5, ఏప్రిల్ 2011, మంగళవారం

రసగుల్లాలు

రసగుల్లాలు  కావలసినవి
 చిక్కటి పాలు 1 లీటర్
 నిమ్మపండు 1 
 పన్నీరు 2  స్పూన్స్
 గోధుమపిండి 1 స్పూన్  
  తయారుచేయువిధానం పాలను స్టవ్ మీద కాచి మరుగుతుండగా స్పూన్ నిమ్మరసం వెయ్యాలి .పాలను కలియపెడుతూ వెయ్యాలి ముద్దలా అయ్యేవరకు కలియపెట్టాలి .శుబ్రంగా ఉన్న గుడ్డలో వడపోయాలిగుడ్డ అంచులు నాలుగు కలిపిపది నిమిషాలు  వేల్లాడదీయాలి బాగాపిండి నీరు అంతా పోయాక గుడ్డలో మిగిలిఉన్న చేన్నాని ప్లేటులో పొడి,పొడిగా చేసుకుని చేతితో పదినిమిషాలు గట్టిగ పిసికి మెత్తగా చెయ్యాలి గోధుమ పిండి కలిపి నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి    
 రసగుల్లకు రెండు పాకాలుచేస్తారు ఒక పాకం నిలువపాకం అందులో వండిన రసగుల్లాలు వేస్తారు రెండవపాకంలో రసగుల్లాలు వండాలి నిలువపాకంకు రెండు కప్పుల నీరు గిన్నెలోకి తీసుకుని రెండుకప్పుల పంచదార కలిపి స్టవ్ మీద పెట్టి సల,సలాకాగుతుండగా నాలుగు స్పూన్ల పాలు కలపాలి పాకం చేతికి అంటుకుంటుంటే పాకం తయారయినట్లు .చెన్నాఉండలు వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి  చల్లపడ్దాక పన్నీరు కలపాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి