30, ఆగస్టు 2011, మంగళవారం

స్వీట్ ఉండ్రాళ్ళు

స్వీట్ ఉండ్రాళ్ళు  కావలసినవి 
 బియ్యం రవ్వ 2 గ్లాసులు 
 కొబ్బరితురుము  2 గ్లాసులు
 బెల్లం 2  గ్లాసులు 
   తయారుచేయువిధానం  2  గ్లాసుల నీరు మరిగించి రవ్వ ఉడికించి పెట్టాలిస్టవ్ మీద బాణలి పెట్టి బెల్లం,కొబ్బరి  వేసి దగ్గరయ్యేవరకు కలపాలి చల్లారేక చిన్న ఉండలు చేసుకుని పైన ఉడికించిన రవ్వపెట్టి ఉండలు చేసుకుని  ఇడ్లి పాత్రలో ఆవిరి మీద ఉడికించుకోవాలి  

ఉండ్రాళ్ళు


ఉండ్రాళ్ళు  కావలసినవి
  బియ్యం రవ్వ 2 గ్లాసులు 
సెనగ పప్పు సగం గ్లాసు
 జీలకర్ర 1 స్పూన్ 
ఉప్పు తగినంత  
 తయారుచేయు విధానం 2 గ్లాసుల నీరు తీసుకునిఉప్పు,జీలకర్ర ,సెనగపప్పు వేసి మరగ పెట్టాలిఅ నీటిలో రవ్వ కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి కొంచెం చల్లారక కావలసిన సైజులో ఉండలు చేసుకుని ఇడ్లి పాత్రలోనీరుపోసి  ఆవిరి మీద  ఉడికిస్తే  ఉండ్రాళ్ళురెడి

 ఇలాగే సెనగపప్పు బదులు కొబ్బరి తురుము కలిపి  చేయ వచ్చు 

26, ఆగస్టు 2011, శుక్రవారం

ఆవడలు [పెరుగు ,వడలు ]

ఆవడలు [పెరుగు ,వడలు ]  కావలసినవి                                        
 మినపప్పు 1/4 కిలో
 పెరుగు 4 కప్  
పచ్చిమిర్చి 4  
కొత్తిమీర  1 కట్ట
 మెంతులు 1 స్పూన్
 మినపప్పు  1 స్పూన్  
ఆవాలు 1 స్పూన్ 
 జీలకర్ర  1 స్పూన్  
 అల్లం చిన్నముక్క 
 ఉప్పు తగినంత  
   నూనె వేయించడానికి సరిపడా 
 తయారుచేయువిదానం మినపప్పు4 గంటలముందు నానపెట్టుకోవాలి నానేక కొంచెం నీరు పోసి మెత్తగా గారేలపిండి మిక్సి చేసుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి పోపు వేయించుకుని పెరుగులో కలపాలి .పచ్చిమిరపకాయలు ,కొత్తిమీర ,అల్లం మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెరుగులోకలపాలి ఉప్పువేసిపెరుగు బాగా కలిపి పెట్టుకోవాలి స్టవ్ మీదబాణలి పెట్టినూనె వేడి చేసుకుని  గారెలు వేయించుకుని  ఒకసారి నీళ్ళల్లో ముంచి పెరుగులో వెయ్యాలి నీళ్ళల్లో వేస్తె పెరుగులో లో త్వరగా నానుతై ఇష్టమైన వాళ్ళు ఆవ నూరి పెట్టుకోవచ్చు .,,పైన బూంది వేసుకోవచ్చు ఎలా చెసుకున్నాచాల టేస్తీగానే ఉంటై   

20, ఆగస్టు 2011, శనివారం

క్యాప్సికం పచ్చడి

క్యాప్సికం పచ్చడి కావలసినవి
 క్యాప్సికం  4 
 టమాటాలు  2 
 మెంతులు   1/2  స్పూన్
 నువ్వులపొడి 2  స్పూన్స్
 ఆవాలు,జీలకర్ర 1 స్పూన్ 
 కరివేపాకు 2  రెమ్మలు
 ఎండుమిర్చి 5 
 ఇంగువ చిటికెడు
 నూనె 4  స్పూన్స్ 
 ఉప్పు తగినంత 
  పసుపు 1/2 స్పూన్  
  తయారుచేయువిధానం క్యాప్సికం,టమాటాలు కట్ చేసిపెట్టుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేడి చేసి మెంతులు ,ఎండుమిర్చి వేయించి టమాటాలు,కరివేపాకు వేసి కొంచెం వేగిన తరువాత క్యాప్సికం వేసి  మగ్గిన తరువాత  స్టవ్ ఆఫ్ చెయ్యాలి .చల్లారిన తరువాత  మిక్సిలో వేసి నువ్వులపొడి,పసుపు ,ఉప్పు చేర్చి గ్రైండ్ చెయ్యాలి  బాణలిలో  మిగతా 2  స్పూన్ల  నూనె వేసి వేడి చేసి ఆవాలు,జీలకర్ర,ఇంగువ వేయించి   పచ్చడిలో కలిపితే క్యాప్సికం పచ్చడి రెడి               



18, ఆగస్టు 2011, గురువారం

కాప్సికం బోండా

కాప్సికం బోండా   కావలసినవి
 కొంచెం చిన్న సైజు  కాప్సికం  4
 బంగాలదుంపలు 2 
 ఉల్లిపాయ 1 
 శనగపిండి   2 కప్
 ఉప్పు సరిపడా 
 కారం 2 స్పూన్స్ 
 నూనె వేయించడానికి సరిపడా  
 వంటసోడా చిటికెడు  
  తయారుచేయువిధానం ఆలూ ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదిపి పెట్టుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి రెండు స్పూన్ల నూనెవేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించి ఆలూ ముద్దా,ఉప్పు ,కారం వేసి బాగా కలిపి కూర చేసిపెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకో బాణలి పెట్టి నూనె వేడి చేసుకొని ..సెనగ పిండిలో ఉప్పు ,కారం,వంటసోడావేసి నీరుపోసి బజ్జి పిండి కలుపుకోవాలి .కాప్సికం ఒకవేపు కొంచెంకట్ చేసి ఆలూ కూర మద్యలో పెట్టి కప్సికంను బజ్జిపిండిలో ముంచి నూనెలో వేయించుకోవాలి 

15, ఆగస్టు 2011, సోమవారం

ఆలూ బోండా

ఆలూ బోండా  కావలసినవి
 బంగాలదుంపలు  4
ఉల్లిపాయలు 2 
 పచ్చిమిర్చి 2 
 కరివేపాకు 2 రెమ్మలు 
 అల్లం,వెల్లుల్లి పేస్ట్  1  స్పూన్ 
 సెనగపిండి 1 కప్ 
 బియ్యం పిండి 2 స్పూన్స్
 ఉప్పు సరిపడా
 కారం 1 స్పూన్
నూనె వేయించడానికి సరిపడా 
  తయారుచేయువిధానం ముందుగ ఆలూ ఉడికించుకుని తొక్క తీసి చిదిపిపెట్టుకోవాలి .ఉల్లిపాయలు,పచ్చిమిర్చిసన్నగా కట్ చేసుకుని స్టవ్ మీద బాణలి పెట్టి రెండు స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లిపాయ,పచ్చిమిర్చివేయించాలి సరిపడా,.ఉప్పు,కారం,అల్లంవేల్లుల్లిపెస్ట్ కరివేపాకు వేసి ,.అలూగడ్డ ముద్దకుడా వేసి కూర చేసిపెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకో బాణలి పెట్టి నూనె వేసి వేడిచేసుకోవాలి ఇంకోగిన్నెలో సెనగపిండి బియ్యంపిండి,ఉప్పు కారం వేసినీళ్ళు కలిపి  బజ్జిపిండి  కలుపుకోవాలి .అలూకూరని నిమ్మకాయంత ముద్దా తీసుకుని బజ్జిపిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి 

12, ఆగస్టు 2011, శుక్రవారం

Eenadu - The Heart And Soul Of AndhraPradesh

వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత చక్కగ వివరించారు.
చదివితె పూజ ఇంకా శ్రద్ధగ చేసుకోగలమని లింక్ ఇక్కడ పొస్ట్ చేస్తున్నాను.
ఆ తల్లి చల్లని దీవెనలు అందరికి అనదాలని ఆశిస్తు- సుశీల కందికొండ

Eenadu - The Heart And Soul Of AndhraPradesh

11, ఆగస్టు 2011, గురువారం

కార్న్ చాట్

కార్న్ చాట్  కావలసినవి 
మొక్క జొన్న గింజలు 1 కప్ 
ఉల్లిపాయ 1 
 టమాట 1  
కొత్తిమీర సగం కట్ట
 పచ్చిమిరపకాయ 1
వెన్న 1  స్పూన్
 ఉప్పు తగినంత 
మిరియాలపొడి 1 స్పూన్ 
 చాట్ మసాల 1 స్పూన్ 
 నిమ్మరసం  1  స్పూన్ 
   సన్నకారపూస 1/2  కప్ 
 తయారుచేయువిధానం మొక్క జొన్నగింజలు ఉడికించి పెట్టాలి,ఉల్లిపాయ,టమాట,పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలిస్టవ్ మీద బాణలి పెట్టి వెన్నవేడి చేసి  .ఉడికించిన మొక్కజొన్నల గింజలని సన్నని సెగ పై వేయించాలి .టమాట,ఉల్లిపాయ పచ్చిమిర్చికూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి చల్లారేక చాట్ మసాల,మిరియాలపొడి,నిమ్మరసం కలిపి పైన సన్నకారపూస,కొత్తిమీర చల్లితే కార్న్ చాట్ రెడి

10, ఆగస్టు 2011, బుధవారం

ఆపిల్ బర్ఫీ

ఆపిల్ బర్ఫీ కావలసినవి
 ఆపిల్ 4
పంచదార  1 కప్
 నెయ్యి 1/2 కప్ 
 ఏలకులు 4
 జీడిపప్పు,బాదం 10    
 తయారుచేయువిధానం ఆపిల్ పైన తొక్క.,గింజలు తీసేసి ముక్కలు కట్ చేసుకుని ఉడికించుకోవాలి /చల్లారిన తరువాత గరిటెతో ముక్కలు చిదిపి అగుజ్జు ,పంచదార కలిపి స్టవ్ మీద పెట్టి సన్నని సెగ మీద ఉడికించాలి కొంచెం దగ్గర పడ్డాక నెయ్యివేసి కలపాలి నెయ్యిపైకి తేలుతున్నప్పుడు ఏలకుల పొడి,జీడిపప్పుబాదంవేసి నెయ్యిరాసిన ప్లేటులో పరిచి కట్ చేసుకోవాలి

4, ఆగస్టు 2011, గురువారం

నవరతన్ బజ్జి

నవరతన్ బజ్జి   కావలసినవి
 పాలకూర 1 కట్ట
 తోటకూర 1 కట్ట 
మెంతికూర 1 కట్ట
 చుక్కకూర  1 కట్ట
 బచ్చలికూర 1 కట్ట 
పుదీనా 1 కట్ట
 కరివేపాకు 1 కట్ట 
కొత్తిమీర 1 కట్ట
 ఉల్లికాడలు 1 కట్ట 
 సెనగపిండి 1 1/2 కప్
 మైదా 1/2 కప్ 
 కార్న్ ఫ్లోర్ 1/2   కప్
 బియ్యం పిండి 1/2 కప్  
 ఉల్లిపాయలు  2
కారం 2 స్పూన్స్
 ఉప్పు తగినంత 
వామ్ 2 స్పూన్స్
 జీలకర్ర 2 స్పూన్స్
 వంట షోడ చిటికెడు
 అల్లం,వెల్లుల్లి పేస్ట్ 
 నూనె వేయించడానికి సరిపడా 
  తయారుచేయువిధానం  ముందుగా ఆకు కూరలన్నీ శుబ్రముగా కడుక్కుని సన్నగా కట్ చేసుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి 2 లేక 3  స్పూన్ల నూనె వేసుకుని కట్ చేసిన ఆకు కూరలన్నీ వేసి పచ్చి వాసన పోయేదాకా రెండు నిమిషాలు వేయించాలి  అర కప్పుచొప్పున  సెనగపిండి, మైదా,బియ్యంపిండి,మొక్కజొన్న పిండి ,అల్లం,వెల్లుల్లి ముద్దా,ఉప్పు,కారం,ఉల్లిపాయ ముక్కలు ,వేసి గట్టి పిండి అయ్యేదాకా కలపాలి .ఇంకో గిన్నె తీసుకుని కప్పు సెనగపిండి,సరిపడా ఉప్పు,కారం,వాము,జీలకర్ర,వంటసోడా వేసి నీరు చేర్చి బజ్జిపిండిలా కలపాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసుకుని ఆకు కూరలపిండిని చిన్న ఉండ తీసుకుని చేత్హో వత్హి బజ్జి పిండిలో ముంచి నూనెలోఎర్రగా  వేయించు కోవాలి ఇది టమాట సాసు తో తింటే బాగుంటాయి