30, జూన్ 2011, గురువారం

బిసి బేలే బాత్

బిసి బేలే బాత్ కావలసినవి
 ఉడికిన అన్నం 2 కప్పులు
 కందిపప్పు చిన్న కప్
 సెనగపప్పు 2 స్పూన్స్
 ధనియాలు 1 స్పూన్ 
మిరియాలు 4  
మెంతులు 1/2 స్పూన్
 కొబ్బరి చిన్న ముక్క
 చింతపండు నిమ్మకాయంత ముద్దా
 బెల్లం చిన్న ముక్క 
అనపకాయముక్కలు 4 
ఉల్లిపాయ ముక్కలు 4 
ములక్కాడ ముక్కలు 4
 కేరట్ ముక్కలు 4 
ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
 జీడిపప్పు
 కరివేపాకు
 కొత్తిమీర 
ఇంగువ 
ఎండుమిర్చి  
   తయారుచేయువిధానం ముందుగా చింతపండు నాన పెట్టుకోవాలి .కందిపప్పు,కూర ముక్కలు ఉడకపెట్టాలి .స్టవ్ మీద బాణలి  పెట్టుకుని సెనగపప్పు,మెంతులు,మిరియాలు,ఎండుమిర్చి ధనియాలు వేయించుకొని కొబ్బరి కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .చింతపండు పులుసులో గ్రైండ్ చేసిన ముద్దా కలిపి ,ఉడికించిన పప్పు,కూర ముక్కలు ,ఉప్పు,బెల్లం కలిపి సాంబార్ కాచుకోవాలి . ఇప్పుడు సాంబార్ లో అన్నం బాగా కలిసేలా కలిపిస్టవ్ మీద  ఇంకో గిన్నేపెట్టి 4 స్పూన్ల నెయ్యి వేసి వేడి అయ్యాక ఆవాలు.జీలకర్ర వేసివేగేకా జీడిపప్పు,కరివేపాకు ,కొత్తిమీర చిటికెడు ఇంగువ వేసి వేగాక ఈ సాంబార్ అన్నం వేసి కొంచెం గట్టి పడేవరకు కలపాలి ఘుమ ఘుమ లాడే బిసి బేలే బాత్ రెడి  

ఎగ్ లెస్ కేక్

ఎగ్ లెస్ కేక్ కావలసినవి
 మైదా 200  గ్రామ్స్
 వెన్న 200 గ్రామ్స్ 
పంచదార 1 కప్ 
పాలు 1 కప్
 మిల్క్ మెఇడ్ 1 కప్   
వంటసోడా 1/2 స్పూన్
 బేకింగ్ సోడా 1 స్పూన్ 
సోడా వాటర్ 
  తయారుచేయు విధానం ఒక గిన్నెలో వెన్నతీసుకుని పంచదార వేసి పంచదార కరిగేలా గిలక్కొట్టాలి మైదా వేసి పాలు,మిల్క్ మెఇడ్ ,,వంటసోడా,బేకింగ్ సోడా,సోడా వాటర్ అన్ని కలిసేలా బాగా కలిపి .ఇంకో మందపాటి గిన్నె తీసుకుని అగిన్నేకి అడుగున వెన్న అప్లై చేసి ఆపైన మైదా పొడి పిండి అప్లై చేసి కేకుకి తడిపిన పిండి వెయ్యాలి .ఓవెన్ లో కానీ కుక్కర్ లో కానీ పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టుకుంటే అడుగున నీళ్ళు పోయకుండా గిన్నె కుక్కర్లో పెట్టి వెయిట్ పెట్టకుండా కుక్కర్ మూత పెట్టి 10 లేక 15 నిముషాలు పెడితే కేకు రెడి 

29, జూన్ 2011, బుధవారం

షీరా

షీరాకావలసినవి
 సెనగపిండి 1 కప్
 బొంబాయి రవ్వ 1 కప్
 గోధుమ పిండి 1 కప్
 పంచదార 2 కప్పులు
 నెయ్యి 4 స్పూన్స్
 ఏలకులు 4 
 జీడిపప్పు 10 
 నీరు 5  కప్పులు 
 బాదాం పప్పు 10  
 తయారుచేయువిధానం స్టవ్ మీద  బాణలి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు,బాదాం వేయించుకోవాలి అవితీసి అదే నెయ్యిలో సెనగపిండి,గోధుమపిండి,రవ్వ వేసి పచ్చివాసనపోయేవరకు వేయించుకోవాలి 5 కప్పుల నీరు పోసి దగ్గరయ్యే వరకు కలపాలి ఏలకులపొడి,కలిపి జీడిపప్పు,బాదాం వేస్తె షీరా రెడి 

27, జూన్ 2011, సోమవారం

కేరట్ కోవా లడ్డు

కేరట్ కోవా లడ్డు కావలసినవి
 కోవా పావు కేజీ 
కేరట్ 2
కొబ్బరి సగం చిప్ప
 పంచదార 1/2 కప్పు
 నెయ్యి 4 స్పూన్స్
 జీడిపప్పు
 బాదంపప్పు
 కిస్మిస్
 ఏలకులు
 తయారుచేయువిధానం ముందుగా కేరట్,కొబ్బరి తురుము కోవాలి స్టవ్ , మీద బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసిజీడిపప్పు,బాదంపప్పు,కిస్మిస్ వేయించి  కేరట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి దీనికి కొబ్బరితురుము పంచదార కలిపి దగ్గరయ్యే వరకు తిప్పుతూ ఉండాలి .జీడిపప్పు,బాదంపప్పు,కిస్మిస్ ఏలకులపొడి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కోవా చిన్న ఉండ తీసుకుని చేతిలో పరుచుకుని మద్యలో కేరట్ ఉండపెట్టి కప్పెయ్యాలి అన్ని ఆలాచేసుకుంటే కేరట్  కోవా లడ్డు రెడి  ,

కొబ్బరి పాయసం

కొబ్బరి పాయసం కావలసినవి
 సేమియా పావుకప్పు
 కొబ్బరి తురుము 2 కప్పులు
 పంచదార 1 కప్పు
పాలు 1 కప్పు 
 నెయ్యి 2 స్పూన్స్
 ఏలకులపొడి 1 స్పూన్ 
జీడిపప్పు ,కిస్మిస్ తగినంత  
   తయారుచేయువిధానం స్టవ్ మీద గిన్నె పెట్టి జీడిపప్పు,కిస్మిస్ వేయించి  తీసిపెట్టుకోవాలి .సేమియా వేసి వేయించాలి వేగిన సేమియలో కొంచెం నీరు పోసి ఉడికించాలి .కొబ్బరి,పాలు,పంచదార వేసి 5  నిమిషాలు గరిటెతో తిప్పాలి .ఏలకులపొడి,జీడిపప్పు,కిస్మిస్ వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి 

కొబ్బరి హల్వా

కొబ్బరి హల్వా కావలసినవి
 కొబ్బరి తురుమినది 2  కప్పులు
 పంచదార 2 కప్పులు
 ఏలకులు 4 
 జీడిపప్పు ,కిస్మిస్   
 తయారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించుకోవాలి .ఇంకోగిన్నే పెట్టుకుని పంచదార వేసి ఒక గ్లాస్ నీరు పోసి లేత పాకం వచ్చాక కొబ్బరి కలిపి కొంచెం దగ్గర పడ్డాక నెయ్యి వేసి ఇంకో 5 నిమిషాలు కలిపి వేయించిన జీడిపప్పు,కిస్మిస్,ఏలకులపొడి కలిపితే కొబ్బరి హల్వా రెడి  

26, జూన్ 2011, ఆదివారం

కేరట్ పచ్చడి

కేరట్ పచ్చడి కావలసినవి
 కెరట్స్ 2 
కొబ్బరి చిన్న ముక్క
 నిమ్మకాయ 1 
పచ్చిమిర్చి 2 
 కొత్తిమీర తగినంత
 ఉప్పు తగినంత 
నూనె 1 స్పూన్
 పోపుకి సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర 1 స్పూన్ 
ఎండుమిర్చి 1  
తయారుచేయువిధానం కేరట్ పీలర్ తో తొక్క తీసి తురుము కోవాలి కొబ్బరి కూడా తురుముకుని పచ్చిమిర్చి,కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కలుపుకోవాలి నిమ్మకాయరసం,ఉప్పుకలిపి పోపు వేయించుకుని కలిపితే కేరట్ పచ్చడి రెడి 

stuffed capsicum

stuffed  కాప్సికం  
 కాప్సికం  4 
ఆలు 2
ఉల్లిపాయ 1 
 అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
 ఉప్పుతగినంత 
 కారం 1 స్పూన్
  పచ్చిమిర్చి 2                 
కొత్తిమీర సగం కట్ట 
నూనె 4 స్పూన్స్ 
తయారుచేయువిధానం ముందుగా ఆలు ఉడికించుకుని తొక్కతీసి పెట్టుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఎర్రగా వేగాకా పచ్చిమిర్చి,కొత్తిమీర అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక ఆలు ముద్దా వేసి కూర చేసుకోవాలి .ఇప్పుడు కాప్సికం   సుబ్రముగాకడుక్కుని తొడిమ తీసేసి ఒకవేపే కట్ చేసి లోపల నిమ్మకాయంత ఆలు కూర ముద్దా పెట్టుకుని కవర్ చేసుకోవాలి అన్ని పెట్టుకున్నాక స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక కాప్సికం  అన్ని వేసి మూత పెట్టాలి సిమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలి 
ఇంకో విధానం సెనగపప్పు,పల్లీలు ,కొబ్బరి,ఎండుమిర్చి ,జీలకర్ర,వేయించుకుని పౌడర్ చేసి కేప్సికం లో పెట్టి వేయించుకోవాలి 

23, జూన్ 2011, గురువారం

పెసల వడలు

పెసల వడలు కావలసినవి
 పెసలు 1 కప్
 బియ్యం 1 కప్
 సెనగపప్పు 1/2 కప్ 
అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ 
ఉల్లిపాయ 2
కొత్తిమీర కట్ట 1
కారం 1 స్పూన్ 
ఉప్పు తగినంత 
నూనె వేయించడానికి సరిపడా 
ఇంగువ చిటికెడు 
  తయారుచేయువిధానం ముందుగ పెసలు,బియ్యం మిక్సిలో రవ్వ చేసుకోవాలి అరగంట ముందు సెనగపప్పు నానపెట్టుకోవాలి .ఉల్లిపాయ,కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి .ఇప్పుడు పెసలు,బియ్యం కలిపి పట్టిన రవ్వలో నానిన సెనగపప్పు,ఉల్లిపాయముక్కలు ,కొత్తిమీర ,అల్లం,వెల్లుల్లి పేస్ట్,ఇంగువ ,ఉప్పు,కారం వేసి తగినన్ని నీరు కలిపి వడలు పిండి కలిపి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి వడలు వేయించుకోవాలి 

22, జూన్ 2011, బుధవారం

ఐస్ క్రీం తయారి 1

ఐస్ క్రీం తయారి  1 కావలసినవి
 పాలు 1 లీటర్
 పంచదార 1 కప్ 
ఐస్ క్రీం పౌడర్ 2 స్పూన్స్
 గ్లూకోజు 2 స్పూన్స్  
 తయారుచేయువిధానం ముందుగ పాలు బాగామరగపెట్టాలి  లీటర్ పాలు మూడు పావులు అయ్యేలా చల్లారాక  పాలులో పంచదార,ఐస్ క్రీం పౌడర్ ,గ్లూకోజు బాగా కలిపి  ఫ్రీజర్లో పెట్టాలి 2 గంటల తరువాత తీసి మిక్సిలో వేసి నురుగు వచ్చేలా గ్రైండ్ చేసి మల్లి ఫ్రీజర్లో 2 ,3 గంటలు పెడితే ఐస్ క్రీం రెడి 

ఐస్ క్రీంమిల్క్ షేక్

ఐస్ క్రీంమిల్క్ షేక్  కావలసినవి
 పాలు 2 కప్పులు 
పంచదార 5 స్పూన్స్ 
వెనీలా ఐస్ క్రీం 4  స్పూన్స్
 మిక్సిడ్ ఫ్రూట్ జామ్ 1 స్పూన్ 
 తయారుచేయువిధానం పాలు కాచి చల్లారాక.పాలు,పంచదార,జామ్,ఐస్ క్రీం అన్నికలిపి మిక్సిలో గ్రైండ్ చెయ్యాలి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తాగితే బాగుంటుంది 

20, జూన్ 2011, సోమవారం

మోమోజ్

మోమోజ్ కావలసినవి
 మైదా 2 కప్ 
బేకింగ్ పౌడర్ ఆఫ్ స్పూన్ 
కాబేజీ సన్నగా తరిగినది 2  కప్పులు
 నుట్రిలాపొడి 3  స్పూన్స్ 
పన్నీరు సన్నగా తురిమినది 
మిరియాలపొడి ఆఫ్ స్పూన్ 
అల్లం,వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్
 ఉప్పు తగినంత   తయారుచేయువిధానం మైదాలో బేకింగ్ పౌడర్ వేసినీరు చేర్చి  చపాతీ పిండిలాకలిపి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి క్యాబెజిని ఉడికించుకునినీరు పిండేసి ఉడికిన నుట్రిలా పొడి,పనిరు,అజినమోటో ,మిరియాలపొడి,ఉప్పు,అల్లం,వెల్లుల్లి పేస్ట్,వేసి అన్ని బాగా కలపాలి  .మైదాపిండిచిన్న,చిన్న ఉండలు చేసుకుని పూరీలావత్తుకుని .క్యాబేజీ మిశ్రమాన్ని పూరిలో పెట్టి పొట్లం లాముసేయ్యాలి ఇలా అన్ని చేసుకుని ఇడ్లి స్టాండులో ఆవిరి మీద 10  నిముషాలు ఉడికించాలి ఇవి టమాటా సాసుతోబాగుంటాయి 

కొబ్బరి పొంగరాలు

కొబ్బరి పొంగరాలు కావలసినవి
 బియ్యం పిండి 2 కప్
 కొబ్బరి సగం చిప్ప 
బెల్లం 1  కప్ 
పంచదార 1  కప్
 ఏలకులు 5 
 జీడిపప్పు  10 
  నెయ్యి 4 స్పూన 
 నూనె సరిపడా 
తయారుచేయువిధానం గిన్నె స్టవ్ మీదపెట్టి బెల్లం వేసి తగినన్ని నీరు పోసి కరిగేకా అందులో బియ్యంపిండి,కొబ్బరికోరు,పంచదార ,ఏలకులపొడి వేసి బాగా కలపాలి గట్టిపడ్డాక నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగేక పిండిని చిన్న,చిన్న ఉండలు తీసుకుని పాల్తిన్  పేపర్ మీద అరిసేలులా చేత్తో తట్టి వేయించుకోవాలి  

19, జూన్ 2011, ఆదివారం

అరటికాయ అవకూర

అరటికాయ అవకూర కావలసినవి
  అరటికాయలు 2 
 చింతపండు చిన్నముద్ద
 సెనగపప్పు 1  స్పూన్ 
 మినపప్పు 1 స్పూన్ 
ఆవాలు,జీలకర్ర 1  స్పూన్ 
ఆవాలు 2 స్పూన్లు
 పసుపుచితికెడు
  ఉప్పుతగినంత
 ఇంగువ చిటికెడు
 నూనె 2 స్పూన్లు
 తయారుచేయువిధానం అరటికాయలు కట్ చేసుకుని కుక్కర్లో ఉడికించాలి .చిల్లుల ప్లేటులో వార్చుకొవాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి అయ్యాకా పోపు వేయించి పసుపు,ఇంగువ,పచ్చిమిర్చి,కరివేపాకు కూడా వేసి ,అరటికాయముక్కలు ,చింతపండు నీరిపోసి బాగా కలిపితే కూర ముద్దలా అవుతుంది .స్టవ్ ఆఫ్ చేసి ఆవ నూరుకుని కలుపుకోవాలి 

అనపకాయ ఆవ కూర

అనపకాయ ఆవ కూర 
 అనపకాయ   1   
 చింతపండు చిన్న ముద్దా 
ఎండుమిర్చి 2 
 సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1 స్పూన్ 
ఆవాలు.,జీలకర్ర 1 స్పూన్ 
ఆవాలు 2  స్పూన్స్
 పసుపుచితికెడు
 ఇంగువ చిటికెడు
నూనె 2 స్పూన్స్
 పచ్చిమిర్చి 2  
కరివేపాకు రెండు రెమ్మలు 
 తయారుచేయువిధానం అనపకాయ సన్నగా కట్ చేసుకుని ఉప్పుకలిపి తగినన్ని నీరు చేర్చి ఉడికించి చిల్లుల ప్లేటులో వార్చుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి వేయించి .పసుపు,పచ్చిమిర్చి,కరివేపాకు,ఇంగువ వెయ్యాలి అనపకాయముక్కలు వేసి చింతపండు నీరు పోసి నీరు అంతా ఇగిరేవరకు కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి ఆవ నూరుకుని ఒక స్పూన్ నూనె అవలో కలిపి .కూరలో బాగా కలిసేట్టు కలపాలి 

18, జూన్ 2011, శనివారం

కాలిఫ్లవర్ అవకూర

కాలిఫ్లవర్ అవకూర కావలసినవి
 కాలిఫ్లవర్  1 
 అల్లం చిన్నముక్క
 పచ్చిమిర్చి 4 
 ఆవాలు  2  స్పూన్స్
 కరివేపాకు 2  రెమ్మలు
 ఉప్పు తగినంత
 నూనె 4  స్పూన్స్
 సెనగపప్పు 1  స్పూన్
 మినపప్పు 1 స్పూన్ 
ఆవాలు,జీలకర్ర 1  స్పూన్
 చింతపండు చిన్న ముద్దా
 తయారుచేయువిధానం ముందుగ కాలిఫ్లవర్ సన్నగా కట్ చేసుకొని ఉప్పు కలిపి ఉడికించుకోవాలి అవి చిల్లుల ప్లేటులో వార్చుకొవాలి  స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,అల్లం ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు ,కరివేపాకు వేసి వేయించుకుని కాలిఫ్లవర్ ముక్కలు వేసి చింతపండు నీరుపోసి నీరు ఇగిరే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి .అవాలులో కొంచెం నీరు చేర్చి మెత్తగానూరి రెండు స్పూన్ల నూనె కలిపి కూరలో బాగా కలపాలి 

కేబేజీ అవకూర

కేబేజీ అవకూర కావలసినవి
 కేబేజీ 1/2  కేజీ
 పచ్చిమిర్చి 4 
 ఆవాలు 2  స్పూన్స్
 కరివేపాకు 2  రెమ్మలు
 సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1  స్పూన్
 ఆవాలు,జీలకర్ర 1  స్పూన్
 ఎండుమిర్చి 2  
 నూనె 4స్పూన్స్
 ఉప్పు తగినంత 
 చింతపండుచిన్నముద్దా   
తయారుచేయువిధానం ముందుగా కేబేజీ సన్నగా కట్ చేసుకుని ఉప్పుకలిపి ఉడికించుకోవాలి చిల్లుల ప్లేటులో వార్చుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి పోపు వేయించుకోవాలి .కరివేపాకు,పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఉడికిన కేబేజీ నీరు పిండేసి పోపులో వేసిచిన్తపండునీరుపోసి నీరు ఇగిరేవరకు  బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి .ఆవాలు కొంచెం నీరు కలిపి మెత్తగా నూరుకోవాలి .నూరిన ముద్దలో రెండు స్పూన్ల నూనె కలిపి కూరలో బాగా కలపాలి 

బఠాణివడలు

బఠాణివడలుకావలసినవి 
 బఠానీలు 2 కప్ 
పచ్చిమిర్చి 4 
 అల్లం చిన్న ముక్క
 వెల్లుల్లి రేకలు 2 
 ఉల్లిపాయలు 2 
 కొత్తిమీర కట్ట 1  
తయారుచేయువిధానం పచ్చిమిర్చి,అల్లం,కొత్తిమీర,వెల్లుల్లి,ఉప్పు మిక్సిలో వేసిమెత్తగా  గ్రైండ్ చేసి చివరగా బఠానీలు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా చేసుకోవాలి ఉల్లిపాయముక్కలు సన్నగా కట్ చేసుకుని బఠాణి పిండిలో కలిపుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి అయ్యాక బఠాణి పిండి వడలు గావేయించుకోవాలి .

17, జూన్ 2011, శుక్రవారం

డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్

డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ 
 కావలసినవి పాలు 2 కప్పులు
 పంచదార 125 గ్రామ్స్
 బాదాం పప్పు 10  
జీడిపప్పు 10 
ఎండుకర్జురం 5  
తేనే  2 స్పూన్స్  
మీగడ 2 స్పూన్స్  
 తయారుచేయువిధానం  బాదాం,జీడిపప్పు,కర్జూరం నాలుగు గంటలముందునానపెట్టుకోవాలి  .పాలు కాచి చల్లారనిచ్చిఫ్రీజర్లో గంట సేపు ఉంచాలి .నానిన పప్పులు పొట్టు తీసి మిక్సిలో మెత్తగా గ్రైండ్ చెయ్యాలి ,పాలు.పంచదార,మీగడ కలిపి మిక్సిచేస్తే మిల్క్ షేక్ రెడి   

గోధుమ రవ్వ కిచిడి

గోధుమ రవ్వ కిచిడి కావలసినవి
 గోధుమ రవ్వ  1 1/2  కప్
 సెనగపప్పు 1/4 కప్ 
నీళ్ళు 3 కప్ 
ఉల్లిపాయసన్నగా తరిగినది పావు కప్
 కేబేజీతురుము  పావు కప్
 టమాటతరిగిన ముక్కలు పావు కప్
 బీన్స్ ముక్కలు పావు కప్
 ఆవాలు సగం స్పూన్
 అల్లంసన్నగా తరిగినది అర చెమ్చా
సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3   
ఉప్పు తగినంత 
నూనె సరిపడా
 తయారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చెయ్యాలి ఆవాలు వేసి వేగేక పచ్చిమిర్చి ,ఉల్లిపాయ వేసి 2   
నిమిషాలుఅయ్యాక అల్లం తురుము,టమాట,కేబేజీ ,బీన్స్ వేసి తగినంత ఉప్పు వేసి నీళ్ళు పోసి మరిగించాలి నీళ్ళు మరిగేకా రవ్వ,పప్పు వేసి సన్నని మంటపై ఉంచి మూత పెట్టి 10  నిముషాలు కలుపుతూ ఉండాలి .రవ్వ పూర్తిగా ఉడికేక స్టవ్ ఆఫ్ చెయ్యాలి    

15, జూన్ 2011, బుధవారం

నువ్యుల బొబ్బట్టు

నువ్యుల బొబ్బట్టు కావలసినవి
 నువ్యులు 1 కప్
 వేరుసెనగపప్పు 1 కప్
 బెల్లం 1 కప్ 
ఏలకులు పొడి 1 స్పూన్
 నూనె తగినంత 
  తయ్యారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి నువ్యులు,వేరుసెనగపప్పు విడి విడిగా వేయించుకొని మిక్సిలో పొడిచేసి పెట్టుకోవాలి .మైదాలో కొంచెం నీరు చేర్చి పూరి పిండికలుపుకోవాలి మూతపెట్టి 5 నిమిషాలు నాననివ్వాలి స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి బెల్లం కొంచెం నీరు పోసి పెట్టి లేత పాకం వచ్చాక అందులో నువ్యులపొడి,వేరుసేనగాపప్పుపొడి,ఏలకుల పొడి వేసి బాగా కలిపి కొంచెం దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి .తరువాత మైదాపిండిని నిమ్మకాయంత ఉండలు చేసుకుని పూరి పీట మీదపూరీలా వత్తుకుని మద్యలోనువ్యుల మిశ్రమాన్ని పెట్టుకుని మల్లి వత్తుకోవాలి వాటిని పెనం మీద వేయించుకోవాలి నువ్యుల బొబ్బట్టు రెడి     

మశ్రూమ్ పలావు

మశ్రూమ్ పలావు  కావలసినవి
 అన్నం 1 కప్
 మశ్రూం 1 1/2 కప్
 తరిగినది కేప్సికం 1  
ఉల్లిపాయ 1
టమాట  2                                                    
అల్లం,వెల్లుల్లి ముద్దా 1 స్పూన్ 
పసుపు చిటికెడు
 మిరియాలు 4 
కారం 1 స్పూన్
 ఉప్పు తగినంత 
పనీర్ ముక్కలు 4 
నూనె 3 స్పూన్స్
 జీడిపప్పు తగినంత తయారుచేయువిధానం ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి తరువాత కేప్సికంముక్కలు,తమటముక్కలువేసి కొంచెం ఉడికేక మశ్రూం ముక్కలు వేసిసన్నటి మంటపై  మూత పెట్టాలి అవికూడా ఉడికేక ఉప్పు,మిరియాలపొడి,అల్లం,వెల్లుల్లి పేస్ట్ ,పసుపు,కారం,వేసి బాగా కలపాలి తడి పోయి కూర పూర్తిగా తయారయ్యాక అన్నం కలిపి 5 నిమిషాలు గరిటెతో కలుపుతో బాగా వేయించాలి దింపేముందు పనీరుముక్కలు ,వేయించిన జీడిపప్పు కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి రైతా తో బాగుంటుంది 
రైతాకి పెరుగులో కేరట్,ముక్కలు,టమాటా ముక్కలు,ఉల్లిపాయాముక్కలు ,పచ్చిమిర్చిముక్కలు కొత్తిమీర అన్ని బాగా సన్నగా తరిగి కలపాలి తగినంత ఉప్పు కలిపితే రైతారెడి 

10, జూన్ 2011, శుక్రవారం

రైస్ స్ప్రింగ్ రోల్

రైస్ స్ప్రింగ్ రోల్ కావలసినవి
 మైదా 1 కప్
 బియ్యంపిండి 1/2 కప్
 అన్నం 1 కప్
 పసుపు చిటికెడు 
నిమ్మరసం 1 స్పూన్
 కొబ్బరి తురుం 1/2 కప్
 ఉప్పు తగినంత
 టమాట సాస్  2 స్పూన్స్
 తురిమిన చీజ్  క్యూబ్ 1 
మిరియాలపొడి 1/2  స్పూన్ 
ఆవాలు 1/2  స్పూన్
 ఎండుమిరపకాయలు 2 
 నూనె 2  స్పూన్స్
 తయారుచేయువిధానం మైదా,బియ్యంపిండి నీరు పోసి కలిపి అందులో ఉప్పు,మిరియాలపొడి కలిపి అట్లు వేసుకోవాలి .మూకుడులో నూనె వేడి చేసి ఆవాలు,మిరపకాయలు వేయించి అన్నం,కొబ్బరి ,పసుపు ,నిమ్మరసం వేసి 5  నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి .అట్లు మీద అన్నం వేసి రోల్ చెయ్యాలి రోల్ మీద సాస్,చీజ్ వేసి 2  నిమిషాలు పెనం మీద వేడి చెయ్యాలి 

stuffed RicePan Cake

stuffed RicePan Cake  కావలసినవి
 అన్నం 1 కప్
 మైదా 1 1/2 కప్
 పాలు 1/2 కప్ 
చక్కెర 4  స్పూన్స్
 యాలకులపొడి 1/2 స్పూన్
 కొబ్బరి 4 స్పూన్స్
 కుంకుము పువు చిటికెడు
 నెయ్యి 1 స్పూన్ 
 నూనె 4  స్పూన్స్  
 తయారుచేయువిదానం స్టవ్ మీద మూకుడు పెట్టి  నెయ్యి వేసి అన్నం,చక్కెర,యాలకులపొడి,కొబ్బరిపొడి,కుంకుమ పువు వేసి 5 ని ..కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి గిన్నె తీసుకుని మైదాలో పాలు కలిపి దోసపిండిలా చేసి పెనం మీద దోసలా పొయ్యాలి   దోస మద్యలో అన్నం మిశ్రమాన్ని పెట్టి రోలు చేసి పెనం మీద మల్లి వేయించాలి  మధ్యకి కట్ చేసి అందించాలి      

9, జూన్ 2011, గురువారం

మెంతి పులుసుకూర

మెంతి పులుసుకూర కావలసినవి
 మెంతి ఆకూ 2 కట్టలు
 సెనగపిండి చిన్న కప్
 కారం 1 స్పూన్
 కొబ్బరి చిన్న ముక్క 
నూనె వేయించడానికి సరిపడా
 ఉప్పు తగినంత 
చింతపండు పులుసు 1 కప్
  పోపులోకి ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి 
 తయారుచేయువిధానం మెంతికూర సన్నగా తరగాలి .సెనగపిండిలో ఉప్పు.కారం.కొబ్బరి తురుముకలిపి కొంచెం నీరుచేర్చి కలుపుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె కాగేకసెనగపిండి చిన్న.చిన్న ఉండలుగా వేయించుకోవాలిఇంకో గిన్నె స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల నూనె వేసి ఆవాలు..జీలకర్ర,ఎండుమిర్చి వేయించి మెంతి ఆకూ ,చింతపండు పులుసు వేసి కొంచెం మగ్గేక సెనగపిండి ఉండలువేసి  5 ని ..మగ్గించి స్టవ్ ఆఫ్ చెయ్యలి 

ఆపిల్ పచ్చడి

ఆపిల్ పచ్చడి కావలసినవి 
 పుల్లగా ఉన్న ఆపిల్ 2 
 పుట్నాలపప్పు 2  స్పూన్
 పచ్చిమిర్చి 5 
 కొత్తిమీర
 కొబ్బరి చిన్న ముక్క
 నూనె 2  స్పూన్స్
 ఉప్పు తగినంత 
పంచదార 1 స్పూన్ 
 సెనగపప్పు
  మినపప్పు
  ఆవాలు జీలకర్ర
 ఎండుమిర్చి 
   తయారుచేయువిధానం ఆపిల్ పైన తొక్క తీసి తురుముకోవాలి ఆపిల్ తురుము.,కొబ్బరి,ఉప్పు,పచ్చిమిర్చి,కొత్తిమీర,పుట్నాలపప్పు,పంచదార,అన్ని కలిపి మిక్సిలో గ్రైండ్ చెయ్యాలి పోపు వేయించి కలపాలి   

8, జూన్ 2011, బుధవారం

స్వీట్ పోటాటాతో బూరులు

స్వీట్   పోటాటాతో బూరులు కావలసినవి
 చిలకడదుంపలు 1/2  కేజీ
 బెల్లం 1/4  కేజీ
 మినపప్పు 1 కప్
 బియ్యం 2 కప్ 
ఏలకులు 4  
  కొబ్బరి సగం చిప్ప 
 తయారుచేయువిధానం ముందుగా బియ్యం.మినపప్పు 6  గంటలముందునానపెట్టాలి ,మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి ,చిలకడ దుంపలు పైన తొక్క తీసి ముక్కలు కట్ చేసి ఉడకపెట్టాలి ,చల్లారేక నీరు తీసేసి చేత్తో మెత్తగా ముద్దా చేసి ఏలకుల పొడివేసికొబ్బరి తురుం  కలిపి నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పెట్టి కాగేకాచిలకడ దుంప ఉండని బియ్యం.మినపప్పు పిండిలో ముంచి వేయించాలి చిలకడ దుంపల బూరెలు రెడి 

ఆలూ ,సొంపాపిడి

ఆలూ ,సొంపాపిడి కావలసినవి 
 పంచదార 500  గ్రామ్స్ 
  నెయ్యి 200  గ్రామ్స్
 పాలు 1 కప్
 ఆలూ  1//2 కేజీ 
 తయారుచేయువిధానం పంచదారలో ఒక కప్ నీరు పోసి పాకం పట్టాలి ,ఆలూ ముక్కలు కట్ చేసుకుని మెత్తగా ఉడకపెట్టాలి  చల్లారేక /ఆలూ,ముక్కలులో పాలు కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి,పాకం బాగా తయరైయ్యాక ఆలూ ముద్ద వేసి మైసూరు పాకం లానెయ్యి వేస్తూ కలపాలి కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేటులో నెయ్యి రాసి దాంట్లో పరిచి ముక్కలు కట్ చేసుకోవాలి