15, ఫిబ్రవరి 2012, బుధవారం

క్యాబెజి కొఫ్తా

కావలసినవి:-
క్యాబెజి:1 చిన్నది.
అల్లం
శెనగ పిండి:2 స్పూన్స్
టమాట:6

తయారుచేయుట:-
క్యాబెజిని కోరుకొని దానిలొ కొంచెం కాచిన నూనె,శెనగపిండి,అల్లం కొంచెం కొరి కలిపి చిన్న వుండలుగా చేసుకోని అ వుండలు ని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.తరువాత గ్రేవి కోసం టమాటలు ఉడికించి దాన్ని మిక్షి చేసి ఆ గ్రేవి ని అల్లం కోరి వేయించిన దానిలో కలిపి ఉప్పు,కారం,ధనియాల పొడి వేసి కొంచెం సేపు ఉడికిన తరువాత వేయించిన వుండలు వేసి కలిపి 5 నిమిషాలు తగ్గించి ఉంచి ఆపివేస్తే క్యాబెజి కొఫ్తా రేడి.

ఈ కొఫ్తా చపాతిలో కి బిర్యాని లో కి బావుంటుంది.

చిట్కా

అల్లం తినటం ఆరొగ్యంకి మంచిది అని చెపుటారు అందుకు అల్లం ముక్కలుగా తినలేని వాళ్ళకి ఈ చిట్కా.
అల్లం కొరి ఆ ముద్దని పొపుతో పాటు వేపితే బావుంటుంది.

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

కాలిఫ్లవర్ పచ్చడి.


కాలిఫ్లవర్ 1
చింతపండు 150 గ్రా.
ఉప్పు చిన్న గ్లాసులో 3 వంతులు
కారం పావు కిలో
ఆవ పిండి 3స్పూన్స్ లు
మెంతి పిండి 4 స్పూన్స్ లు
నూనె అర కేజి
నిమ్మ కాయలు 3
కాలిఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని శుభ్రంగా కడిగి తడిపొయే వరకు ఆరపెట్టు కోవాలి.నీళ్ళు కాచి చింతపండు నీళ్ళలో వెయ్యలి. తరువాత చింతపండు మిక్స్షి లో మెత్తగా అయ్యెవరకు వేయ్యలి. తరువాత బేసిన్ లో కాలిఫ్లవర్ ముక్కలు,చింతపండు ముద్ద,ఉప్పు,కారం,మెంతి పిండి,ఆవపిండి నూనె పోసి కలపాలి.కొంచెం ఆవాలు జీలకర్ర,ఎండుమెరపకాయలు పొపు కలపాలి.నిమ్మ కాయలు రసం పిండి బాగ కలిపితే పచ్చడి రేడి.
తినే వారు వెళ్ళుళ్ళిపాయలు ఇంగువ వేసుకొవచ్చు.
చింతపండులో నీళ్ళు ఉంటే చింతపండు రుబ్బేటప్పుడు దానిలొ కలపచ్చు.

స్టఫ్డ్ పొటాటో

కావలసినవి
గొధుమపిండి:-1/4 కిలో
బంగాళదుంప:-1/4 కిలో
పచ్చిమిర్చి సన్నని ముక్కలు:1/4 కప్పు.
కారం:1 చెంచా.
ఉల్లి ముక్కలు:-1 1/2 కప్పులు
కర్వేపాకు:-4 రెబ్బలు.
నూనె:సరిపడ.
కొత్తిమీర:1/2 కప్పు తరిగినది.
పసుపు,ఉప్పు:సరిపడ.

తయారు:-
1)బంగాళదుంపలని మెత్తగా ఉడకబెట్టి చెక్కు తీసి మెదిపి దానికి ఉప్పు,కొత్తిమీర తరుగు,కారం,పసుపు వేసి కలిపి ఉంచాలి.దీనికి ముందే గొధుమపిండికి తగినంత నీరు,ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి ఉంచాలి.
2)బాండీలో నాలుగు చెంచాల నూనె వేసి అందులో ఉల్లి,మిర్చిముక్కలు వేసి వేపాలి.
3)వేగిన తర్వాత స్టౌ మీద నుంచి దింపి బంగాళదుంప మిశ్రమాన్ని కలపాలి.
4)మొత్తం కలిసిన తర్వాత చల్లారనిచ్చి నిమ్మకాయంత ఉండలు తేసుకొని పూరీ సైజులో వత్తుకోవాలి.
5)దీని మధ్య బంగాళదుంప ఉండని పెట్టి చుట్టురా మడిచి మళ్ళీ పూరీలా వత్తాలి.
6)పెనం వేడి చేసి చపాతీని వేసి నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేయాలి.

చిక్కుడు కాయ పచ్చడి


కావలసినవి:

చిక్కుడు కాయలు:1/4 కి.లో
కారం: 1గ్లాసు
నూనె:చిన్న గ్లాసుడు.
ఉప్పు:గ్లాసులో సగం
చింతపండు:100 గ్రా.
మెంతిపొడి:2 స్పూన్ లు.

చిక్కుడు కాయలు కడిగి ముక్కలు చేసుకొవాలి.1 గ్లాసు నీళ్ళు కాచి దాని లో చింతపండు వేసి ఉంచాలి చల్లారాక మిక్షిలో వేయ్యాలి. మూకుడు లో నూనె వేసి చిక్కుడు కాయ ముక్కలు వేసి వేయించాలి. ముక్కలు వేగాక స్తవ్ ఆపి దానిలో కారం,ఉప్పు,మెంతిపొడి,చింతపండు ముద్ద వేసి బాగ కలుపు కోవాలి.దానిలో పొపు పెట్టుకొవాలి.