13, ఏప్రిల్ 2011, బుధవారం

బెంగుళూర్ వంకాయ కూటు

బెంగుళూర్ వంకాయ కూటు  కావలసినవి
 కందిపప్పు 1  కప్
 బెంగులూరువంకాయ 1  
పచ్చిమిర్చి 4 
 చింతపండు చిన్న ముద్దా
 సెనగపప్పు  2  స్పూన్స్
 ధనియాలు 2  స్పూన్స్
 కొబ్బరి చిప్పలో సగం
 మిరియాలు 4 
 ఎండుమిర్చి 4
మినపపప్పు  1  స్పూన్
 ఆవాలు,జీలకర్ర 1 స్పూన్ 
 నూనె 2  స్పూన్స్
 తయారుచేయువిధానం కందిపప్పు మరిమేత్తగా కాకుండా పలుకు లేకుండా ఉడకపెట్టుకోవాలి బెంగులూరువంకాయ ముక్కలు,చింతపండు గుజ్జు ,పచ్చిమిర్చి,పసుపు,ఉప్పు వేసిమరికాసేపు ఉడికించాలి .సెనగపప్పు,మిరియాలు,కొబ్బరి,ఎండుమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకుని పప్పులో కలపాలి చివరగా మినపప్పు,ఆవాలు,జీలకర్ర కరివేపాకు పోపు పెట్టుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కలిపితే బెంగుళూర్ వంకాయ కూటు రెడి ఇది అన్నంలోకి,పూరి,చపాతిలోకిబాగుంటుంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి