25, డిసెంబర్ 2012, మంగళవారం


  కావలసినవి                                                           డ్రై ఫ్రూట్ కేకు 
  మైదా  1 కప్
 ఎగ్స్ [గుడ్లు] 2
 కోకో పౌడర్ 2 స్పూన్స్
 వెన్న 4 స్పూన్స్
చక్కర పొడి 4 స్పూన్స్
 బేకింగ్ పౌడర్ 1 స్పూన్
 క్రీమ్ 2 స్పూన్స్
 బాదాం,కాజు,అక్రోటు, కిస్మిస్  1/2 కప్
  తయారీ    మైదా జల్లించి కోకోపొడిబేకింగ్ పౌడర్ కలిపి  పెట్టుకోవాలి
 ఒక బౌల్ తీసుకుని  వెన్న,బాగా గిలకొట్టి చక్కర పొడి వేసి చక్కర కరిగే వరకు గిలకొట్టాలి గుడ్లు కూడా వేసి మరి కాసేపు కలిపి కొద్ది కొద్ది గా మైదా వేస్తూ బాగా కలిసేవరకు కలపాలి
 180 డిగ్రీ సెంటిగ్రేడ్  వద్ద ఓవెన్ సెట్ చేసుకోవాలి  పాన్ కి వెన్న రాసి ఈ పిండి వేసి సమానంగా పరచి 35 నిమిషాలు బెక్ చెయ్యాలి చల్లారిన తరువాత చిలికిన క్రీమ్ వేసి కేక్ మీద ఐసింగ్ తరువాత చెయ్యాలి డ్రై ఫ్రూట్ అన్ని డెకరేట్ చేస్తే డ్రై ఫ్రూట్ కేక్ రెడి 

13, డిసెంబర్ 2012, గురువారం

ఉప్పు నీళ్ళు గొంతులో పోసుకుని గూడా గూడా అని పుకిలిస్తే గొంతు నెప్పి తగ్గుతుంది .

29, నవంబర్ 2012, గురువారం

కావలసినవి                                           సన్న కారప్పూస 
 సెనగపిండి 1 కప్
 కారం 1 స్పూన్
 ఉప్పు తగినంత
నూనె వేయించడానికి సరిపడా
 తయారుచేయువిధానం   శనగపిండి జల్లించుకునిఉప్పు,కారం వేసి  తగినన్ని నీరు పోసి మరీ గట్టిగా మరీ పలచగా  కాకుండా మెత్తగా కలుపుకుని మురుకుల గొట్టం[ చిన్న రంద్రాలు ]ఉన్నది తీసుకుని  అందులోనిమ్మకాయంత  పిండి పెట్టి నూనె  వేడి అయ్యాక  వేయించుకోవాలి ఇష్టమైన వాళ్ళు వాము పొడి వేసుకోవచ్చు 

27, నవంబర్ 2012, మంగళవారం

కావలసినవి                                                         మైసూర్ బొండా 
 సెనగపిండి  1 కప్
  ఉల్లిపాయ 1 
 కొత్తిమీర చిన్న కట్ట 
 పెరుగు పావు కప్
 మిరియాలు 10 
 అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ 
 కొబ్బరి చిన్నముక్క 
 ఉప్పు సరిపడా
 బేకింగ్ షోడ చిటికెడు  
  తయారుచేయువిధానం   కొబ్బరి చిన్నముక్కలు చెయ్యాలి ,మిరియాలు కచ్చా పచ్చా గా  చెయ్యాలి,ఉల్లిపాయ సన్నగా కట్ చెయ్యాలి 
 ఒక గిన్నెలో  శనగపిండి ,పెరుగు,అల్లం,వెల్లుల్లిపేస్ట్,కొత్తిమీర,కారం,,ఉప్పు, బేకింగ్ షోడ ,ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి ముక్కలు కలిపి పెట్టుకోవాలి  
 స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక  బొండాలు వేయించుకోవాలి 
కావలసినవి                                                         పన్నీరు మిర్చి బజ్జి 
 బజ్జిమిర్చి [లావు]  10   
 శనగపిండి  కప్ 
 వంట షోడ చిటికెడు 
 పన్నీరు ముక్కలు 50 గ్రామ్ 
 ఆలు 1 
 కారం 1 స్పూన్ 
 ఉప్పు సరిపడా 
 నూనె వేయించడానికి సరిపడా
  అల్లం చిన్న ముక్క   
  కొత్తిమీర చిన్న కట్ట  
  తయారుచేయువిధానం    పచ్చిమిర్చి మద్యలో చీల్చి పెట్టుకోవాలి  ఆలు ఉడికించి  ఆలు,పన్నీర్ మిక్సిలో  వేసి మెత్తగా చేసి అల్లం,కొత్తిమీర,ఉప్పుకూడా వేసి ముద్ద చేసిపెట్టుకోవాలి 
  ఈ ముద్దని మిరపకాయలులో  కూరి పెట్టాలి  
   ఒక బౌల్ తీసుకుని శనగపిండి, ఉప్పు, వంటసోడా ,కారం వేసి తగినన్ని నీరు పోసి బజ్జిపిండిలా కలపాలి 
 స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి పన్నీర్ కూరిన మిరపకాయలు శనగ పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీస్తే కర కర లాడే పన్నీర్ మిర్చి బజ్జి రెడి 
  కావలసినవి                                             నూడుల్స్  పకోడీ
 నూడుల్స్ 1/2  కిలో
 ఉల్లిపాయ 1
 పచ్చిమిర్చి 3
 అల్లం చిన్నముక్క
 కొత్తిమీరా చిన్నకట్ట
 సెనగపిండి  1/2 కప్
 బియ్యం 2 స్పూన్స్
 బేకింగ్ షోడా  చిటికెడు
 కారం 1స్పూన్
నూనె వేయించడానికి సరిపడా
  తయారుచేయువిధానం   నూడుల్స్ తగినన్ని నీరు చేర్చి ఉడికించి  వార్చి పక్కన పెట్టాలి     ఉల్లిపాయ,అల్లం,పచ్చిమిర్చి,కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి
  ఒక గిన్నె తీసుకుని  సెనగపిండి,బియ్యంపిండి,బేకింగ్ షోడ, ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కొత్తిమీర,అల్లం ముక్కలు వేసి నూడుల్స్ ,ఉప్పు,కారం వేసి తగినన్ని నీరు చేర్చి పకోడీ పిండి కలపాలి  
. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి పకోడీలు వేయించుకోవాలి 

12, నవంబర్ 2012, సోమవారం

అందరికి  దీపావళి శుభాకాంక్షలు [ తీపివంటలుతో ]
కావలసినవి                                         బాదం బర్ఫ్హి
  బాదం 1 కప్
 చక్కెర 1
నెయ్యి  2 స్పూన్స్
 
   తయారుచేయువిధానం  2. 3 గంటలముండు  బాదం  నానపెట్టి  పైన తొక్క తీయ్యాలి  పప్పుని మిక్సిలో వేసి మెత్తగా చేసి  చక్కర కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద కలుపుతూ ఉండాలి   దగ్గర పడ్డాకా స్టవ్ ఆఫ్ చేసి  ప్లేటుకి నెయ్యి రాసి పిండి మొత్తం పరచి ముక్కలు కట్ చేసుకోవాలి 
కావలసినవి                                                     బేసిన్ లడ్డు
   సెనగపిండి  2 కప్
 పంచదార 1 1/2 కప్
  నెయ్యి 1/2 కప్
యాలకులపొడి  ఆఫ్ స్పూన్
  తయారుచేయువిధానం   పంచదార మిక్సిలో పౌడర్ చెయ్యాలి , స్టవ్ మీద బాణలి పెట్టినెయ్యి వేసి కరిగేక  సెనగపిండి వేసి కమ్మని వాసన వచ్చేదాకా వేయించాలి పంచదార,యాలకులపొడి వేసి 2 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి లడ్డూలు  చేసుకోవాలి 

2, నవంబర్ 2012, శుక్రవారం

                                                                             కెరట,కొబ్బరి బూరెలు 
కావలసినవి
  కేరట్ తురుము  1 కప్
 కొబ్బరి తురుము  1 కప్
 పంచదార  1  1/2
   యాలకుల పొడి  1/2  స్పూన్
  జీడిపప్పు  కావలసినంత
 మినపప్పు  1 కప్
  బియ్యం 2 కప్
  నూనె వేయించడానికి  సరిపడా
   తయారు చేయువిధానం    ముందుగా  బియ్యం,మినపప్పు 4 గంటలు నానపెట్టి  మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి  1 గంట నానితే బూరెలు బాగా వస్తాయి
 స్టవ్ మీద బాణలి పెట్టి  2 స్పూన్ల నెయ్యి వేసి కెరట,కొబ్బరి తురుము వేసి పచ్చి వాసనా పోయే దాక వేయించి  పంచదార వేసి కరిగి ముద్ద  అయ్యేదాకా అడుగు అంటకుండా కలపాలి  
 నూనె వేడి చేసుకుని కొబ్బరి,కెరట ఉండలు   మినపిండిలో ముంచి బూరెలు దోరగా వేయించుకోవాలి 
                                                                            మొలకెత్తిన  పెసల చాప్స్ 

కావలసినవి
 మొలకెత్తిన పెసలు   1కప్
  బంగాలదుంపలు  2
 బ్రెడ్ పౌడర్  1/2 కప్
 ఉల్లిపాయ  2
 అల్లం ముక్క చిన్నది
 పచ్చిమిర్చి 4
ఉప్పు తగినంత
జీలకర్ర 1 స్పూన్
 కారం  1/2  స్పూన్
 నూన్  వేయించడానికి  సరిపడా
  తయారుచేయువిధానం   బంగాళదుంప ఉడికించి  ముద్ద చేసుకుని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ,మిర్చి,అల్లం కలిపి  పెసలు,ఉప్పు,కారం,జీలకర్ర  కలిపి  పెట్టుకోవాలి
  స్టవ్ మీద  పెనం పెట్టి వేడి చేసి   పిండిని చిన్న చిన్న ముద్దల్లా  చేసుకుని  వడలా  చేసుకుని రెండు వేపులా దోరగా వేయించుకుని  చెట్నీ తో  సర్వ్  చెయ్యాలి
    కావలసినవి                                                     సొరకాయ  [ అనపకాయ]  పాన్  కేక్ 
 తురిమిన సొరకాయ    1 కప్
 బొంబాయి రవ్వ  1 కప్
 శనగపిండి  1/4 కప్
అల్లం ముక్క  చిన్నది
 పచ్చిమిర్చి 4
 పెరుగు  1 కప్
 కారం  1 స్పూన్
 ఉప్పు సరిపడా   
   తయారుచేయువిధానం     అల్లం.,పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని   ఒక బౌల్ లో సొరకాయ తురుము,రవ్వ,శనగపిండి ,కట్ చేసుకున్న అల్లం,పచ్చిమిర్చి ,ఉప్పు,కారం,పెరుగు వేసి తగినన్ని నీళ్ళు పోసి దోస పిండిలా కలుపుకోవాలి
 పెనం వేడి చేసి పల్చగా దోస వేసుకుని రెండు వేపులా నూనె వేసి పైన సొరకాయ తురుము చల్లుకుని    రెండు వేపులా కొంచెం కర,కర లాడేలా వేయిస్తే  బాగుంటుంది                                   

24, అక్టోబర్ 2012, బుధవారం

అందరికి విందు   పసందు  దసరా శుభాకాంక్షలు


27, సెప్టెంబర్ 2012, గురువారం

   
                                             జీడిపప్పు కూర 

కావలసినవి
 జీడిపప్పు 1 కప్  ఉల్లిపాయలు 2  టమోట 1 అల్లం చిన్నముక్క  గసగసాలు 2 స్పూన్స్ జీడిపప్పు 2 స్పూన్స్ నుపప్పు 2స్పూన్స్ గరం మసాలాపొడి  1 స్పూన్ కారం 2స్పూన్స్ నూనె సరిపడా ఉప్పు సరిపడా   కొత్తిమీర 1 కట్ట

తయారుచేయువిదానం  ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి  టమాట ప్యూరి చేసుకోవాలి  గసగసాలు .,జీడిపప్పు.,నూపప్పు .,అల్లం,.కారం గరం మసాల మిక్సిలో   మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ,.స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి అయ్యేక ఉల్లిపాయ ముక్కలు వేయించి  గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి తరువాత టమాట ప్యూరి వెయ్యాలి ఉప్పు కలిపి వేయించి పెట్టుకున్న జీడిపప్పు కలిపి 5 నిమిషాలు ఉడికించాలి                                                           

25, సెప్టెంబర్ 2012, మంగళవారం

 























                                                                   కేసరి పూర్ణాలు

కావలసినవి
  బొంబాయి రవ్వ  1/2  కేజీ
 పంచదార  750 గ్రా
 నెయ్యి  చిన్న కప్
 ఏలకులపొడి  1 స్పూన్
 జీడిపప్పు  కావలసినంత
 కొబ్బరి తురుము 1/2 కప్
 మినపప్పు 2 గ్లాస్
 బియ్యం 4 గ్లాస్
 నూనె వేయించడానికి సరిపడా    తయారుచేయువిధానం   రవ్వను వేయించి  .,జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి .,బాణలిలో నీరు మరగించి పంచదార వేసి కరిగేకా రవ్వ వేస్తూ కలిపి నెయ్యి వేసి ,.కొబ్బరి తురుము వేసి బాగా కలిపి చివరగాఏలకుల పొడి ,.జీడిపప్పు వేసి చల్లరేక చిన్న,.చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి

మినపప్పు.,బియ్యం 4 గంటలు నానపెట్టుకుని  మెత్తగా గ్రైండ్ చేసుకుని  కేసరి ఉండలు ఈపిండిలో ముంచి కాగిన నూనెలో వేయించుకుంటే  పూర్ణాలు రెడీ





















                                                                

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు 

5, ఆగస్టు 2012, ఆదివారం

                                                                          సనగలు చాట్
కావలసినవి
  సనగలు   1 కప్  
 ఉల్లిపాయ  2
 టమాటాలు 2  
 జీలకర్రపొడి 1 sస్పూన్
  ధనియాలపొడి 1 స్పూన్
 చాట్ మసాల పొడి 1 స్పూన్
 kకొత్తిమీర  1
 uఉప్పు tతగినంత
కారం 1 స్పూన్
  నూనె  1 స్పూన్      తయారుచేయువిధానం   సనగలు  kకుక్కర్ లో uఉదికిన్చుకుని  pపెట్టుకోవాలి  ఉల్లిపాయ కొత్తిమీర   సన్నగా కట్ చేసిపెట్టుకోవాలి   టమాటాలు మిక్సిలో   ప్వురి చేసుకోవాలి   sస్టవ్ మీద  బాణలి పెట్టి   నూనె  వేసి ఉల్లిపాయముక్కలు   వేయించాలి   అవి వేగాక  జీలకర్రపొడి   ,ధనియాలపొడి  కలిపి  hఉడికించిన  సనగలుiకలిపి   చివరగా చాట్  మసాల iకలిపి   టమాట iప్వురి  కలిపి  కొత్తిమీర చల్లాలి 
                                                                   
         డ్రై ఫ్రూట్    పలావు 


కావలసినవి    
 బాస్మతి బియ్యం   1/2 kకేజీ
   నెయ్యి తగినంత
 ఎండుద్రాక్ష 1/4  aగ్రా
   జీడిపప్పు 1/4  gr
   బిర్యాని ఆకూ 3
  దాల్చిన చెక్క చిన్నది
ఏలకులు 4
 లవంగం  6
ఉల్లిపాయలు    5  
  తయారుచేయువిధానం   బియ్యం   కడిగి ఉప్పు కలిపి  పొడిపొడిగా  వందిపెట్టుకోవాలిస్టవ్ మీద  బాణలి పెట్టుకుని   iనెయ్యి vవేడి eచేసి బిర్యాని ఆకూ దాల్చినచెక్క ,లవంగాలు ,ఏలకులు veవేసి kకొంచం వేగాక ఉల్లిపాయ ముక్కలు iవేసి వేయించాలి .తరువాత   ఎండుద్రాక్ష  ,జీడిపప్పు   వేసి   aఅవి వేగేక   ఉడికించిన aఅన్నం కలపాలి 

2, ఆగస్టు 2012, గురువారం

                                                                            శాకాన్నం 
కావలసినవి
  దొండకాయ ముక్కలు  1 కప్
 బీన్స్   ముక్కలు  1 కప్
 కేరట్ 1కప్  ముక్కలు
 బంగాళదుంప 1కప్ ముక్కలు
  పచ్చి బటాని  1 కప్
 చిక్కుడు కాయ 1కప్  ముక్కలు
  కేప్సికం 1కప్   ముక్కలు
  చామదుంప   1కప్   ముక్కలు
పచ్చిమిర్చి 4
 బియ్యం 4 కప్
 ఉప్పు తగినంత
 నెయ్యి 5 స్పూన్స్
  జీడిపప్పు  10  
  తయారుచేయువిధానం     జాజికాయ,లవంగాలు,దాల్చినచెక్క,యాలకులు,జాపత్రి, కలిపి మిక్సిలో పొడి చెయ్యాలి       అపొడి 3 స్పూన్స్  నెయ్యిలో వేయించి  పెట్టుకోవాలి  బియ్యం శుబ్రంగా కడిగి కూర ముక్కలు కలిపి  పొడి,ఉప్పు కలిపి కుక్కర్ లో 3విజిల్ వచ్చే వరకు ఉడికించి  జీడిపప్పు నెయ్యిలో వేయించి కలిపితే శాకాన్నం రెడి 
                                                                   కొబ్బరన్నం 
కావలసినవి
  అన్నం  2 కప్
 పచ్చి కొబ్బరి సగం చిప్ప
  పచ్చిమిర్చి  4
 అల్లం ముక్క చిన్నది
  నిమ్మకాయ 1
 ఉప్పు తగినంత
 నెయ్యి 5  స్పూన్
 మినపప్పు 1 స్పూన్
 జీలకర్ర 1/2  స్పూన్
 జీడిపప్పు 10    
  తయారుచేయువిధానం
  కొబ్బరి,అల్లం,పచ్చిమిర్చి కలిపి మిక్సిలో మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి కరిగించి మినపప్పు,జీలకర్ర,జీడిపప్పు వేయించి కొబ్బరి కలిపి ఉప్పు,నిమ్మరసం వేసికలిపిచివరగా  అన్నం వేసి బాగా కలిపి 2నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి 

27, జులై 2012, శుక్రవారం

వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు విందు పసందు మహిళ లందరికి 

26, జులై 2012, గురువారం

                                                                                   బేసన్ దోస 
కావలసినవి 
  సెనగపిండి 1కప్
 బొంబాయి రవ్వ 2స్పూన్స్
  బియ్యం పిండి 2 స్పూన్స్
వాము 1/4 స్పూన్
 పెరుగు  1/4 కప్
 అల్లం చిన్నముక్క
  పచ్చిమిర్చి 4
 ఉల్లికాడలు 4
కొత్తిమీర 1 కట్ట
 ఉప్పు సరిపడా
 నూనె సరిపడా
  తయారుచేయువిధానం 
  ఓబౌల్ తీసుకుని ,సెనగపిండి,బొంబాయి రవ్వ ,బియ్యం పిండి,పెరుగు,వాము ,ఉప్పు తీసుకుని తగినన్ని నీరు పోసి ఉండలు కట్టకుండా దోస పిండిలా కలుపుకోవాలి ఇందులో అల్లం,పచ్చిమిర్చి ,ఉల్లికాడలు,కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని పిండిలో కలుపుకోవాలి .స్టవ్ మీద పెనం పెట్టి దోసలు వేసుకోవాలి ఇవి కొంచెం మందం గానే వస్తాయి ఇవి టమాటా సాస్ తో వేడి,వేడి వేడిగా బాగుంటై 
                                                                         దాల్ దోస 
కావలసినవి 
  మినపప్పు 1కప్
 సెనగపప్పు 1కప్
 పెసరపప్పు 1కప్
 అల్లంముక్క చిన్నది
 పచ్చిమిరపకాయలు 4  
 ఉప్పు సరిపడా
  జీలకర్ర 1 స్పూన్
  నూనె సరిపడా
  తయారుచేయువిధానం
 మూడు పప్పులు 2,,,3 గంటల ముందు నానపెట్టుకోవాలి  నానిన తరువాత మిక్సిలో వేసి పచ్చిమిర్చి ,అల్లం,ఉప్పు,జీలకర్ర చేర్చి తగినన్ని నీరు పోసి దోస పిండి గ్రైండ్ చేసుకోవాలి .స్టవ్ మీద పెనం పెట్టి దోస వేసుకోవటమే ఇవి చాలా టేస్టీ గ ఉంటాయి 

21, జులై 2012, శనివారం

                                                                   సెట్ దోస 
కావలసినవి 
 అటుకులు 1 కప్
 బియ్యం 1 కప్
 కొబ్బరి 1 కప్
 ఉప్పు తగినంత
 నూనె తగినంత
  తయారుచేయువిధానం
 అటుకులు,బియ్యం.,కొబ్బరి 2 గంటలు నాన పెట్టి తరువాత గ్రైండ్ చెయ్యాలి ఈపిండిని  8 గంటలు మారినేట్  చెయ్యాలి పెనం వేడి చేసి  దోస మందంగా వెయ్యాలి ఇది కొబ్బరి చట్ని తో బాగుంటుంది
 చట్ని తయ్యారుచేయువిధానం   కొబ్బరి తురుముకుని పుట్నాలపప్పు..,పచ్చి మిర్చి ఉప్పు చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ,.ఎండుమిర్చి,మినపప్పు,ఆవాలు,జీలకర్ర పోపు వేయించి కలుపుకోవాలి 
                                                                    శాండ్ విచ్  దోస 
కావలసినవి
 మినపప్పు.,బియ్యం కలిపి రుబ్బిన దోస పిండి
 బ్రెడ్  4 స్లైసెస్
 టమోటో  1
ఉల్లిపాయ 1
  కీర దోసకాయ 1
నిమ్మరసం 1స్పూన్
 కారం 1 స్పూన్
 ఉప్పు తగినంత
 నూనె తగినంత
 తయారుచేయువిధానం   బ్రెడ్ వేయించుకుని ఉప్పు.కారం చల్లి పక్కన పెట్టాలి .ఉల్లిపాయ..టమోటా,కీర సన్నగా కట్ చేసుకోవాలి ఈముక్కలు బ్రెడ్ మద్యలో పెట్టి పైన ఇంకో బ్రెడ్ పెట్టి శాండ్ విచ్ లా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దోస వేయించుకుని మద్యలో కట్ చేసి శాండ్ విచ్ దోసలో పెట్టి పైన చీజ్ తురుము వేసుకోవాలి
దీనిని రెడ్ చట్ని కాని గ్రీన్ చట్ని కాని తింటే బాగుంటుంది
రెడ్ చట్ని తయారుచేయువిధానం 2ఉల్లిపాయలు ,5 ఎండుమిరపకాయలు 1స్పూన్ జీలకర్ర ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే రెడ్ చట్ని రెడి

గ్రీన్ చట్ని తయారుచేయువిధానం పుదీనా 1కట్ట 1స్పూన్ పుట్నాలపప్పు,4పచ్చిమిర్చి 1స్పూన్ ధనియాలు 1స్పూన్ జీలకర్ర ఉప్పు తగినంత అన్ని వేయించుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రీన్ చట్ని రెడి 
                                                                  కలర్ ఫుల్ దో 
కావలసినవి  
 మినపప్పు,బియ్యం కలిపి రుబ్బిన దోస పిండి 
 గరం మస ల 1/2  స్పూన్ 
చీజ్ 2 స్పూన్స్ 
 పాలకూర పేస్ట్ 2 స్పూన్స్ 
 కాజు పేస్ట్  2  స్పూన్స్  
పనీర్  తరుగు 2 స్పూన్స్ 
 ఆలుగడ్డలు 2  
మిరియాలపొడి చిటికెడు  
 పాలు 4 స్పూన్స్ 
 తయారుచేయువిధానం   దోస పిండిలో గరం మసాల కలిపి స్టవ్ మీద పెనం పెట్టి దోస వేసుకోవాలి .ఆలుగడ్డ ఉడకపెట్టి మిరియాలపొడి కలిపి పక్కన ఉంచాలి స్టవ్ మీద బాణలి పెట్టి 1స్పూన్ నూనె వేసి పాలకూర వేయించాలి దానిని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .కాజు కూడా వేయించి పాలు కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .దోసమీద ఒక పక్క పాలకూర మిశ్రమం ,ఒక పక్క కాజు మిశ్రమం మద్యలో ఆలు మిశ్రమం గార్నిస్ చేసుకుంటే కలర్ ఫుల్ దోస రెడి దీనిలో కొబ్బరి చట్ని కాని అల్లం చట్ని కాని బాగుంటుంది 
                                                         స్ప్రింగ్ దోస 
కావలసినవి
 మినపప్పు,బియ్యం కలిపి రుబ్బిన దోస పిండి
 కేరట్  1
బీన్స్ 10
 ఆలుగడ్డ  1
 జీలకర్ర పొడి 1స్పూన్
    ఉప్పు తగినంత
నూనె దోస వేయించడానికి సరిపడా
  తయారుచేయువిధానం   కూరగాయలన్నీ సన్నని ముక్కలుగా కట్ చేసుకుని  స్టవ్ మీద బాణలి పెట్టి 2స్పూన్స్ నూనె వేసి ఈకూరముక్కలు వేయించాలి ఉప్పు,జీలకర్రపొడి వేసికలిపి స్టవ్ పై  నుంచి దింపి  పెనం పెట్టి వేడి అయ్యాక పల్చగా దోస పిండి దోస వేసుకుని దోస వేగాక మద్యలో కూర పెట్టి రోల్ చేసుకోవాలి దానిని డైమెండ్ ఆకారంలో కట్ చేసుకుంటే స్ప్రింగ్ దోస రెడీ  వీటిని నూడుల్స్ట్ తో కలిపి పుదీనా చట్ని కాని సాస్ తో కాని కలిపి తింటే బాగుంటుంది 

18, జులై 2012, బుధవారం

                                                                  చిలకడ దుంప స్నాక్ 


కావలసినవి
 చిలకడ దుంప 1
 ఆలివ్ ఆయిల్  1స్పూన్
  ఉప్పు తగినంత
 మిరియాలపొడి  1/2 స్పూన్
  తయారుచేయువిధానం  ఒక డిష్ లో ఉప్పు,మిరియాలపొడి,ఆలివ్ నూనె వేసి దానిలో చిలకడ దుంప ముక్కలు వేసి బాగా కలిసేలా కలపాలి ఓవెన్ లో 350 డిగ్రీల వేడిమీద 40 నిమిషాలు ఉంచి తీసేయ్యాలి 
                                                                    చిలగడదుంప బజ్జి 


కావలసినవి
 చిలగడదుంప పెద్దది 1
సెనగ పిండి 1 కప్
బియ్యం పిండి 1/4 కప్
 కారం 1 స్పూన్
 వామ్ పొడి 1/4 స్పూన్
వంటసోడా చిటికెడు
 ఉప్పు తగినంత
నూనె వేయించడానికి సరిపడా
  తయారుచేయువిధానం    ఒక గిన్నెలో సెనగ పిండి .,బియ్యంపిండి .,కారం,ఉప్పు,వాము పొడి తగినన్ని నీరు పోసి బజ్జి పిండి కలపాలి .చిలకడ దుంప  పీలర్ తో తొక్క తీసి   చక్రాలుగా కట్ చేసి పిండిలో ముంచి నూనె లో వేయించాలి 
                                                          పాల్ పిడి 
కావలసినవి
 బియ్యం పిండి 1కప్
కొబ్బరి పాలు 2 కప్
  ఉప్పు చిటికెడు
 పంచదార 1/4 కప్
 ఏలకులపొడి 1/2 స్పూన్
 తయారుచేయువిధానం  బియ్యం పిండి  వేయించు కుని  అర కప్ కొబ్బరిపాలు .,ఉప్పు కలిపి వేడి నీరు పోస్తూ ముద్దలా కలపాలి పది నిమిషాలు పక్కనుంచి తరువాత చిన్న,చిన్న ఉండలు చేసుకోవాలి ,వెడల్పాటి డిష్ తీసుకుని           మిగిలిన కొబ్బరిపాలు పోసి వేడి చెయ్యాలి మరుగు తున్నప్పుడు పంచదార.,ఏలకులపొడి వేసి మంట తగ్గించాలి ఇప్పుడు బియ్యం పిండి ఉండలువిడి,.విడిగా  వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి వీటిని వేడిగా తిన్నా ,.చల్లగా తిన్నా బాగుంటాయి 
                                                                  పాల అప్పం 
కావలసినవి  
 బియ్యం  2 కప్
అన్నం  1 కప్
వంట సోడా
 చిటికెడు
 పంచదార  2 స్పూన్స్
 కొబ్బరి పాలు 1/2 కప్
ఉప్పు తగినంత
  తయారుచేయువిధానం   బియ్యం 6 గంటల ముందు నానపెట్టాలి నానేక నీరు తీసేసి కొంచెం అరపెట్టాలి .మిక్సిలో వేసి మెత్తగా పిండి చెయ్యాలి అందులోనే అన్నం ,ఉప్పు,పంచదార వేసి కలిపి 1రోజంతాఉంచాలి తరువాత కొబ్బరి పాలు చేర్చి దోస పిండిలా కలిపి స్టవ్ మీద పెనం పెట్టి అప్పం లా పోసి కాల్చుకోవాలి   

30, జూన్ 2012, శనివారం

                                                                 దొండకాయ గుత్తికూర 
కావలసినవి
 దొండకాయలు పావుకిలో
 ఉల్లిపాయలు 2
పచ్చిమిరపకాయలు  3
అల్లం,వెల్లుల్లి ముద్ద 1 స్పూన్
కరివేపాకు 1 రెమ్మ
 గరంమసాల 1/2 స్పూన్
 ధనియాలపొడి 1స్పూన్
నువ్యులపొడి 2 స్పూన్స్
 పసుపు చిటికెడు
 చింతపండు కొద్దిగా
కారం 1స్పూన్
 ఉప్పు తగినంత
 నూనె సరిపడా
 తయారుచేయువిధానం   ముందుగా ఉల్లిపాయముక్కలు,అల్లం,వెల్లుల్లి ముద్దా,గరం మసాల ,ధనియాలపొడి ,నువ్యులపొడి,పసుపు,ఉప్పు,కారంమిక్సిలో  వేసి ముద్దచేసిపెట్టుకోవాలి .
ఇప్పుడు దొండకాయ కడిగి గుత్తిగా కోసి పెట్టుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి దొండకాయలు వేసి కొంచెం మగ్గేక మసాల ముద్దా వేసి చింతపండు గుజ్జు వేసి పది నిమిషాలు సన్నని మంటపై వేయించుకోవాలి 
                                గుత్తిబెండకాయ 


కావలసినవి
 బెండకాయలు పావుకిలో
 పల్లీలు 1కప్
 ఎండుమిరపకాయలు 4
 జీలకర్ర 1 స్పూన్
 వెల్లుల్లి రేకలు 4
 కరివేపాకు 2 రెమ్మలు
 ఉల్లిపాయ 1
 పచ్చిమిరపకాయలు 2
  కారం 1 స్పూన్
 పసుపు చిటికెడు
 ధనియాలపొడి 1 స్పూన్
 ఉప్పు తగినంత
 నూనె 2 స్పూన్స్    తయారుచేయువిధానం ముందుగా పల్లీలు వేయించుకోవాలి అందులోనే ఎండుమిరపకాయలు,ధనియాలు ,జీలకర్ర,ఉప్పు,వేయించి చల్లారేక పోడిచేసిపెట్టుకోవాలి .ఇప్పుడు బెండకాయలు కడిగి చివరలు కట్ చేసుకుని మద్యలో చీరి పొడి కూరి పెట్టుకోవాలి  .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కలు,కరివేపాకు,పచ్చిమిర్చి వేగాక కారం,పసుపు వేసి పోడికూరిపెట్టుకున్న బెండకాయలు వేసి సన్నని మంటపై వేయించుకోవాలి 

29, జూన్ 2012, శుక్రవారం

కుక్కీస్
 కావలసినవి
 మైదా 200 గ్రా
వెన్న 100గ్రా
పంచదార 50 గ్రా
 బాదం కొద్దిగా
 తయారుచేయువిధానం ఒక బౌల్ లో వెన్న,పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి మైదాకూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్రిజు లో అరగంట పెట్టాలి
ఫ్రిజ్జు లో నుంచి తీసాక చపాతి పీట మీద వత్తుకుని మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకుని వీటి మీద బాదం అలంకరించి నెయ్యి రాసిన బేకింగ్ ట్రే లో అమర్చి 10 నిమిషాలు బేక్  చెయ్యాలి 
డోనట్స్
  కావలసినవి
 మైదా పావుకిలో
 పంచదార  1కప్
 పాలు 1/2  కప్
  వెన్న 1 స్పూన్
  ఉప్పు  1 స్పూన్
 వంట  సోడా చిటికెడు
 బేకింగ్ పౌడర్  పావు స్పూన్
 జాజికాయపొడి చిటికెడు
 దాల్చినచేక్కపొడి పావు స్పూన్
కోడి గుడ్డు 1
  నెయ్యి కాని నూనె కాని వేయించడానికి సరిపడా  తయారుచేయువిధానం  ఒక బౌల్ లో మైదా తీసుకుని వంటసోడా, బేకింగ్ పౌడర్,జాజికాయపొడి,దాల్చినచేక్కపొడి,వెన్న,ఉప్పు,వేసికలపాలి తరువాత పంచదార,గుడ్డుసొన ,పాలు చేర్చి స్పూన్తో బాగా కలిపి అరగంట అయ్యాక చాపాతిపీటమీద  అంగుళం మందముగా వత్తుకుని డోనట్స్ లా కట్ చేసుకుని వేయించుకోవాలి 

29, మార్చి 2012, గురువారం

మలబారి కర్రి

మలబారి కర్రి కావలసినవి
 ఫ్రెంచ్ బీన్స్ ,,10
కేరట్  4
 బంగాళా దుంపలు  4
కాలిఫ్లవర్  చిన్నపువ్యు
 బఠానీలు కప్
 టమోటాలు 4
కరివేపాకు కట్ట
పసుపు చిటికెడు
 నిమ్మరసం  3 స్పూన్స్
పేస్ట్ కోసం  కావలసినవి  కొబ్బరికాయ  1
 బియ్యం 1 స్పూన్
 పచ్చిమిర్చి 2
 ఇంగువ చిటికెడు
  దాల్చినచెక్క ముక్క
 లవంగాలు 3
మిరియాలు  4
ఎండుమిర్చి  3
    తయారుచేయువిధానం       కాయగూరాలన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి  , కొబ్బరి తురుముకుని నీరు కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి బియ్యం,పచ్చిమిర్చి,ఇంగువ,దాల్చిన ముక్క,లవంగాలు,మిరియాలు,ఎండుమిర్చి వేయించి మెత్తగా రుబ్బుకోవాలి .స్టవ్ మీద పేన్ పెట్టి నూనెవేసి కొబ్బరి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించి కూరముక్కలు వేసి కొంచెం ఉడికేక టమాటాముక్కలు,మసాల పేస్ట్ వేసి కూర బాగా ఉడికేక ఉప్పు,పసుపు,నిమ్మరసం కలిపితే కూర రెడి ఇది అన్నం లో చాల రుచిగా ఉంటుంది 

మెంతి దాల్



మెంతి దాల్  కావలసినవి
 మెంతి ఆకులూ 2 కట్టలు
కొత్తిమీర 1 కట్ట
 వెల్లుల్లి  3 రెబ్బలు
 కందిపప్పు 2 కప్
  నూనె 2 స్పూన్స్
  టమోటాలు 3      
  జేలకర్ర 1 స్పూన్  
  పచ్చిమిర్చి 3    
ఉప్పు తగినంత  
 తయారు చేయువిధానం కందిపప్పుకుక్కర్ లో  మెత్తగా ఉడ్కించి ఉప్పు కలిపి పక్కన పెట్టాలి మెంతియాకు,కొత్తిమీర,టమోటా సన్నగా కట్ చేసుకోవాలి /. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేడిచేసి వెల్లుల్లి,పచ్చిమిర్చి ,మెంతి ఆకూ ,టమోటా ముక్కలు వేసి బాగా ఉడికేక పప్పు వేసి బాగా కలిపి సన్నని సెగపై పది నిమిషాలు ఉంచి దించెయ్యాలి         

23, మార్చి 2012, శుక్రవారం

ఉగాది పచ్చడికి కావలసినవి వేపపవ్యు,మామిడికాయ,చేరకుముక్క ,అరటిపండు,బెల్లం,ఉప్పు,కారం   తయారుచేయువిధానం చింతపండు నాన పెట్టి గుజ్జులో ఉప్పు,కారం,బెల్లం కలిపి వేప పువ్యు కలిపి మామిడికాయ,చెరకు ముక్క,అరటిపండు చిన్న ముక్కలు కట్ చేసుకుని కలిపితే ఉగాది పచ్చడి రెడి నైవేద్యం పెట్టి ఉదయమే తింటారు

22, మార్చి 2012, గురువారం

అందరికి శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు  విందు-పసందు మీకు ఉపయోగ పడుతుందని ఆశిస్తూ               

15, ఫిబ్రవరి 2012, బుధవారం

క్యాబెజి కొఫ్తా

కావలసినవి:-
క్యాబెజి:1 చిన్నది.
అల్లం
శెనగ పిండి:2 స్పూన్స్
టమాట:6

తయారుచేయుట:-
క్యాబెజిని కోరుకొని దానిలొ కొంచెం కాచిన నూనె,శెనగపిండి,అల్లం కొంచెం కొరి కలిపి చిన్న వుండలుగా చేసుకోని అ వుండలు ని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.తరువాత గ్రేవి కోసం టమాటలు ఉడికించి దాన్ని మిక్షి చేసి ఆ గ్రేవి ని అల్లం కోరి వేయించిన దానిలో కలిపి ఉప్పు,కారం,ధనియాల పొడి వేసి కొంచెం సేపు ఉడికిన తరువాత వేయించిన వుండలు వేసి కలిపి 5 నిమిషాలు తగ్గించి ఉంచి ఆపివేస్తే క్యాబెజి కొఫ్తా రేడి.

ఈ కొఫ్తా చపాతిలో కి బిర్యాని లో కి బావుంటుంది.

చిట్కా

అల్లం తినటం ఆరొగ్యంకి మంచిది అని చెపుటారు అందుకు అల్లం ముక్కలుగా తినలేని వాళ్ళకి ఈ చిట్కా.
అల్లం కొరి ఆ ముద్దని పొపుతో పాటు వేపితే బావుంటుంది.

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

కాలిఫ్లవర్ పచ్చడి.


కాలిఫ్లవర్ 1
చింతపండు 150 గ్రా.
ఉప్పు చిన్న గ్లాసులో 3 వంతులు
కారం పావు కిలో
ఆవ పిండి 3స్పూన్స్ లు
మెంతి పిండి 4 స్పూన్స్ లు
నూనె అర కేజి
నిమ్మ కాయలు 3
కాలిఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని శుభ్రంగా కడిగి తడిపొయే వరకు ఆరపెట్టు కోవాలి.నీళ్ళు కాచి చింతపండు నీళ్ళలో వెయ్యలి. తరువాత చింతపండు మిక్స్షి లో మెత్తగా అయ్యెవరకు వేయ్యలి. తరువాత బేసిన్ లో కాలిఫ్లవర్ ముక్కలు,చింతపండు ముద్ద,ఉప్పు,కారం,మెంతి పిండి,ఆవపిండి నూనె పోసి కలపాలి.కొంచెం ఆవాలు జీలకర్ర,ఎండుమెరపకాయలు పొపు కలపాలి.నిమ్మ కాయలు రసం పిండి బాగ కలిపితే పచ్చడి రేడి.
తినే వారు వెళ్ళుళ్ళిపాయలు ఇంగువ వేసుకొవచ్చు.
చింతపండులో నీళ్ళు ఉంటే చింతపండు రుబ్బేటప్పుడు దానిలొ కలపచ్చు.

స్టఫ్డ్ పొటాటో

కావలసినవి
గొధుమపిండి:-1/4 కిలో
బంగాళదుంప:-1/4 కిలో
పచ్చిమిర్చి సన్నని ముక్కలు:1/4 కప్పు.
కారం:1 చెంచా.
ఉల్లి ముక్కలు:-1 1/2 కప్పులు
కర్వేపాకు:-4 రెబ్బలు.
నూనె:సరిపడ.
కొత్తిమీర:1/2 కప్పు తరిగినది.
పసుపు,ఉప్పు:సరిపడ.

తయారు:-
1)బంగాళదుంపలని మెత్తగా ఉడకబెట్టి చెక్కు తీసి మెదిపి దానికి ఉప్పు,కొత్తిమీర తరుగు,కారం,పసుపు వేసి కలిపి ఉంచాలి.దీనికి ముందే గొధుమపిండికి తగినంత నీరు,ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి ఉంచాలి.
2)బాండీలో నాలుగు చెంచాల నూనె వేసి అందులో ఉల్లి,మిర్చిముక్కలు వేసి వేపాలి.
3)వేగిన తర్వాత స్టౌ మీద నుంచి దింపి బంగాళదుంప మిశ్రమాన్ని కలపాలి.
4)మొత్తం కలిసిన తర్వాత చల్లారనిచ్చి నిమ్మకాయంత ఉండలు తేసుకొని పూరీ సైజులో వత్తుకోవాలి.
5)దీని మధ్య బంగాళదుంప ఉండని పెట్టి చుట్టురా మడిచి మళ్ళీ పూరీలా వత్తాలి.
6)పెనం వేడి చేసి చపాతీని వేసి నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేయాలి.

చిక్కుడు కాయ పచ్చడి


కావలసినవి:

చిక్కుడు కాయలు:1/4 కి.లో
కారం: 1గ్లాసు
నూనె:చిన్న గ్లాసుడు.
ఉప్పు:గ్లాసులో సగం
చింతపండు:100 గ్రా.
మెంతిపొడి:2 స్పూన్ లు.

చిక్కుడు కాయలు కడిగి ముక్కలు చేసుకొవాలి.1 గ్లాసు నీళ్ళు కాచి దాని లో చింతపండు వేసి ఉంచాలి చల్లారాక మిక్షిలో వేయ్యాలి. మూకుడు లో నూనె వేసి చిక్కుడు కాయ ముక్కలు వేసి వేయించాలి. ముక్కలు వేగాక స్తవ్ ఆపి దానిలో కారం,ఉప్పు,మెంతిపొడి,చింతపండు ముద్ద వేసి బాగ కలుపు కోవాలి.దానిలో పొపు పెట్టుకొవాలి.

14, జనవరి 2012, శనివారం

అందరికి విందు-పసందులో సంక్రాంతి శుభాకాంక్షలు 

12, జనవరి 2012, గురువారం

హాయ్!!!

నా బ్లాగ్ చూసే వారందరికి ,ఒక చిన్న విజ్ఞప్తి.
బ్లాగ్ చూసి ఏదైనా వంటని లేక ఏదైనా చిట్కా  ప్రయత్నించిన వారు,మాకు తెలియజేయండి.

మీ,
సుశీల 

1, జనవరి 2012, ఆదివారం

నూతన సంవత్శర  శుభాకాంక్షలు అందరు ఆనందముగా,సంతోషంగా ఉండాలని కోరుకుంటూ [ happy new year ]
                  

                                           suseela kandikonda