28, నవంబర్ 2011, సోమవారం

వెజ్ టబుల్ బర్గర్

కావలసినవి:
బర్గర్ రోల్(చిన్నసైజు బన్స్):-8
కీరదొసకాయ:2
టమోటాలు:-4
ఉల్లిపాయలు చక్రాల్లాగా తరిగినవి:-8 ముక్కలు.
వెన్న:-200గ్రా.
టమోట సాస్:1/2 కప్పు.
టూత్ పిక్స్:8

వెజ్ టబుల్ కట్ లెట్ కు కావలసినవి:-
క్యారెట్స్:1/4కిలో.
బంగాళదుంపలు:1/4కిలో
బీన్స్:- 200గ్రాములు.
మిరియాలపొడి:1/4చెంచా
కారం:1/4చెంచా
మైదాపిండి:-4 గరిటెలు
అల్లం ముక్కలు:2 చెంచాలు
నూనె:-2 గరిటెలు
ఉప్పు:-సరిపడ

తయారు:-
1)బంగాళదుంపలను ఉడికించి తొక్కుతీసి మెత్తగా మెదిపి ఉంచాలి.
2)దీనికి ఉడికించిన బీన్స్,క్యారెట్స్ సన్నని ముక్కలు,మిరియాలపొడి,ఎర్రకారం,నిమ్మరసం,సరిపడ ఉప్పు వేసి బాగ కలిపి దాన్ని 8 బాల్స్ గా చేసుకొని వడలాగా తట్టి మైదాపిండిలో ముంచి బాగా మెదపాలి.
3)తర్వాత కాగిన పెనం మీద నూనె వేసి కట్ లెట్స్ ను బాగా ఎర్రగా కాల్చి వుంచాలి.
4)బన్స్ ని మధ్య అడ్డంగా కోసి,వెన్న రాసి వేడి పెనం మీద కాల్చి వుంచండి.
5)కట్ లెట్ కి పైన చక్రాల్లాగా కోసిన కీర,టమోటా ముక్కలను వుంచి దాన్ని బన్ మధ్యలో ఉంచి పైన టమోటా సాస్ పూసి చక్రాల్లాగా కోసి ఉల్లిముక్కలను బన్ మీద వుంచి టూత్ పిన్ గుచ్చేలా అలా అన్నింటిన తయారుచేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

స్టఫ్డ్ పొటాటో

కావలసినవి
గొధుమపిండి:-1/4 కిలో
బంగాళదుంప:-1/4 కిలో
పచ్చిమిర్చి సన్నని ముక్కలు:1/4 కప్పు.
కారం:1 చెంచా.
ఉల్లి ముక్కలు:-1 1/2 కప్పులు
కర్వేపాకు:-4 రెబ్బలు.
నూనె:సరిపడ.
కొత్తిమీర:1/2 కప్పు తరిగినది.
పసుపు,ఉప్పు:సరిపడ.

తయారు:-
1)బంగాళదుంపలని మెత్తగా ఉడకబెట్టి చెక్కు తీసి మెదిపి దానికి ఉప్పు,కొత్తిమీర తరుగు,కారం,పసుపు వేసి కలిపి ఉంచాలి.దీనికి ముందే గొధుమపిండికి తగినంత నీరు,ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి ఉంచాలి.
2)బాండీలో నాలుగు చెంచాల నూనె వేసి అందులో ఉల్లి,మిర్చిముక్కలు వేసి వేపాలి.
3)వేగిన తర్వాత స్టౌ మీద నుంచి దింపి బంగాళదుంప మిశ్రమాన్ని కలపాలి.
4)మొత్తం కలిసిన తర్వాత చల్లారనిచ్చి నిమ్మకాయంత ఉండలు తేసుకొని పూరీ సైజులో వత్తుకోవాలి.
5)దీని మధ్య బంగాళదుంప ఉండని పెట్టి చుట్టురా మడిచి మళ్ళీ పూరీలా వత్తాలి.
6)పెనం వేడి చేసి చపాతీని వేసి నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేయాలి.

18, నవంబర్ 2011, శుక్రవారం

జీడిపప్పు చేగోడీలు

జీడిపప్పు చేగోడీలు  కావలసినవి
బియ్యం పిండి 3 కప్స్
జీడిపప్పు ముక్కలు 1/2 కప్
కారం 1 స్పూన్
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి సరిపడా
నెయ్యి  4 స్పూన్స్
   తయారుచేయువిదానం  3 కప్పుల నీరు మరిగించి ఉప్పు,కారం,జీడిపప్పు ముక్కలుజీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసి బియ్యం పిండి కలుపుతూ వెయ్యాలి ఉండలు కట్టకుండా  నెయ్యి వేసి కలిపి చల్లారక  చిన్న,చిన్న ఉండలు తీసి చేగోడీలు వేయించుకోవాలి 

17, నవంబర్ 2011, గురువారం

కార్న్ బూందీ

కార్న్ బూందీ  కావలసినవి
 స్వీట్ కార్న్ గింజలు  2 కప్స్
 సెనగపిండి  1 1/2 కప్స్
బియ్యం పిండి 1/4  కప్
 కారం 1 స్పూన్
 ఉప్పు తగినంత
 గరం మసాల 2 స్పూన్స్
 చాట్ మసాల 2 స్పూన్స్
 నూనె సరిపడా
   తయారుచేయువిదానం సెనగపిండి,బియ్యం పిండి ఒక బౌల్ లో వేసి ఉప్పు,కారం,గరం మసాల  వేసి కొంచెం నీరు పోసి కలిపి పెట్టుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి అయ్యాక కలిపి ఉంచిన పిండిలో కార్న్ గింజలు వేసి కలిపి స్పూన్ తో నూనెలో వేస్తె ఇవి దేనికవే వేగుతాయి అన్ని వేగేక చాట్ మసాల చల్లి తింటే చాల రుచిగా ఉంటాయి 

11, నవంబర్ 2011, శుక్రవారం

బ్రెడ్ హల్వా

బ్రెడ్ హల్వా  కావలసినవి
 బ్రెడ్ పేకట్ 1
నెయ్యి 1 కప్
ఏలకులపొడి 1 స్పూన్
 పాలు 1 లీటర్
పంచదార 1 కప్
 బాదం,జీడిపప్పు 20 గ్రాములు
 తయారుచేయువిధానం  గిన్నె లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు,బాదం వేయించి పక్కనపెట్టి మరికొంచెం నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి ఒక గిన్నెలో పాలు మరిగించి పంచదార కలిపి వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి ఉడికించాలి ముక్కలు మెత్తగా అయి హల్వా దగ్గర పడ్డాక బాదం,జీడిపప్పుతో అలంకరించాలి 

గోధుమ హల్వా

గోధుమ హల్వా కావలసినవి
 గోధుమలు 1 గ్లాసు
 పంచదార  1 1/2 గ్లాసు 
నెయ్యి 4 స్పూన్స్ 
జీడిపప్పు 20  గ్రాములు
 ఏలకులపొడి చిటికెడు   
 తయారుచేయువిధానం 5  గంటలముందు గోధుమలు నానపెట్టాలి నానేక మిక్సిలో వేసి 1  గ్లాసు నీరు పోసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి పల్చటి గుడ్డలో వడపోయ్యాలి గోధుమ పాలు తీసుకుని పంచదార కలిపి స్టవ్ మీద సిమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలి దగ్గర పడ్డాక నెయ్యి ,ఏలకులపొడి వేసి బాగా కలిపి ప్లేటులో పరచి జీడిపప్పు వేసి ముక్కలు కట్ చేసుకోవాలి 

మైదా హల్వా

మైదా హల్వా కావలసినవి
 మైదా 1 కప్
పంచదార 2 కప్
పాలు  3 కప్స్
ఫుడ్ కలర్ చిటికెడు
 నెయ్యి 4 స్పూన్స్
 జీడిపప్పు 20  గ్రాములు  
 యాలకులపొడి చిటికెడు
 తయారుచేయువిధానం పాలు తీసుకుని మైదా వేసి ఉండలు లేకుండా కలిపి పంచదార కలిపి స్టవ్ మీద సిమ్ లో పెట్టి అడుగు అంటకుండా కలపాలి దగ్గర పడ్డాక నెయ్యి వేసిఏలకులపొడి వేసి  ప్లేటులో పరచి ముక్కలు కట్ చేసుకోవాలి 

సగ్గుబియ్యం హల్వా

సగ్గుబియ్యం హల్వా   కావలసినవి
 సగ్గుబియ్యం 1  గ్లాసు
 పంచదార 1 గ్లాసు
 పాలు 2 గ్లాసులు
 యాలకులపొడి చిటికెడు   
 జీడిపప్పు  20 గ్రాములు
 కిస్మిస్ 10 గ్రాములు
నెయ్యి 4 స్పూన్స్  
  తయారుచేయువిధానం ఒక దళసరి గిన్నె తీసుకుని సగ్గుబియ్యం పొడిగా వేయించాలి వాటిని తీసి పక్కన పెట్టి అదే గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి వేరే ప్లేటులోకి తీసుకుని .గిన్నెలోకి పాలు తీసుకుని మరిగించాలి పాలు మరిగేక వేయించిన సగ్గుబియ్యం వేసి ఉడికించాలి సగ్గుబియ్యం ఉడికేక పంచదార వేసి మిగిలిన ,నెయ్యివేసి  కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేటులో పరచి జీడిపప్పు,కిస్మిస్ యాలకులపొడి తో అలంకరిస్తే రుచికరమైన సగ్గుబియ్యం హల్వా రెడి 

2, నవంబర్ 2011, బుధవారం

సేమ్య హల్వా

సేమ్య హల్వా   కావలసినవి
 సేమ్య 1 గ్లాస్ 
పంచదార 1 గ్లాస్
 నెయ్యి 4  స్పూన్స్ 
నీళ్ళు 1 1/2 గ్లాస్
 జీడిపప్పు తగినంత 
ఏలకులపొడి 1/2 స్పూన్ 
  తయారుచేయువిధానం స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేడిచేసి జీడిపప్పు వేయించి ప్లేటులోకి తీసుకుని సేమ్య దోరగా వేయించి నీళ్ళుపోసి ఉడికించాలి పంచదార వేసి కొంచెం దగ్గరపడ్డాక ఏలకులపొడి,నెయ్యివేసి స్టవ్ ఆఫ్ చేసి ప్లేటులో పరచి  జీడిపప్పు పైన వెయ్యాలి 

మెక్సికన్ గ్రీన్ రైస్

మెక్సికన్ గ్రీన్ రైస్  కావలసినవి
 బాస్మతి రైస్  2  కప్
 ఉల్లిపాయ ముక్కలు 1 కప్
 ప్రెంచ్ బీన్స్ ముక్కలు 1 కప్
 వెన్న 1/2  కప్  
పచ్చిమిరపకాయలు లావుగా,పొడుగ్గా ఉన్నవి 4 
 సిమ్ల మిర్చి 2  
 కోత్హిమీర సన్నగా తరిగినది 1/2  కప్
 అల్లం,వెల్లుల్లి ముద్దా 1 స్పూన్ 
ఉప్పు సరిపడా   
      తయారుచేయువిధానం బియ్యాన్ని అరఘంట ముందు నానపెట్టాలి పచ్చి మిర్చి ,సిమ్ల మిర్చి మంటపై కింద,పైన కాల్చి చల్లని నీటిలో వేసి తొక్క తీసి మిక్సిలో .కోత్హిమీర,అల్లం,వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి    స్టవ్ మీద కడాయి పెట్టి వెన్న వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించాలి నానపెట్టిన బియ్యం వేసి 5  నిమిషాలు వేయించి గ్రైండ్ చేసిన ఫెస్ట్ కలిపి 4 కప్ నీరు కలిపి సన్నటి మంటపై మూత పెట్టి ఉడికించాలి