5, ఏప్రిల్ 2011, మంగళవారం

పెసరట్లకూర - పులావు

పెసరట్లకూర - పులావు కావలసినవి
  పెసలు 1/4  కిలో
 ఉల్లిపాయలు 4 
 అల్లం చిన్నముక్క 
 పచ్చిమిరపకాయలు  5 
 లవంగం 4 
  ఏలకులు 4 
 దాల్చినచెక్క
  ధనియాలు 1  స్పూన్
 గసగసాలు 1  స్పూన్ 
కొబ్బరి చిప్పలో సగం
 జీడిపప్పు 10 
 కొత్తిమీర కట్ట
 జీలకర్ర 2  స్పూన్
 బియ్యం 2 గ్లాసులు
 పసుపు చిటికెడు 
నెయ్యి 5  స్పూన్స్
  నూనె 5  స్పూన్స్ 
  తయారుచేయువిధానం పెసలు ముందురోజు నానపెట్టుకునిఅల్లం,పచ్చిమిర్చి కూడా వేసి  .గ్రైండ్ చేసుకుని .ఉప్పు,జీలకర్ర కలిపి కొంచెం మందముగా అట్లు వేసుకోవాలి పెసరట్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనెవేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేయించాలి పైన రాసిన వాటిలో సగం లవంగాలు,ఏలకులు,దాల్చినచెక్క,కొబ్బరి,గసగసాలు ,ధనియాలు నూరి ఉల్లిపాయాల్లో వేసి ,పెసరట్టు ముక్కలు వేసి,ఉప్పు,పసుపు వేసి కొంచెం నీరు పోసి మూత పెట్టి పది నిముషాలు కలిపితే కూర రెడి 
  2  ఉల్లిపాయలు,పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని .స్టవ్ మీదగిన్నే పెట్టుకుని నెయ్యి వేసి మిగిలిన ఏలకులు,లవంగాలు,దాల్చినచెక్క,వేసి వేగనిచ్చి  జీడిపప్పు వేసి వేయించాలి ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగేక కదిగిఉంచుకున్న బియ్యం వేసి అంతా కలిసేలా బాగాకలిపి నాలుగు గ్లాసుల నీరుపోసి 
ఉప్పువేసి మూతపెట్టాలి అన్నం ఉడికేక పెసరట్లకూర వేసి బాగా కలిపి స్టవ్ తగ్గించి5  నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి  
.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి