26, మే 2011, గురువారం

రసమలై

రసమలై   కావలసినవి 
 పాలు  1  1/2  లీటర్
 పంచదార 6 స్పూన్స్
 నిమ్మకాయ 1 
 ఏలకులు 2  
బాదాంపౌడర్ 2 స్పూన్స్  
  తయారుచేయువిధానం ఒక లీటర్ పాలు గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టి మరుగుతున్నప్పుడు నిమ్మరసం వెయ్యాలి .స్టవ్ ఆఫ్ చేసి విరుగు వడపోసుకునిపల్చని గుడ్డలో మూట కట్టి నీరు అంతాపోయాక అవిరుగు చేతోబాగా మెత్తగా చేసి ఉండలు చేసిపెట్టుకోవాలి.స్టవ్ మీదగిన్నె పెట్టి  2 గ్లాసులు నీరుపోసిఈ ఉండలువేసి పది నిమిషాలు ఉడికించాలి ఇంకో గిన్నెలో పాలుపోసి అరలీటర్ పావు లీటర్ అయ్యేలా మరిగించి బాదాం పౌడర్ ,ఏలకులపొడి ,పంచదార వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి .విరుగు ఉండలు వేసి ఫ్రిజులోపెట్టి  చల్లగా తింటే బాగుంటాయి  

15, మే 2011, ఆదివారం

మింట్-మిలాన్ జ్యూస్




కావలసినవి:

పుచ్చకాయ ముక్కలు
పుదీన
నిమ్మరసం
పంచదార

ఒక అరకప్పు వాటర్ తీసుకుని పుదీన ఆకులు వెసుకుని వేడి చెయ్యాలి.

ఇప్పుడు పుచ్చకాయ ముక్కలు ,, పంచదార వేసి జ్యూస్ ల అయ్యేల బ్లెండ్ చెయ్యాలి.

ఈ జ్యూస్ ని వడపోసుకుని ,,, దానిలో 2 స్పూన్స్ పుదీన రసం , 2 స్పూన్స్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి.

9, మే 2011, సోమవారం

చౌ ..చౌ

చౌ ..చౌ కావలసినవి
 ఆలు 2 
 బీన్స్ 10 
 కేరట్ 4 
 బీట్రూట్ 2 
 పొట్లకాయ 1 
 కొబ్బరి సగం చిప్ప
 అల్లం చిన్న ముక్క
 పసుపు చిటికెడు 
ఇంగువ చిటికెడు
 పచ్చిమిర్చి 4 
చింతపండు చిన్న ముద్దా
 ఆవాలు.జీలకర్ర 1 స్పూన్
 ఉప్పు తగినంత  
  నూనె  2 స్పూన్స్
  తయారుచేయువిధానం  5 రకాల కూరగాయలు కట్ చేసుకుని ఉప్పు,నీరు  కలిపి ఉడకపెట్టాలి .పచ్చిమిర్చి,అల్లం,కొబ్బరి కలిపి మెత్తగా గ్రైండ్ చేసిపెట్టుకోవాలి చింతపండు పులుసు చేసిపెట్టుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె వేసి ఎండుమిర్చి ,ఆవాలు,జీలకర్ర ,ఇంగువ వేయించి కూరముక్కలు వేసి అల్లం,,కొబ్బరి నూరిన ముద్దా ,చింతపండు పులుసు అన్ని బాగా కలిపి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి  ఈ కూర చపాతీ,పూరి,అన్నం  దేనిలో తిన్న బాగుంటుంది                          

ఆలు., కొబ్బరి కూర

ఆలు., కొబ్బరి కూర కావలసినవి
 బంగాలదుంపలు 4  
కొబ్బరి సగంచిప్ప
 ఆవాలు ,జీలకర్ర 1  స్పూన్ 
 ఎండుమిర్చి 2 
పచ్చిమిర్చి 2  
కరివేపాకు 2 రెమ్మలు
 అల్లం ముక్కలు 1 స్పూన్ 
తయారుచేయువిధానం  ఆలుగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి .కొబ్బరికోరుకుని కొంచెము నీరుపోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని కొబ్బరిపాలుతీసి ఆలు ముక్కలులో పోసి 5 నిముషాలు ఉడికించి కొంచెం కూర గట్టిగ అయ్యేక పోపు వేయించి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి   ఇది చపాతి,పూరి,అన్నం లో బాగుంటుంది                   
                              

5, మే 2011, గురువారం

తందూర్ రోటి

తందూర్ రోటి కావలసినవి
 మైదా 1/4 కేజీ  
బెల్లం 1/4  కేజీ 
 ఏలకులు 4 
 వంటసోడా చిటికెడు
 నూనె తగినంత
 తయారుచేయువిధానం బెల్లంలో గ్లాసు నీరు పోసి స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి అందులో మైదా ,వంటసోడా,ఏలకులపొడి వేసి మెత్తగా చపాతిపిండిలా కలిపి 4  గంటలు మూత పెట్టి నానపెట్టాలి తరువాత నిమ్మకాయంత ఉండలు చేసుకుని .చపాతీలావత్తుకుని పెనం మీద నూనె వేసి గోధుమ రంగు లో కాల్చుకోవాలి