26, మార్చి 2011, శనివారం

ఫుదిన-కొత్తిమీర అన్నం


కావలసినవి:
వండిన అన్నం-11/2 కప్
పుదిన ఆకులు తరుగు-1/2 కప్
కొత్తిమీర తరుగు-1/2 కప్
ఉల్లిపాయ-1 సన్నగా తరుగుకోవాలి
పచ్చిమిర్చి-3-4 మధ్యలొకి తరగాలి
నెయ్యి-1 టేబుల్ స్పూన్
అల్లం,వెల్లుల్లి ముద్ద- 1 టీ స్పూన్
దాల్చిన చెక్క-1
జీల కర్ర-1 టీ స్పూన్
లవంగాలు-3 లెక 4
జీడి పప్పులు-1 టేబుల్ స్పూన్
ఉప్పు తగినంత

తయరుచేయు విధానం:
బాణలిని స్టవ్ మీద పెట్టి వేడిచేసుకున్నక,నెయ్యి వేసి కరిగాక,దాల్చిన చెక్క,జీల కర్ర,లవంగాలు,జీడి పప్పు వేసి వేయించుకోవాలి;జీడి పప్పు వేగాక,అల్లం,వెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి,తరువాత ఉల్లిపాయ తరుగు,పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి;ఆ తరువాత పుదీన,కొత్తిమీర తరుగు ఆ పైన అన్నం,ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచి తీసేయాలి,దీన్ని రైతాతో కాని యేదైనా కూరతో తిన్నా బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి