7, మార్చి 2011, సోమవారం

కూరగాయల్తో(vegetable) ఉతప్పం


కావల్సినవి:
బియ్యం-2 కప్పులు
మినపప్పు-ఒక కప్పు
సెనగ పప్పు-1/2 కప్పు
పెసర పప్పు-1/2 కప్పు
పచ్చి మిర్చి -3
ఉల్లిపాయలు-3
టొమటొ-2
క్యారట్ తురుము-1 కప్పు
బఠాణీలు-1/4 కప్పు(ఉడికించుకోవాలి)
బీన్స్ -10 తరుగుకొని ఉడికించుకోవాలి
ఉప్పు-తగినంత
నూనె-1/2 కప్పు

తయారి: బియ్యం,మిగత పప్పులని నానబెట్టుకొని మర్నాడు మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.తరవాత ఉల్లిపాయలు,టొమటోలు తరిగి పెట్టుకోవాలి.తరువాత బాణాలిలో 3చెంచాల నూనె వెసి వేడెక్కాక పచ్చిమిర్చి,ఉల్లిపాయ ముక్కలు మగ్గించి,టొమటో ముక్కలు,బఠాణీలు ,బీన్స్ వేసి మగ్గించాలి.కాసేపు అయ్యాకా ఉప్పువేసి దించేయాలి.ఈ కూర మిశ్రమాన్ని పిండిలో కలుపుకోవాలి.
అరగంట అయ్యాక పొయ్యి మీద పెనం పెట్టి ,వెడెక్కాక ఉతప్పం వెసుకుని నూనె వెసి కలిస్తె వెగెతబ్లె ఊతప్పం సిధ్ధం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి