్రవరి 2011, గురువారం

Century కొట్టాను.ఇప్పటిదాకా post చేసిన వంటలు మీకు అందరికి ఉపయోగపడుతున్నాయి అని ఆశిస్తున్నాను.
చాల మటుకు త్వరగా అయ్యే వంటలే పెట్టాను.ఇంకా మిగిలినవి వచ్చే వారం,అప్పటికి నేను ఇండియాలో ఉంటాను.
bye bye America

మీ సుశీల 

ఆరెంజు జ్యూస్

ఆరెంజు జ్యూస్ కావలసినవి
ఆరంజ్ లేక బత్తాయిలు 12
 పంచదార పావుకిలో
 సిట్రిక్ ఆసిడ్ 1 స్పూన్
ఆరంజ్ ఎసెన్స్  2 స్పూన్స్ 
పోటాషియెం మెటాబైసల్ఫేట్ 1/4 స్పూన్

తయారుచేయువిధానం: బత్తాయిలు రసం తీసిపెట్టుకోవాలి.ఎంత రసం ఉంటె అంత నీరు తీసుకుని గిన్నె స్టవ్ మీద పెట్టి పంచదార వేసి పాకం పట్టాలి.పంచదార బాగా కరిగి నీరు మరుగుతున్నప్పుడు సిట్రిక్ ఆసిడ్ వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. పాకం చల్లారేక బత్తాయి రసం కలిపి,ఆరంజ్ ఎసెన్స్,పొటాసియం మేటబైసల్ఫేట్ కలపాలి.బాగా కలిపి బాటిల్ లో పోసి పెట్టుకోవాలి ఇది చాలారోజులు నిలువ ఉంటుంది సగం జూసు సగం ఐసువాటర్ కలుపుకుని తాగాలి .
  

గ్రేప్ జ్యూస్

గ్రేప్ జ్యూస్ కావలసినవి 
 ద్రాక్ష పళ్ళు 1 కిలో
 పంచదార తగినంత 
 సిట్రిక్ ఆసిడ్ 2 స్పూన్స్
 పొటాసియం మెటాబైసల్ఫేట్ 1/4  స్పూన్ 
 టోనోవిన్ 1 స్పూన్ 
  తయారుచేయువిధానం    ద్రాక్షపళ్ళుబాగా కడుక్కుని గిన్నెలో వేసి గరిటెతో కానీ చేత్తోకాని చితక్కోట్టాలి అన్నిచితికేక స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.చల్లారేకచిల్లుల ప్లేటులో వడపోయాలిఇంకొక గిన్నె తీసుకుని ద్రాక్షరసం ఎంతవచ్చిందో కోలుచుకుని అంత నీరు 1 1/2 పంచదార స్టవ్ మీద పెట్టి పాకం పట్టాలిపంచదారకరిగి నీరు మసలుతున్నప్పుడు,సిట్రిక్ ఆసిడ్ వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.పాకం చల్లారాక,ద్రాక్ష రసం,టోనోవిన్(లేక పొతే గ్రేప్ ఎస్సేన్స్ )మెటాబైసల్ఫేట్ వెయ్యాలి సంవత్సరమంతానిలువ ఉంటుంది.గ్లాసులో సగం జూసు సగం ఐసువాటర్ కలుపుకుని తాగాలి        

మిక్సిడ్ ఫ్రూట్ జామ్

మిక్సిడ్ ఫ్రూట్  జామ్ కావలసినవి
 ఆపిల్ 2
అరెంజు 4
బొప్పాయి పండు 1
ద్రాక్ష 1/2 కిలో
 అరటిపళ్ళు 4
అనాస పండు[ పైనాపిల్]  1   
 పంచదార 1&1/2 కేజీ
 సిట్రిక్ ఆసిడ్ 2 స్పూన్స్
  పొటాసియం మెటాబై సల్ఫేట్ 1/4  స్పూన్
 రెడ్ కలర్ 1/4 స్పూన్
 మిక్సిడ్ ఫ్రూట్ జామ్ఎస్సెన్స్ 2 స్పూన్స్   
 తయారుచేయువిధానం: పళ్ళు అన్నిశుబ్రంగా కడుక్కుని తొక్కలు,గింజలు తీసేయ్యాలి.ముక్కలు కోసుకుని గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టాలి.చల్లారేక మిక్సిలో వేసి గ్రైండ్ చెయ్యాలి తరువాత చిల్లులప్లేటులో వడపోయ్యాలి.వచ్చిన మిశ్రమానికి 1&1/2 పంచదార చేర్చి.స్టవ్ మీద పెట్టి కొంచెం దగ్గర పడేవరకు కలుపుతూ ఉండాలి. సిట్రిక్ ఆసిడ్ వేసి స్టవ్ ఆఫ్ చేసి  మెటాబై సల్ఫ్హేట్,కలర్,ఎస్సన్స్ వేసి బాటిల్ లో పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే బాటిల్ చెక్క మీద పెట్టి వేసుకుంటే బాటిలు విరగదు, ఇది సంవత్సరమంతా నిలువ ఉంటుంది.

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

కేరట్ హల్వా

కేరట్  హల్వా కావలసినవి 
  కేరట్ 4
పంచదార 200 గ్రామ్స్
 పాలు 1 గ్లాస్
 ఏలకులు   4
 జీడిపప్పు 50 గ్రామ్స్
  నెయ్యి  6 స్పూన్స్  
 కిస్మిస్ 50 గ్రామ్స్
  తయారుచేయువిధానం కెరట్ ను  తురుము కోవాలి  .స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి పెట్టుకోవాలి .పాలు పెట్టుకుని కేరట్ తురుము   వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.పంచదారవేసి కొంచెం దగ్గరపడ్డాకనెయ్యి 4 స్పూన్స్ వెయ్యాలి   5 నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేయించిన జీడిపప్పు,కిస్మిస్,ఏలకులపొడి కలిపితే కేరట్ హల్వా రెడి   

19, ఫిబ్రవరి 2011, శనివారం

బాదాం ఖీర్

బాదాం ఖీర్ కావలసినవి
 బాదాం పప్పులు 10 
 పంచదార 2 స్పూన్స్
 ఏలకులు  2 
పాలు 1 గ్లాసు
యారుచేయువిధానం: 
బాదాంపప్పులు నానపెట్టాలి.నానిన పప్పులు పొట్టు తీసి పెట్టాలి, 2 పప్పులు సన్నగా కట్ చేసిపెట్టుకోవాలి మిగతా పప్పులు ,పంచదార,ఏలకులపొడి  మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి దాన్నిపాలల్లో కలిపి 2 నిముషాలుమరగపెట్టాలి చల్లారేక ఫ్రిజు లో పెడితే,త్రాగటానికి చల్లగా బాగుంటుంది.త్రాగేటప్పుడు తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులని వేసుకుని త్రాగితే బాగుంటుంది.
     

17, ఫిబ్రవరి 2011, గురువారం

వేసవి కాలం వచ్చినట్టే,కదా!!! 
ఇంక మనం చల్లచల్లని కబుర్లు చెప్పుకోవచ్చు. 
అదే చలువ చేసే, చల్లనిపళ్ళరసాలు,పానియాలు,జాములు,
జ్యూసులు,మిల్క్ షేక్ల గురించి.
మరి మీకు తోచినవి మీరూ పంపండి. 

16, ఫిబ్రవరి 2011, బుధవారం

చిక్కుడుకాయ - కార్న్ మసాలా



కావలసినవి:

చిక్కుడుకాయలు ముక్కలు చేసినవి - 1 కప్పు
టొమాటొ ముక్కలు - 1 కప్పు
కార్న్ - 1/2 కప్పు
ఉల్లిపాయ ముక్కలు- 1స్పూన్

ఎండుమిర్చి - 4
ఆవాలు-1 స్పూన్
మినపప్పు-1 స్పూన్
జీలకర్ర-1 స్పూన్

ధనియాల పొడి-1 స్పూన్
కార్న్ ఫ్లోర్ - 1 స్పూన్
కారం - 1స్పూన్
ఉప్పు - సరిపడ
అల్లం,వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్


తయారు చేసె విధానం:

ముందుగా చిక్కుడుకాయ ముక్కలు , కార్న్ విడివిడిగ ఉడకపెట్టాలి.
తర్వాత బానలిలో నూనె వేసి తాలింపు, ఉల్లిపాయ ముక్కలు వెయించాక , అల్లం,వెల్లుల్లి ముద్ద వెయ్యాలి .

తర్వాత టొమాటో ముక్కలు వెయ్యాలి.
2 నిముషాలు మగ్గిన తర్వాత ఉడకపెట్టిన చిక్కుడు ముక్కలు , కార్న్ వేసి 4 నిముషాలు మగ్గనివ్వాలి.
తర్వాత ధనియాల పొడి , ఉప్పు , కారం వేసి 2 నిముషాలు ఉంచాలి.

మన కర్రీ రెడి.

కొబ్బరి-కొత్తిమీర పచ్చడి


కావలసినవి :

కొబ్బరి ముక్కలు -1 కప్పు
కొత్తిమీర - 1 కట్ట
ఎండుమిర్చి -6
చింతపండు రసం -2 స్పూన్స్
ఆవాలు -1 స్పూన్

జీలకర్ర -1 స్పూన్
పసుపు- 1/2 స్పూన్
ఉప్పు - సరిపడ
నూనె - 4 స్పూన్స్


తయారు చేసె విధానం:

ముందుగా బానలిలో నూనె వేసి ,ఆవాలు,ఎండుమిర్చి,జీలకర్ర వేయించాలి.
తర్వాత మిక్సి లొ పదార్ధాలు అన్ని వేసి,వేయించిన పోపు వేసి మెత్తగా చేసుకోవాలి.


దోస ఆవకాయ

దోస ఆవకాయ కావలసినవి 
దోసకాయ 1
కారం 1 కప్
ఆవపొడి 1/2 కప్                                                                                
 ఉప్పు 1/2 కప్
 నూనె1 కప్
 తయారుచేయువిదానం   ముందుగా దోసకాయ చేదులేకుండా చూసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి .ఒక బౌల్ తీసుకుని కారం,ఆవపొడి,ఉప్పు వేసి కలుపుకోవాలి .నూనేకుడావేసి బాగాకలిపి దోసకాయ ముక్కలు వేసి కలపాలి సీసా లో కానీ జాడీలోకాని పెట్టుకోవాలి ఇది 5,6నెలలువరకునిలువ ఉంటుంది     

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

పోలి పూర్ణం బూరెలు

పోలి పూర్ణం బూరెలు కావలసినవి
 పెసరపప్పు 1 కప్
 మినపప్పు 1 కప్
 బియ్యం 2 కప్ప్స్
 పంచదార 1 కప్
 కొబ్బరితురుము పావుకప్
 ఏలకులు 4
నూనె వేయించడానికి సరిపడా
  తయారుచేయువిదానం 
 ముందుగ 6 గంటలముందుమినపప్పు,బియ్యం నానపెట్టాలి. నానేక రెండు కలిపి కొంచెం నీరు పోసి  మిక్సిలో మెత్తగా గ్రైండ్ చెయ్యాలి పెసరపప్పు 1 గంటముందు నానపెట్టాలి నానినపెసరపప్పుని నీరు పొయ్యకుం డామెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఇడ్లీ పాత్రలో పెసరపిండినిఇడ్లీలు వేసినట్టు వెయ్యాలి.ఇడ్లీలు చల్లారాక ముక్కలుగా చేసి మిక్సిలో పంచదార,ఏలకులపొడి ,కొబ్బరి తో కలిపి మిక్సిలో వేస్తె పొడిపొడిగా అవుతుంది వాటిని నిమ్మకాయంత ఉండలు చేసి పెట్టుకోవాలి.స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడిచేయ్యాలి  పెసరపిండి ఉండలు మినపప్పు,బియ్యం కలిపి రుబ్బిన పిండిలో ముంచి వేయించాలి ఇవి నెలరోజులు వరకు నిలువ ఉంటాయి    

చోలే

చోలే కావలసినవి 
 సెనగలు పావుకిలో
 ఆలు 1
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 2
ఎండుమిర్చి 2
పోపుకి మినపప్పు,ఆవాలు ,జీలకర్ర ,అల్లం చిన్న ముక్క
 తయారుచేసేవిధానం ముందుగా సెనగలు,ఆలుగడ్డ విడిగా కుక్కర్లోఉడికించుకోవాలి.చల్లారేక సగం సెనగలు  మిక్సిలో వేసి గ్రైండ్ చెయ్యాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి పోపు వేయించి ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి.పచ్చిమిర్చి,కరివేపాకు కూడ  వేసి ఉడికిన ఆలు,ఉడికించిన సెనగలు వెయ్యాలి,గ్రైండ్ చేసిన సెనగల ముద్దా వేసి కొంచెం నీరు పోసి బాగా కలపాలి ఇది పూరిలో,చపాతిలోబాగుంటుంది 

14, ఫిబ్రవరి 2011, సోమవారం

ఆలూ-పాలకూర


కావలసినవి:


ఆలూ పెద్దవి -2

పాలకూర -1కట్ట

పచ్చిమిర్చి -3

ఆవాలు -1 స్పూన్

జీలకర్ర -1

ధననియాలపొడి - 1 స్పూన్

పసుపు -1/2 స్పూన్

ఎండుమిర్చి -2

చింతపండు రసం - 4 స్పూన్స్

నూనె - 4 స్పూన్స్

ఉప్పు -సరిపడ

కారం - 1స్పూన్




తయారు చేసే విధానం:


ఆలూ , పాలకూర కట్ చేసుకుని విడిగా ఉడక పెట్టాలి.


తర్వాత బానలిలో నూనె వేసి పోపు వేయించుకోవాలి.పోపు వేగాక పచ్చిమిర్చి, ఆలూ, పసుపు, ధనియాలపొడి ,పాలకూర,చింతఫండురసం వేసి అన్ని 3 నిముషాలు మగ్గనివ్వలి.

తర్వాత ఉప్పు , కారం వేసుకుంటె కూర రెడి.

13, ఫిబ్రవరి 2011, ఆదివారం

గోంగూరపచ్చడి

గోంగూరపచ్చడి కావలసినవి
 గోంగూర 1 కట్ట
 ఎండుమిరపకాయలు 5
నూపప్పు 2 స్పూన్స్
 మెంతులు 2 స్పూన్స్
 ఇంగువ1/2 స్పూన్
  ఉప్పు తగినంత
  నూనె తగినంత
 సెనగపప్పు1  స్పూన్
 మినపప్పు 1  స్పూన్
 ఆవాలు జీలకర్ర  1 స్పూన్
 తయారుచేయువిదానం ముందుగాగోంగూరబాగాకడుక్కునితడి అరేదాకా అరపెట్టాలిస్టవ్ మీద బాణలిపెట్టిమెంతులు,నూపప్పు,మిరపకాయలు వేయించి .పొడి చేసుకోవాలిబాణలిలో 2  స్పూన్ల నూనె వేసుకునిగోంగూర వేయించుకోవాలి గోంగూర చల్లారాకఅన్నిమిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి చివరగాపోపు,ఇంగువ వేయించి పచ్చడిలో కలపాలి వెల్లుల్లి ఇష్టమైనవారు వెల్లుల్లిపాయలు వేయించి కలుపుకోవచ్చు                

12, ఫిబ్రవరి 2011, శనివారం

వంకాయ..మామిడికాయ పులుసు

వంకాయ..మామిడికాయ పులుసు కావలసినవి
 వంకాయలు 1/2 కిలో
 మామిడికాయ 1
జీడిపప్పు 10
 ఆవాలు.జీలకర్ర ,1 స్పూన్
 బియ్యంపిండి 1    స్పూన్
 నూనె 2 స్పూన్స్
 కారం 1 స్పూన్
 పసుపు చిటికెడు
   తయారుచేయువిదానం వంకాయ,మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవాలిముక్కలుమునిగేలనీరుపో సిఉ           ప్పు,జీడిపప్పు ,పసుపువేసిస్టవ్ మీద పెట్టి ఉడికించాలి ముక్కలు బాగా మెత్తగా అయ్యాక 1 స్పూన్ బియ్యంపిండిలో కొంచెం నీరు పోసి కలిపి పులుసులో కలిపితే బాగా కలుస్తుంది పోపు వేయించి 1 స్పూన్ కారం వేసుకుని స్టవ్ ఆఫ్ చెయ్యాలి 1 స్పూన్ ఆవపొడినూరుకుని1 స్పూన్ నూనె వేసి కలిపితేవంకాయ.మామిడికాయ పులుసు బాగుంటుంది    

గుమ్మడికాయకూర

గుమ్మడికాయకూర కావలసినవి 
 గుమ్మడికాయ [తీపిది] సగంచెక్క
 చింతపండురసం4 స్పూన్స్
 సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1 స్పూన్
 ఆవాలు.జీలకర్ర 1 స్పూన్
 పచ్చిమిర్చి 2
 ఎండుమిర్చి 2
కరివేపాకు
 చిన్నబెల్లం ముక్క
 పసుపు చిటికెడు
నూనె 3 స్పూన్స్
తయారుచేయువిధానం గుమ్మడికాయ తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి ఈముక్కల్లో  .ఉప్పు.పసుపు చేర్చి ఉడకపెట్టాలి ..స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్స్ నూనెవేసి సెనగపప్పు.మినపప్పు.ఆవాలు .జేలకర్ర .ఎండుమిర్చి వేయించాలి పోపు వేగేక పచ్చిమిర్చి .కరివేపాకు వెయ్యాలి .ఉడికిన కూరముక్కలు .చింతపండు రసం.చిన్నబెల్లంముక్క వెయ్యాలి కూర బాగాకలిసేక స్టవ్ ఆఫ్ చేసి  1 స్పూన్ ఆవాలు తీసుకుని  మెత్తగా నూరుకుని1 స్పూన్ నూనె కలిపి కూరలో బాగా కలపాలి  మా పెద్ద అబ్బాయికి ఈకూర చాలా ఇష్టం   

బొప్పాయికాయకూర

బొప్పాయికాయకూర కావలసినవి 
 బొప్పాయికాయ
 చింతపండురసం 4 స్పూన్స్
ఆవాలు 2 స్పూన్స్
 జీలకర్ర 1 స్పూన్
 మినపప్పు 1 స్పూన్
ఎండుమిర్చి 2
  పచ్చిమిర్చి 2
 కరివేపాకు
 పసుపుచిటికెడు
 ఉప్పుతగినంత
  తయారుచేయువిదానం  ముందుగా బొప్పాయికాయని తురుముకొని పసుపు.ఉప్పు కలిపి ఉడకపెట్టాలి. స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసుకుని ,1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు,1స్పూన్  జీలకర్ర ,2 ఎండుమిర్చి 2 పచ్చిమిర్చి కరివేపాకు పోపు వేయించుకోవాలి. ఉడకపెట్టిన  బొప్పాయి తురుము వేసి చింతపండురసంవేసి సరిపడా ఉప్పు వెయ్యాలి కూరరెడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ ఆవాలు మెత్తగా నూరుకుని  1 స్పూన్ నూనె కలిపి కూరలో కలపాలి [.బొప్పాయి కాయని సన్నగా ముక్కలు చేసుకుని నూనెలో వేయించుకుని ఉప్పు కారం వేస్తె కూడా బాగుంటుంది].ఈకూర తింటే పాలు ఇచ్చే తల్లులకు పాలు బాగా పడతాయి. 

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

మామిడికాయ-జీడిపప్పు కూర


కావలసినవి:

పచ్చి మామిడికాయ - 1
ఉల్లిపాయ -1
జీడిపప్పు -1/2 కప్పు
ధనియాల పొడి -1 స్పూన్
ఉప్పు సరిపడ
కారం సరిపడ
పసుపు
నూనె 4 స్పూన్స్
ఆవాలు -1 స్పూన్
జీలకర్ర లేదా జీలకర్ర పొడి-1 స్పూన్
కరివేపాకు

తయారు చేసె విధానం:

ముందుగా జీడిపప్పు 1 గంట నానపెట్టుకోవాలి.

జీడిపప్పు నానిన తరువాత మామిడికాయ చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఇప్పుడు జీడిపప్పు , మావిడికాయ ముక్కలు విడిగా 10 నిముషాలు ఉడకనివ్వలి.
ఇప్పుడు బానలిలో నూనె పోసి , తాలింపు , ఉల్లిపాయముక్కలు వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపు,ధనియాల పొడి వెయ్యలి.
ఇప్పుడు ఉడికిన మావిడికాయ ముక్కలు , జీడిపప్పు వేసి 3 నిముషాలు
మగ్గనివ్వాలి. (అవసరమైతె కొంచుం నీళ్ళు పోసి మగ్గించుకోవాలి.)
చివరగా ఉప్పు , కారం వేసుకోవాలి.

మినపప్పుతో మురుకులు

మినపప్పుతోమురుకులుకావలసినవి 
 మినపప్పు 1 కప్ 
బియ్యంపిండి 2 కప్పులు
 నూపప్పు4 స్పూన్స్
 నూనె సరిపడా
   ఉప్పు 1 స్పూన్ 
 కారం   1  స్పూన్ 
  తయారుచేయువిధానం మినపప్పు 2 గంటలముందునానపెట్టుకోవాలి నానినపప్పుని నీరు ఎక్కువ పోయకుండా గారెల పిండిలా మెత్తగారుబ్బుకోవాలిఈపిండిలోబియ్యంపిండి .,నూపప్పు, ,ఉప్పు  ,కారం కలపాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పెట్టుకోవాలి మురుకుల గొట్టంతో మురుకులు వేయించుకోవాలి  [  మినపప్పు,బియ్యం మర పట్టించి కూడా ఇలా చేసుకోవచ్చు] 

బేసిన్ లడ్డు

బేసిన్ లడ్డు కావలసినవి 
 సెనగపిండి 1 కప్
 పంచదార 1 కప్
 నెయ్యి 5 స్పూన్స్
 ఏలకులు 2  
 తయారుచెయువిదానం స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి కరిగేక సెనగపిండి వేసి వేయించాలి కమ్మనివాసనవచ్చేదాకావేయించాలి పంచదార మిక్సిలోవేసి మెత్తగాచేసిసెనగపిండిలోవేసి10నిమిషాలుకలిపితే బాగాకలుస్తుందిఏలకులపొడి కలిపి స్టవ్ ఆఫ్ చేసి లడ్డులు చేసుకోవాలి       

ఆలూతోమురుకులు

ఆలూతోమురుకులు కావలసినవి 
 బంగాలదుంపలు 2
బియ్యంపిండి పావుకేజీ
 నూపప్పు 4 స్పూన్స్
 ఉప్పు1 స్పూన్
 కారం1 స్పూన్
 నూనె వేయించడానికిసరిపడా 
 తయారుచేయువిధానం 
బంగాల దుంపలు ఉడకపెట్టి చిదపాలి. దానిలోబియ్యంపిండి,ఉప్పు,కారం,నూపప్పుకలపాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడిచేసుకోవాలి.మురుకుల గొట్టంలో ఈపిండిపెట్టి మురుకులు వేయించుకోవాలి         

10, ఫిబ్రవరి 2011, గురువారం

సగ్గుబియ్యంతోమురుకులు

సగ్గుబియ్యంతోమురుకులు  కావలసినవి 

 సగ్గుబియ్యం 1 కప్

బియ్యంపిండి 2 కప్స్
 పెరుగు 1 కప్
నూపప్పు 4 స్పూన్
 ఉప్పు 1 స్పూన్  
 కారం 1 స్పూన్
 నూనె వేయించడానికి సరిపడా
 తయారుచెయువిదానం సగ్గుబియ్యం 2 గంటలముందు పెరుగులోనానపెట్టాలి.నానిన  సగ్గుబియ్యంలో,బియ్యంపిండి. ఉప్పు,కారం,నూపప్పు కలిపి మురుకులగొట్టంలో నింపి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసుకుని నూనె కాగేక మురుకులు వేయించుకోవాలి 

9, ఫిబ్రవరి 2011, బుధవారం

క్యాబేజి మిక్స్ డ్ వెజిటేబుల్ కర్రి

క్యాబేజి:1/4 కి.లో
మిక్స్ డ్ వెజిటేబుల్స్ 
క్యారెట్
బీన్స్
పచ్చిబఠానీ (green peas)
అన్ని కలిపి 1/4 కి.లో
ఉల్లిపాయలు:2
జిడి పప్పు:100గ్రా
ఉప్పు,నూనె:-సరిపడ.
ముందుగా క్యాబేజి ని సన్నగా తరిగి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకొవాలి.క్యాబేజి ఉడికే లోగా క్యారెట్,బీన్స్,ఉల్లిపాయలుని సన్నగా ముక్కలు చేసుకొవాలి.తరువాత మూకుడులో నూనె వేసి పోపు వేసి తరిగిన ముక్కలు,గ్రీన్ పీస్,జీడి పప్పు వెసి కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి.కొంచెం ఎర్ర పడ్ద్దాక వాటిలొ క్యాబేజి కుడా వేసి నీరు అంతా  ఇంకిపొయి వరకు ఉంచాలి అప్పుడు కూర రేడి.
ఈ కూర అన్నంలోకి కూడ బావుంటుంది.

ఉసిరికాయ పచ్చడి

సిరికాయ పచ్చడి కావలసినవి
 ఉసిరికాయలు 1 కేజీ
 ఉప్పుపావు కేజీ
ఆవాలు  1  స్పూన్
 జీలకర్ర  1 స్పూన్
మెంతులు 2  స్పూన్స్
 ఎండుమిర్చి 2
పచ్చిమిర్చి  2
కొత్తిమీర
 పసుపు  5   స్పూన్స్   
 తయారుచెయువిదానం      ఉసిరికాయలు కట్ చేసుకుని లోపల గింజ తీసేయ్యాలి పసుపు కలిపి 3 రోజులు ఉంచాలి మూడోరోజుకి ముక్క మెత్తపడుతుంది అప్పుడు ఉప్పు కలిపి మిక్సిలో వేసి సీసాలో పెట్టుకోవాలి ఇదిసంవత్సరమంతా నిలువ ఉంటుంది కొంచెం పచ్చడితీసుకుని పచ్చిమిరపకాయలు ,ఎండుమిరపకాయలు ,మెంతిపొడి ,కొత్తిమీర మిక్సిలో వేసుకునిపచ్చడిలో కలుపుకోవాలి  పోపు వేసుకోవాలి 

చింతకాయ,పండుమిరపకాయపచ్చడి

  చింతకాయ,పండుమిరపకాయపచ్చడి
   మిరపపళ్ళు1 కేజీ
 చింతకాయలు పావుకేజీ
 ఉప్పు పావుకేజీ
 మెంతులు 5 స్పూన్స్
 ఆవాలు
 జీలకర్ర
 పసుపు
 ఇంగువ
 నూనె
  తయారుచెయువిదానం చింతకాయలు దంచుకుని గింజ తీసేయ్యాలి .చింతకాయముద్దని,మిరపపళ్ళు.,ఉప్పు ,పసుపు కలిపి మిక్సిలో వేసి మెత్తగాచేసిసీసాలో పెట్టుకోవాలిఇది సంవత్సరమంతానిలువ ఉంటుంది   కావాలనుకున్నప్పుడుకొంచెం తీసుకుని పోపులో వేసుకోవాలి మెంతులు బాగా వేయించి పొడి చేసుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకునివేడి చెయ్యాలిఆవాలు ,జీలకర్ర ,ఇంగువ వేయించుకుని పచ్చడిలో కలపాలి వెల్లులి ఇష్టముంటేవేయించి కలుపుకోవచ్చు       

రాజ్ మా కర్రీ

రాజ్ మా(ఎర్ర బిన్స్):1/2 కిలో
ఉల్లిపాయలు: నాలుగు
టమటాలు:పది.
నెయ్యి లేదా నూనె:సరిపడా .
కారం:2 చెంచాలు.
వెల్లుల్లి:20
ధనియాల పొడి:2 చెంచాలు.
గరం మసాలా:1 చెంచా.

రాజ్ మా ను కడిగి 8 నుంచి 10 గంటల పాటు నీటిలో నాననిచ్చి ఆ నీటితోనే కుక్కరు పెట్టి ఉడకబెట్టి నీటిని వడకట్టి(గ్రేవీకి ఆ నీరు వాడాలి)ఉంచాలి.బాండీలో నెయ్యి వేసి కాగిన తర్వాత ఉల్లి ముక్కలు,వెల్లుల్లి ముద్ద వేయించాలి .దాంట్లొ కారం,పసుపు,ధనియాల పొడి,ఉప్పు వేసి బాగా నెయ్యి పైకి తేలే వరకు వేయించి దాంట్లొ టమటా సన్నని ముక్కలు వేసి ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మెత్తబడే వరకు సన్నని మంట మీద ఉడకనిచ్చి టమాటాలు  మెత్తబడిన తరువాత ఉడికించిన రాజ్ మా వేసి అవి ఉడికిన నీళ్ళు కూడ కొంచెం పోసి 10 నిమిషాలు ఉడికించి గరం మసాలా కొత్తిమీర చల్లి 5 నిమిషాలు ఉంచి కలిపి దింపాలి.గ్రేవిచిక్కగా చపాతి లోకీ బావుంటుంది.

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

మంచూరియా

మీల్ మేకర్:200 గ్రాములు.
ఉల్లికాడలు:100 గ్రాములు.
అల్లం-వెల్లుల్లి:100 గ్రాములు.
కొత్తిమీర:3 కట్టలు.
అజినమెటా:2 చెంచాలు.
వెనిగర్:4 చెంచాలు.
నూనె,ఉప్పు:సరిపడ.

ముందుగా మీల్ మేకర్స్ ను నీటిలో నాననిచ్చి పదినిమిషాలు ఉడికించాలి.తరువాత నీరువార్చి వేడి నూనెలో ఒక్కసారి వేపి తీయాలి.బాండీలో నూనె పోసి కాగిన తరువాత పచ్చిమిర్చి సన్ననిముక్కలు,అల్లం-వెల్లుల్లి మిక్సిలో వేసి ఎర్రగా వేపాలి.తరువాత మీల్ మేకర్స్ను వేయాలి.దీంట్ల్లో 2 గ్లాసులు నీళ్ళు పోసి శోయాసాస్,అజినమెటా,వెనిగర్,సరిపడ ఉప్పు వేసి ఉడికించాలి.తరువాత కార్న్ ఫ్లౌర్ని నీటిలో కలిపి దీంట్ల్లో పోసి నీరు ఇంకిపోయేంత వరకు గరిటెలో కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి.నీరు ఇంకిన తరువాత సన్నగా తరిగిన ఉల్లి కాడలు,కొత్తిమీర వేసి పొడిగా వేపాలి.అప్పుడు మంచూరియా తయారు.

స్టఫ్ఫ్ డ్ - భెండి


కావలసినవి:::
బెండకాయలు--1/2 కిలో
టొమటొ-----1రసం తీసి పెట్టుకోవాలి
జీలకర్ర------1 స్పూన్
పచ్చిమిర్చి---3
తురిమిన అల్లం
సన్నగా తరిగిన ఉల్లిపాయ--1
నూనె--------4 స్పూన్స్

స్టఫ్ఫింగ్ కోసం:::

ధనియాల పొడి---3 స్పూన్స్
కారం----------1/2 స్పూన్స్
ఉప్పు సరిపడ
నూపప్పు--------3 స్పూన్స్
పసుపు----------1/2 స్పూన్



తయారు చేసే విధానం:::


స్టఫ్ఫింగ్ కోసం పెట్టుకున్న పదార్ధాలు అన్ని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
బెండకాయ సన్నగ చీల్చుకుని సిద్దంగా ఉన్న పొడి ని దాన్లో పెట్టుకోవాలి.

బాణలిలో   నూనె వేసి జీలకర్ర ,పచ్చ్చిమిర్చి , ఉల్లిపాయ ముక్కలు, అల్లం వేసి వేయించుకోవాలి.

ఉల్లిపాయ బాగ వేగిన తర్వాత టొమటొ ముక్కలు లేదా టొమటొ రసం వేసి 3-4నిముషాలు ఉంచాలి.

ఇప్పుడు కూరి పెట్టుకున్న బెండకాయలని బాణలి  ఉన్న మిశ్రమంతో కలిపి 5 నిముషాలు ఉంచాలి.

స్టఫ్ఫ్ డ్ - భెండి అన్నంలోకి లేద రోటిలోకి బావుంటుంది

పాలకూర-ఆనపకాయ


కావలసినవి:
పాలకూర----1 కట్ట
ఆనపకాయ---1కప్పు చిన్న ముక్కలు
చింతపండు రసం---4 లేద 5 స్పూన్స్
ఉప్పు---సరిపడ


తాళింపుకి ::
పచ్చిమిర్చి-4
ఆవాలు-1/2 స్పూన్
శనగ పప్పు-1/2 స్పూన్
మినపప్పు-1/2 స్పూన్

తయారు చేసే విధానం :


ముందుగా పాన్ లో తాలింపు ,పచ్చిమిర్చి వేయించుకోవాలి.
తర్వాత చింతపండు రసం వేసి 1 నిముషం ఉంచాలి.
ఇప్పుడు ఆనపకాయ ముక్కలు , పసుపు వేసి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
ముక్కలు మెత్తబడిన తర్వాత కట్ చేసిన పాలకూర, ఉప్పు వేసి 4నిముషాలు ఉంచి కొత్తిమీర చెల్లుకుంటే తినడనికి రెడి.

ఈ కూర అన్నం లోకి , రోటి లోకి బావుంటుంది.



చింతకాయపచ్చడి

చింతకాయపచ్చడి కావలసినవి
చింతకాయలు 1 కేజీ
ఉప్పు పావు కేజీ
 మెంతులు
 ఆవాలు
 జీలకర్ర
 పచ్చిమిర్చి
 ఎండుమిర్చి
 పసుపు
 ఇంగువ
యారుచేయువిధానం:
 చింతకాయలు ,ఉప్పు,పసుపు  దంచి 3 రోజులు ఉంచాలి. మూడోరోజు గింజ తీసేయ్యాలి 
ఇది  కొంచెం ,కొంచెం చేసుకోవచ్చు,ఇది సంవత్సరమంతానిలువ ఉంటుంది.
 కొంచెంపచ్చడి తీసుకుని 1 స్పూన్ మెంతిపొడి ,2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి,
కొత్తిమీర,చిన్నబెల్లంముక్కఅన్ని మిక్సిలో వేసి మెత్తగా చేసుకుని పోపు వేసుకోవాలి            

పండుమిరపకాయల పచ్చడి

 పండుమిరపకాయల పచ్చడి కావలసినవి 
  పండుమిరపకాయలు1 కెజి
 చింతపండు పావు కేజీ
 బెల్లం 100 గ్రామ్
 మెంతులు 5 స్పూన్స్
 ఉప్పు పావు కేజీ
  ఆవాలు 1 స్పూన్
  జీలకర్ర 1 స్పూన్ 
  ఇంగువ 1 స్పూన్
 నూనె  4     స్పూన్స్
  తయారుచెయువిదానం మెంతులు వేయించుకుని పొడి చేసుకోవాలి మిరపపల్లు.,చింతపండు .,ఉప్పు ,బెల్లం మెంతిపొడి మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి మరునాడు 4 స్పూన్ల నూనె వేడిచేసుకుని  ఆవాలు .జీలకర్ర ,1  స్పూన్ ఇంగువ వేసి కలపాలి 

7, ఫిబ్రవరి 2011, సోమవారం

కంద బచ్చలికూర

కంద బచ్చలికూర కావలసినవి 
 కందపావుకేజీ
 బచ్చలి ఆకు1 కట్ట
 చింతపండురసం 4 స్పూన్స్
 ఎండుమిర్చి2
పచ్చిమిర్చి 2
కరివేపాకు
 సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు1 స్పూన్
 ఆవాలు.,జీలకర్ర 1 స్పూన్
  ఆవపొడి1 స్పూన్
 నూనె 2 స్పూన్
 ఉప్పు తగినంత
  తయారుచెయువిదానం: కంద కట్ చేసుకుని ఉడికించుకోవాలి ,బచ్చలి సన్నగా కట్చేసుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి పోపు వేయించుకోవాలి పోపులో బచ్చలి ఆకువేసి మగ్గించాలి ఆకు ఉడికేక కందముక్కలు వేసి చింతపండు రసం ఉప్పు వెయ్యాలి ,కూరంతాబాగా కలిసేలా కలపాలి స్టవ్ ఆఫ్ చేసాక  అవపోడిలో1 స్పూన్ నూనె వేసి కూరలో వేసి కలపాలి.

కంద వడలు

కంద వడలు కావలసినవి 
 కంద పావు కేజీ
 సెనగపప్పుచిన్నకప్
 బియ్యంపిండి2 స్పూన్
 ఎండుమిర్చి 2    
పచ్చిమిర్చి 2
జీలకర్ర సగం స్పూన్
 ఉప్పు తగినంత
  అల్లంచిన్నముక్క
 నూనె వేయించడానికి సరిపడా
 తయారుచెయువిదానం సెనగపప్పు అరగంట ముందు నానపెట్టాలి ,   కందకట్ చేసుకొనిసెనగపప్పు .,ఎండుమిర్చి ,పచ్చిమిర్చి అల్లం .ఉప్పు జీలకర్రమిక్సిలోవేసినీరుపోయకుండాగ్రైండ్ చేసుకోవాలిబియ్యంపిండి కలపాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసివడలు వేయించుకోవాలిఇవి అన్నంలోబాగుంటాయి [ ఈపిండితోకందఅట్టు కూడా వేసుకోవచ్చు]                      

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

పనసపొట్టుకూర

పనసపొట్టుకూరకావలసినవి
 పనసకాయచిన్నది
 చింతపండురసం 4 స్పూన్స్
 సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1 స్పూన్
ఆవాలు జీలకర్ర 1 స్పూన్
 ఎండుమిర్చి 2
పచ్చిమిర్చి 2
 కరివేపాకు2 రెమ్మలు
 పసుపు చిటికెడు
 నూనె 4 స్పూన్స్
  జీడిపప్పు10
 తయారుచేయువిధానం     పనసకాయ పైన తొక్క మద్యలో గట్టిగ ఉన్న బాగం తీసేసి ముక్కలుకోసుకుని మిక్సిలో వేసి పొట్టు చేసుకోవాలి తగినన్ని నీళ్ళు, ఉప్పు., పసుపు వేసి స్టవ్ మీదపెట్టి ఉడకపెట్టాలి ఉడికిన తరువాత చిల్లుల ప్లేటులో వార్చుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనెవేసి పోపు వేయించుకోవాలి . పనసపొట్టు నీరు పిండేసి పోపులోవేసి చింతపండురసం వెయ్యాలిస్టవ్ఆఫ్ చేసేక1 స్పూన్  అవపోడిలో 1 నూనె వేసి కలిపితే కూర బాగుంటుంది       

5, ఫిబ్రవరి 2011, శనివారం

పచ్చిమిర్చికూర

  పచ్చిమిర్చి కూర  కావలసినవి
  పచ్చిమిర్చి కొంచెం లావుగా ఉన్న కాయలు పావుకిలో
  సెనగపిండి చిన్నకప్పు
 జీలకర్ర 1 స్పూన్
 ఉప్పు తగినంత
నూనె 4 స్పూన్
 తయారుచేయువిధానం మిరపకాయలు బాగా కడుక్కుని చాకుతో మద్యలో ఒక వేపే గాటులా పెట్టి గింజలు తీసేయ్యాలి . సెనగపిండిలోi ఉప్పు .,జీలకర్రపొడి .,2 స్పూన్ల నూనెవేసి కలపాలి ఆపిండిని మిరపకాయ మద్యలో పెట్టాలి అన్ని మిరపకాయలు పెట్టుకున్నాక ,స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేయించుకోవాలి ఇవి ఎక్కువ కారం ఉండవు  అన్నంలోకి బాగుంటుంది  

వెజిటబుల్ సూప్

వెజిటబుల్ సూప్ కావలసినవి
 కేరట్ 1
కేబేజీ 100 గ్రామ్
 ఉల్లిపాయ 1
అల్లం చిన్నముక్క
 వెల్లులి చిన్నది
 ఉప్పు 1 స్పూన్
 పంచదార 1 స్పూన్
 కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
 మిరియాలు 4
  తయారుచేయువిధానం కేరట్కే,బేజీ,ఉల్లిపాయ,అల్లం, వెల్లులి కట్ చేసుకుని 1 గ్లాసు నీరుతీసుకుని ఉడకపెట్టాలి. చల్లారాక మిక్సిలో వేసి గ్రైండ్ చేసి వడపోసుకోవాలి. ఇంకో గ్లాసు నీళ్ళు తీసుకుని 2 స్పూన్ల కార్నఫ్లోర్ కలిపి వడపోసిన దాంట్లో కలిపి స్టవ్ మీద పెట్టి 10 నిముషాలు కలపాలి. ఉప్పు,పంచదార,మిరియాలపొడి కలపాలి.అందించేముందు కేరట్ ,కేబేజీ సన్నగా కట్ చేసుకుని ఉడికించిన ముక్కలు కలుపుకుంటే బాగుంటుంది 

4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

పిండి పులిహార

 పిండి పులిహార  కావలసినవి 
 బియ్యం రవ్వ 2 కప్పులు
 చింతపండురసం 4 స్పూన్స్
 సెనగపప్పు1 స్పూన్
 మినపప్పు1 స్పూన్
ఆవాలు 1 స్పూ ను
జీలకర్ర 1 స్పూన్
ఎండుమిర్చి 2
నూనె 4 స్పూన్స్
 కరివేపాకు తగినంత
 తయారుచేయువిధానం: 
బియ్యం రవ్వలో 4 కప్పుల నీరు పోసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
చల్లారాకఒకప్లేటులోవేసుకుని పొడి,పొడిగ చేసుకోవాలి చిటికెడు పసుపు వేసి 1 స్పూన్ నూనె వెయ్యాలి పోపు వేయించుకుని కలుపుకోవాలి చింతపండు రసం ఉడికించుకుని కలపాలి తగినంత ఉప్పు కలిపి కరివేపాకు కూడా వేయించుకుని కలిపేస్తే పిండి పులిహార రెడి
.
.

పిండి

పిండితయారుచేయటానికి కావలసినవి
 బియ్యం రవ్వ 2 కప్
 పెసరపప్పు పావుకప్
 పచ్చిమిర్చి 2
కరివేపాకు 2 రెమ్మలు
 మినపప్పు 1 స్పూన్
ఆవాలు   1
జీలకర్ర 1
 నూనె 2 స్పూన్స్
 తయారుచేసేవిధానం కుక్కర్లో నూనె వేసుకుని మినపప్పు,ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,పచ్చిమిర్చి,కరివేపాకు  వేయించుకోవాలి 4 కప్పుల నీరుపోసి వేడిచేసుకోవాలి బియ్యంరవ్వ,పెసరపప్పు కడుగుకుని కుక్కర్లో వేసి స్టవ్ తగ్గించి విజిల్ పెట్టకుండామూతపెట్టి  కలుపుతూ ఉండాలి 15 నిమిషాలలో పిండి రెడి అవుతుందిని. నెయ్యి వేసుకుని, పచ్చడితో తింటే బాగుంటుంది.

3, ఫిబ్రవరి 2011, గురువారం

మైదాతోమురుకులు

మైదాతోమురుకులు కావలసినవి
  మైదా 1 కప్
బియ్యం పిండి పావుకప్
 నూపప్పు 2 స్పూన్స్
 ఉప్పు ;కారం ;నూనె తగినంత
 మురుకులగోట్టం
 తయారుచేయువిధానం మైదాపిండిని కుక్కర్లోపెట్టి  3 విజిల్స్ వచ్చేక స్టవ్ ఆఫ్ చెయ్యాలి పిండి జిగురు పోయి పొడిగా అవుతుంది దానిలో బియ్యంపిండి ,ఉప్పు ,కారం నూపప్పు కలిపి 2 స్పూన్ల వేడిచేసిన నూనె వేసి తగినన్ని నీరు చేర్చి మురుకులపిండికలుపుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసుకుని వేడిచేసుకోవాలి ,,మురుకులగోట్టంలో పిండి వేసుకుని మురుకులు తయారు చేసుకోవాలి

పాలక్ పకోడి

కావలసినవి::
పాలకూర సన్నగ తరిగినవి- 2 కప్పులు
శనగపిండి - 1 కప్పు
కార్న్ ఫ్లోర్ - 2 స్పూన్స్
ఉల్లిపాయ సన్నగ తరిగినవి - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 4
అల్లం ముద్ద - 1/2 స్పూన్
పల్లీలు
జీడిపప్పు
ఉప్పు
నూనె - వేయించడానికి సరిపడ

తయారు చేసే విధానం:
పైన ఉన్న పదార్ధాలు అన్నీ నీళ్ళు పోసి పిండిలా కలుపుకోవాలి.
నూనె వేడి చేసి చిన్న చిన్న పకోడిలలా వేయించుకోవాలి.

రవ్వదోస

రవ్వదోస కావలసినవి
  బొంబాయి రవ్వ 1 కప్
 మైదా 1 కప్
 బియ్యం 2 కప్స్
 కేరట్  1
ఉల్లిపాయ 1
కొబ్బరి సగం చిప్ప
 జీడిపప్పు 10
పచ్చిమిర్చి4
 కొత్తిమీర కట్ట
 ఉప్పు తగినంత
 జీలకర్ర 1 స్పూన్
 తయారుచేయువిధానం :
బియ్యం 2 గంటలముందునానపెట్టుకోవాలి. నానిన బియ్యాన్ని మిక్సిలోవేసి చాలమేత్తగా చెయ్యాలి. బియ్యంపిండి 'మైదా, రవ్వ 8 కప్పుల నీరు చేర్చి కలుపుకోవాలి ఉప్పు ,జీలకర్ర కలిపి 1 గంట నానపెట్టాలి.  కేరట్ ,కొబ్బరి తురుముకోవాలి ,ఉల్లిపాయ ,పచ్చిమిర్చి,కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి ,జీడిపప్పు చిన్న ముక్కలు చేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని వేడి చేసాక నూనిరాసి గరిటతో సన్నగా దోస పిండి పొయ్యాలి అదోస పైన  కేరట్ తురుము  కొబ్బరి తురుము ,ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,కొత్తిమీర ,కాజు చల్లుకుని రెండు వేపుల వేయించుకుంటే రవ్వదోసరెడి ,   

2, ఫిబ్రవరి 2011, బుధవారం

కార్న్ ఫ్రైడ్ రైస్







కావలసినవి:
బియ్యం - 2 కప్పులు

స్వీట్ కార్న్ -2 కప్పులు
ముక్కలుగా తరిగిన...... ఆలూ
ఉల్లిపాయ
బీన్స్
కాప్సికం
క్యారట్
బీట్రూట్
పచ్చిమిర్చి
జీడిపప్పు
కరివేపాకు
కొత్తిమీర
మసాలాకి ..............లవంగాలు
అల్లం,వెల్లుల్లి ముద్ద-1స్పూన్
బిర్యాని ఆకు
యాలకులు
తయారు చేసే విధానం:

కుక్కర్లో నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించుకోవాలి.
తర్వాత మసాలా పదార్ధాలు ,కార్న్ , పచ్చిమిర్చి , జీడిపప్పు , కరివేపాకు వెయ్యాలి.
అవి వేగగానే తరిగిన కూర ముక్కలు అన్నీ వేపుకోవాలి.
ఇప్పుడు కడిగిన బియ్యం వెయ్యలి.2 నిముషాలు మసాల అంతా కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు 5 కప్పులు నీళ్ళు పోసి ,,సరిపడ ఉప్పు వేసికుక్కర్ విజిల్ పెట్టాలి.
కుక్కర్ 3 విజిల్స్ రాగనే ఆపేసి బాగా కలుపుకోవాలి.
కొత్తిమీర చల్లుకుంటే కార్న్ ఫ్రైడ్ రైస్ రెడి.










పుట్నాలపప్పుతోమురుకులు

  కావలసినవి 
  పుట్నాలపప్పు  1 కప్
 బియ్యం పిండి  2 కప్స్
 ఉప్పు,కారం,నూనె తగినంత
 నూపప్పు 2  స్పూన్స్
 మురుకుల గొట్టం 
 తయారుచేయువిధానం:  పుట్నాలపప్పు మిక్సిలో వేసి పిండిచేయ్యాలి ఈపిండిలో బియ్యంపిండికలిపి 2 స్పూన్ల నూనె వేడిచేసి వెయ్యాలి,ఉప్పు,కారం, నూపప్పు కలిపి తగినన్ని నీరు చేర్చి కలుపుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడిచేసుకోవాలి మురుకుల గొట్టం తీసుకుని పిండి పెట్టుకుని కాగిన నూనెలో వేయించుకోవాలి