13, ఏప్రిల్ 2011, బుధవారం

సింగడాలు

సింగడాలు  కావలసినవి
 మైదా పావు కిలో 
కాలిఫ్లవర్ 1  కప్ 
పచ్చి బటాణి 1 కప్
 బంగాళాదుంప ఉడికించినది 1 కప్
 ఉల్లిపాయ 1 కప్
 అల్లం చిన్నముక్క
 పచ్చిమిర్చి 4
ఉప్పు తగినంత
 నూనె వేయించడానికి సరిపడా  
  తయారుచేయువిధానం మైదా పిండిలో నాలుగు చెంచాలు వేడినూనేవేసి పూరిపిండిలా కలిపి పక్కన పెట్టాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి అల్లం,పచ్చిమిర్చి వేసి వేగేక కూరముక్కలన్ని వేసి ఉప్పుకలిపి కూర చేసుకోవాలి మైదాపిండిని నిమ్మకాయంత ఉండలుచేసుకోవాలి పూరీలావత్తుకుని మద్యలో కట్ చేసుకోవాలి త్రిబుజాకారంలో వత్తుకుని పోట్లంలా మడిచి మద్యలో కూర పెట్టుకుని అంచులు అంటించి  నూనెలో దోరగా వేయించుకోవాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి