28, డిసెంబర్ 2011, బుధవారం

కాలిప్లవర్ పచ్చడి

కాలిప్లవర్ పచ్చడి  కావలసినవి
 కాలిప్లవర్ ముక్కలు 2 కప్పులు
 నూనె 1/4 కప్
వెల్లుల్లి రెబ్బలు 4
 కారం 3 స్పూన్స్
ఉప్పు 3 స్పూన్స్
జీలకర్రపొడి 1 స్పూన్
  ఆవపొడి 1 స్పూన్
 నిమ్మకాయ 1
పసుపు 1/4 స్పూన్
 ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
 మెంతిపిండి 1 స్పూన్
    తయారుచేయువిధానం  కాలిప్లవర్ ముక్కలు ఉప్పునీటిలో కడిగి అరపెట్టాలి ఆరిన ముక్కలు నూనెలో ఎర్రగా వేయించుకోవాలి  సీజన్లో వచ్చే అన్ని రకాల కూరలుతో [దొండకాయ,కేబేజీ ,కేరట్,కాప్సికం,బీన్స్ ]  చేసుకోవచ్చు నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర వేయించి అనూనే కొంచెం చల్లారేక కారం,మెంతిపిండి,జీలకర్రపొడి,పసుపు,ఉప్పు బాగా కలిపినిమ్మరసం  కాలిప్లవర్ ముక్కలు కలిపి పెట్టుకోవాలి 

మీకు కనక ఇది నచినట్లు అయితే దయచేసి మీ స్పందన మాకు మెయిల్ ద్వార తెలియచేయగలరు. ఇంకా ఏమైనా మీకు కావలిసిన items మాకు పంపితే మేము  బ్లాగ్ లో పెడతాము కింద మీ పేరు కూడా పెడతాము దయచేసి మీ details  తో సహా మాకు మెయిల్ చెయ్యండి.
మా మైల్ అడ్రస్ suseelakandikonda@gmail.com 

26, డిసెంబర్ 2011, సోమవారం

ఉల్లిపాయ పచ్చడి

ఉల్లిపాయ పచ్చడి   కి కావలసినవి
 ఉల్లిపాయలు 4
చింతపండు గుజ్జు 1/4 కప్
కారం 1/4 కప్
 ఉప్పు 1/4 కప్
 మెంతిపిండి 1 స్పూన్
 జీలకర్రపొడి 1  స్పూన్
పసుపు 1/4 స్పూన్
 నూనె 1/4  కప్
 తయారుచేయువిధానం  ఉల్లిపాయలు సన్నగా,పొడుగ్గా తరిగి చింతపండు,ఉప్పు,కారం,మెంతిపొడి,జీలకర్రపొడి,పసుపు,వేసి బాగాకలిపి పెట్టుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర వేయించి పచ్చడిలో వేసి బాగాకలిపి పెట్టుకోవాలి 

ములక్కాడల పచ్చడి

ములక్కాడల పచ్చడి  కావలసినవి 
ములక్కాడలు  4
చింతపండు 1 కప్
మెంతి పిండి 2  స్పూన్స్
 కారం  5   స్పూన్స్
 ఆవపొడి 5 స్పూన్స్
 ఇంగువ చిటికెడు
పసుపు 1/4  స్పూన్
 జీలకర్ర 1  స్పూన్
కరివేపాకు  2  రెమ్మలు
ఎండుమిర్చి 2
ఆవాలు.,జీలకర్ర  1  స్పూన్
నూనె తగినంత 
 తయారుచేయువిధానం మునక్కాయలు కడిగి ఆరనిచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి మునక్కాయ ముక్కలు ఎర్రగా వేయించుకోవాలి ముక్కలు తీసి అ బాణలిలో మరికొంచెం నూనె వేసి ఎండుమిర్చి ,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు ,పసుపు,ఇంగువ వేయించి పెట్టుకోవాలి చింతపండులో వేడినీరు పోసి గుజ్జు తీసుకుని వేయించుకున్న పోపులో వేసి మునక్కయముక్కలు,ఉప్పు,కారం,మెంతిపిండి,ఆవపొడి,జీలకర్రపొడి,అన్ని కలిపి పెట్టుకోవాలి అన్నం,చపాతి,ఇడ్లి లలో బాగుంటుంది 

25, డిసెంబర్ 2011, ఆదివారం

హ్యాపీ క్రిస్టమస్ ఎగ్ లెస్ కేకు జూను లో పోస్ట్ చేశా  ఎగ్ తో కూడా చేసుకోవచ్చు [ ఇష్టమైన వాళ్ళు ]   ఏప్రెల్ లో చాక్లెట్ కేకు పోస్ట్  చేసాము    

24, డిసెంబర్ 2011, శనివారం

బనానా బ్రెడ్

బనానా  బ్రెడ్  కావలసినవి
 అరటిపళ్ళు[ మీడియం సైజు ]  3
మైదా 2 కప్
 పంచదార 1 కప్
 బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్
 వంటసోడా 1 స్పూన్
 పాలు 3 స్పూన్స్
 వెన్న,లేక డాల్డా  1 కప్
  జీడిపప్పు,బాదం కిస్మిస్ 1 కప్
 సాల్ట్ 1/4
 ఎగ్ 2
  తయారుచేయువిధానం: ఒక పెద్ద బౌల్ తీసుకుని  కప్పు మైదా ,పంచదార,బేకింగ్ పౌడర్ ,వంటసోడా,ఉప్పు,గుజ్జు చేసిన అరటిపండు ,వెన్న లేక డాల్డా ,పాలు ఇవి అన్ని తీసుకుని .బీటర్ తో కానీ,మిక్సిలో కానీ 2 నిమిషాలు బీట్ చెయ్యాలి మిగిలిన మైదాలో ఎగ్గ్స్ పగుల కొట్టి 2 నిమిషాలు బీట్ చేసి అన్ని కలిపి .కాజు,బాదాం,కిస్మిస్ కూడా వేసి
350 డిగ్రీ f   50 ,60  నిమిషాలు బెక్ చెయ్యాలి[ స్టవ్ మీదకూడా  పెట్టుకోవచ్చు కుక్కర్ లో అడుగున నీరు పొయ్యకుండా పిండి గిన్నె పెట్టి వేఇట్ పెట్టకుండా మంట బాగా తగ్గించి పెట్టాలి ]  మద్య లో కొంచెం గట్టి పడ్డాక టూత్ పిన్ తో మద్య,మద్యలో గుచ్చాలి బ్రెడ్ బాగా బెక్ అవుతుంది 

22, డిసెంబర్ 2011, గురువారం

ఇడ్లి తో మంచూరియా

ఇడ్లి తో మంచూరియా  కావలసినవి
 ఇడ్లీలు 6
మైదా 2 స్పూన్స్
కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
 అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్
 ఉప్పు సరిపడా
 వాము 1  స్పూన్
నూనె వేయించడానికి సరిపడా
సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు స్పూన్ 1
ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
కరివేపాకు 2 రెమ్మలు
 కొత్తిమీర ఉల్లిపాయలు 2
జీడిపప్పు కొంచెం          
            తయారుచేయువిధానం ఇడ్లీలు ముక్కలు చేసుకోవాలి [ 1 ఇడ్లీని 4 ముక్కలుగా ]  
ఒక గిన్నెలో మైదా,కార్న్ ఫ్లోర్,అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి పేస్ట్,వాము ఉప్పు చేర్చి కొంచెం నీరుపోసి బజ్జి పిండిలా కలుపుకుని .ఇడ్లి ముక్కలు అందులో ముంచి నూనెలో వేయించుకోవాలి . కొంచెం నూనెలో పోపు వేయించుకుని జీడిపప్పు,.ఉల్లిపాయ ముక్కలు ,కరివేపాకు,కొత్తిమీర,బాగా వేయించి అన్నికలుపుకుని నిమ్మకాయ రసం పిండితే ఇడ్లి మంచూరియ రెడి
      

16, డిసెంబర్ 2011, శుక్రవారం

ఉసిరికాయలతో మురబ్బా

ఉసిరికాయలతో మురబ్బా కావలసినవి
 ఉసిరికాయలు పావు కిలో
 బెల్లం అరకిలో
 జీలకర్రపొడి 1  స్పూన్
 ఏలకులపొడి 1/2  స్పూన్
  తయారుచేయువిధానం ఉసిరికాయలు కుక్కర్ లో మూడు కూతలు వచ్చేదాకా ఉడికించి అదే గిన్నెలో బెల్లం వేసి దగ్గర పడేదాకా కలిపి జీరాపొడి ,ఏలకులపొడి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి  , ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది 

చిట్టి గారెలు

చిట్టి గారెలు కావలసినవి
 మినపప్పు 1 గ్లాస్
 బియ్యం పిండి 3  గ్లాస్సులు
  ఉప్పు తగినంత    
  నూనె వేయించడానికి సరిపడా 
  తయారుచేయువిధానం   మినపప్పు 4 గంటల  ముందు నానపెట్టాలి నానిన మినపప్పుని మెత్తగా గారేలపిండిలా      గ్రైండ్ చేసుకుని బియ్యంపిండి,ఉప్పు కలిపి చిన్న,చిన్న ఉండలు చేసుకుని  తడి  బట్ట పైన ఉండలు పెట్టి పైన తడి  బట్ట వేసి గ్లాసు ,లేదా చిన్న గిన్నె తో తట్టి చిన్న అప్పడాలుగా చేసుకుని  నూనెలో  వేయించుకోవాలి                             
   

14, డిసెంబర్ 2011, బుధవారం

నేతి గారెలు

నేతి గారెలు  కావలసినవి 
మినపప్పు 1 గ్లాస్
 జీలకర్ర కొద్దిగా
 ఉప్పు తగినంత
 నెయ్యి వేయించడానికి సరిపడా
 తయారుచేయువిధానం మినపప్పు 4,,5  గంటలముందు నానపెట్టుకోవాలి నానిన పప్పు కొంచెం నీళ్ళు చల్లుకుని గట్టిగ,మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేడి అయ్యాక పిండిలో ఉప్పు,జీలకర్ర కలుపుకుని అరటి ఆకు కాని,,ఫాల్తిన్ కవర్ మీద చిన్న ఉండ అద్ది మధ్యలో కన్నం చేసి గారెలు బంగారు వర్ణం లోకి వచ్చేలా వేయించుకుంటే బాగుంటాయి    ఇవి ఉప్పు కలపకుండా వేయించుకుని బెల్లం పాకం లో వేసుకున్నా బాగుంటాయి 

9, డిసెంబర్ 2011, శుక్రవారం

రాజస్తాని మిర్చి వడలు

రాజస్తాని మిర్చి వడలు కావలసినవి
 పెద్ద పచ్చిమిరపకాయలు  5
సెనగపిండి 1/2 కప్
వంటసోడా చిటికెడు
 ఉప్పు సరిపడా
 కొత్తిమీర సగం కట్ట
 అల్లం ముక్కలు 1 స్పూన్
 ఉడికించిన బంగాళదుంప 1
 పన్నీర్ కొద్దిగా
నూనె వేయించడానికి సరిపడా
  తయారుచేయువిధానం పచ్చిమిరపకాయలు మద్యలో చీరి మరుగుతున్న నీళ్ళల్లో 2 నిమిషాలు ఉడకనిచ్చి వెంటనే నీల్లల్లోంచి తీసి పక్కన పెట్టాలి .ఆలూ ,పన్నీర్ ,అల్లం,కొత్తిమీర మిక్సిలో మెత్తగాచేసి మిరపకాయ్యల్లో కూరాలి .సెనగపిండిలో ఉప్పు,వంటసోడా నీళ్ళు పోసి బజ్జి పిండి కలిపి నూనె వేడి చేసుకుని పచ్చిమిరపకాయలు పిండిలో ముంచి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి .రాజస్తాని మిర్చి వడలు రెడి ఇవి హరి మిర్చి చట్నీ తోవేడి..వేడి గ  బాగుంటాయి 

మసాల అప్పాలు

మసాల అప్పాలు కావలసినవి
 మైదా 2  కప్
 పావు భాజీ మసాల 3  స్పూన్స్
 ఉప్పు సరిపడా
 నూనె వేయించడానికి సరిపడా
 తయారుచేయు విధానం మైదా,ఉప్పు, ఒక గిన్నెలోకి తీసుకుని 4, 5  స్పూన్ల నూనె వేసి పిండి కలుపుకోవాలి   ఇంకో గిన్నెలో పావు భాజీ లో నూనెవేసి కలిపి పెట్టాలి మైదా పిండి ఉండ తీసుకుని పూరీలా వత్తుకుని ఒక పూరీ మీద పావు భాజీ మసాల పట్టించి దాని మీద ఇంకో పూరీ పెట్టి వత్తి పొడవుగా కట్ చెయ్యాలి ఒక్కొక్క ముక్కను తీసుకుని చుట్టి మద్యలో కొంచెం వత్తి డీప్ ఫ్ర్యే చెయ్యాలి 

మసాల చక్రాలు

మసాల చక్రాలు కావలసినవి 
బియ్యం 1/2
 సెనగ పప్పు  1/2  కప్
 పెసర పప్పు 1/2 కప్
 పచ్చిమిర్చి 2
వెల్లుల్లి 3 రెబ్బలు 
  నువ్వులు 2 స్పూన్స్
 పావు బాజీ మసాల 2 స్పూన్స్
  ఉప్పు సరిపడా
నూనె వేయించడానికి సరిపడా
 తయారుచేయువిధానం స్టవ్ మీద మూకుడు పెట్టి బియ్యం,పెసరపప్పు,సెనగపప్పు విడి,విడిగా వేయించుకోవాలి మిక్సిలో పొడి చేసుకోవాలి  .,వెల్లుల్లి,పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని పిండిలో వేసి ,నువ్వులు,పావుభాజిమాసాల ,ఉప్పు,2  స్పూన్ల నూనె వేసి నీళ్ళు పోసి పిండి కలుపుకుని జంతికల గొట్టం లో వేసి  చక్రాల్లా వత్తు కుని బంగారు రంగు వచ్చేవరకు డీప్ ఫ్రయి చెయ్యాలి