14, మార్చి 2011, సోమవారం

వంకాయ-కొత్తిమీర కూర



కావలసినవి:

వంకాయలు
కొత్తిమీర
పల్లీలు - 1/2 కప్పు
ఎండుమిర్చి - 6
శనగపప్పు -1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
జీలకర్ర పొడి -1/2 స్పూన్
ధనియాల పొడి - 1/2 స్పూన్
ఉప్పు సరిపడ
కారం
నూనె - 1/2 కప్పు

తయారు చేసె విధానం:

ముందుగా 2 స్పూన్స్ నూనె వేసి శనగపప్పు , ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి వేయించుకుని, కొత్తిమీర కూడా కలిపి పొడి చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు బానలిలో నూనె వేసి వంకాయ ముక్కలు వేసి మెత్తగ మగ్గించుకోవాలి.

ముక్కలు మెత్తగా అయ్యాక , కొత్తిమీర పలీల పొడి , ఉప్పు , జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.

వంకాయ- కొత్తిమీర కూర రెడి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి