29, మార్చి 2012, గురువారం

మలబారి కర్రి

మలబారి కర్రి కావలసినవి
 ఫ్రెంచ్ బీన్స్ ,,10
కేరట్  4
 బంగాళా దుంపలు  4
కాలిఫ్లవర్  చిన్నపువ్యు
 బఠానీలు కప్
 టమోటాలు 4
కరివేపాకు కట్ట
పసుపు చిటికెడు
 నిమ్మరసం  3 స్పూన్స్
పేస్ట్ కోసం  కావలసినవి  కొబ్బరికాయ  1
 బియ్యం 1 స్పూన్
 పచ్చిమిర్చి 2
 ఇంగువ చిటికెడు
  దాల్చినచెక్క ముక్క
 లవంగాలు 3
మిరియాలు  4
ఎండుమిర్చి  3
    తయారుచేయువిధానం       కాయగూరాలన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి  , కొబ్బరి తురుముకుని నీరు కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి బియ్యం,పచ్చిమిర్చి,ఇంగువ,దాల్చిన ముక్క,లవంగాలు,మిరియాలు,ఎండుమిర్చి వేయించి మెత్తగా రుబ్బుకోవాలి .స్టవ్ మీద పేన్ పెట్టి నూనెవేసి కొబ్బరి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించి కూరముక్కలు వేసి కొంచెం ఉడికేక టమాటాముక్కలు,మసాల పేస్ట్ వేసి కూర బాగా ఉడికేక ఉప్పు,పసుపు,నిమ్మరసం కలిపితే కూర రెడి ఇది అన్నం లో చాల రుచిగా ఉంటుంది 

మెంతి దాల్



మెంతి దాల్  కావలసినవి
 మెంతి ఆకులూ 2 కట్టలు
కొత్తిమీర 1 కట్ట
 వెల్లుల్లి  3 రెబ్బలు
 కందిపప్పు 2 కప్
  నూనె 2 స్పూన్స్
  టమోటాలు 3      
  జేలకర్ర 1 స్పూన్  
  పచ్చిమిర్చి 3    
ఉప్పు తగినంత  
 తయారు చేయువిధానం కందిపప్పుకుక్కర్ లో  మెత్తగా ఉడ్కించి ఉప్పు కలిపి పక్కన పెట్టాలి మెంతియాకు,కొత్తిమీర,టమోటా సన్నగా కట్ చేసుకోవాలి /. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేడిచేసి వెల్లుల్లి,పచ్చిమిర్చి ,మెంతి ఆకూ ,టమోటా ముక్కలు వేసి బాగా ఉడికేక పప్పు వేసి బాగా కలిపి సన్నని సెగపై పది నిమిషాలు ఉంచి దించెయ్యాలి         

23, మార్చి 2012, శుక్రవారం

ఉగాది పచ్చడికి కావలసినవి వేపపవ్యు,మామిడికాయ,చేరకుముక్క ,అరటిపండు,బెల్లం,ఉప్పు,కారం   తయారుచేయువిధానం చింతపండు నాన పెట్టి గుజ్జులో ఉప్పు,కారం,బెల్లం కలిపి వేప పువ్యు కలిపి మామిడికాయ,చెరకు ముక్క,అరటిపండు చిన్న ముక్కలు కట్ చేసుకుని కలిపితే ఉగాది పచ్చడి రెడి నైవేద్యం పెట్టి ఉదయమే తింటారు

22, మార్చి 2012, గురువారం

అందరికి శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు  విందు-పసందు మీకు ఉపయోగ పడుతుందని ఆశిస్తూ