29, మార్చి 2011, మంగళవారం

వంకాయ-చిక్కుడుకాయ మసాల


కావలసినవి:


వంకాయ ముక్కలు - 1 కప్పు

చిక్కుడుకాయ ముక్కలు - 1 కప్పు

అల్లం వెల్లుల్లి - 1 స్పూన్

ధనియాలు- 1 స్పూన్

జీలకర్ర - 1 స్పూన్

శనగపప్పు - 1 స్పూన్

నూపప్పు-2 స్పూన్స్

ఎండుమిర్చి - 2

పచ్చిమిర్చి - 2

ఉప్పు - సరిపడ

నూనె - 1/2 కప్పు


తయారు చేసే విధానం:


ముందుగా వంకాయ , చిక్కుడుకాయ ముక్కలు నూనె వేసి మెత్తబడె వరకు ఉడకపెట్టుకోవాలి.

మసాల సరుకులన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు కూర ముక్కలు మగ్గిన తరువాత ఈ మసాల ముద్ద వేసి ఇంకొక 5 నిముషాలు మగ్గించుకుంటె కూర రెడి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి