16, మార్చి 2011, బుధవారం

శేజవాన్ సింగపురి ఫ్రైడ్ రైస్


కావలిసిన పదార్ధాలు: 

  1. ఒక కప్పు కారెట్ 
  2. ఒక కప్పు బీన్స్ 
  3. ఒక కప్పు ఉల్లికాడలు 
  4. ఒక కప్పు ఆలు 
  5. ఒక కప్పు బీట్ రూట్ 
  6. ఒక కప్పు ఉల్లిపాయలు
  7. సరిపడా బియ్యం 
  8. ఇంకా పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు మరయు పోపు దినుసులు తగినన్ని ఇంకా ఉప్పు కారం మరియు కొంచం రెడ్ ఫుడ్ కలర్ ఇంకా అల్లం వెల్లులి పేస్టు ఇంకా అజనోమతో ఇంకా ఇది సింగపురి ఫ్రైడ్ రైస్ కాబట్టి  కొంచం తీపి కి పంచదార కూడా మరియు సోయా సాస్ ఇంకా చిల్లి సాస్ 

తయారు చేయు విధానం:

ముందుగ బియ్యం ఉడికించి పెట్టుకోవాలి తరవాత  ఒక పాన్ పెట్టుకుని అందులో పోపు దినుసులు మరియు మిరపకాయలు వేసి కొంచం వేగాక అజనోమతో ఇంకా అల్లం వెల్లులి పేస్టు వేసి వేగాక  కారెట్ బీన్స్ ఉల్లికాడలు ఆలు బీట్ రూట్ ఉల్లిపాయ ముక్కలు వేసి సగం వేగాక పచ్చి మిరపకాయలు వేసి వేయించి అందులో అన్నం కలపాలి తరవాత దాంట్లో కొంచం షుగర్ వేసి సోయా సాస్ కారం  ఉప్పు చిల్లి సాస్ వేసి కాసేపు వేయించాలి. బాగా వేగాలి ఒక ఇరవై నిముషాలు పాటు వేయించాలి. లాస్ట్ లో ఫుడ్ కలర్ ఆడ్ చేసి సర్వే చేయాలి. అబ్బ చాల బాగుంటుంది ట్రై చేసి చుడండి మళ్ళి మళ్ళి చేస్తారు 
కారం తినేవాళ్ళకి తీపి తినేవాళ్ళకి కూడా మంచి డిష్ ఇది.

ధన్యవాదాలు

మీ శైలజ కందికొండ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి