27, జులై 2012, శుక్రవారం

వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు విందు పసందు మహిళ లందరికి 

26, జులై 2012, గురువారం

                                                                                   బేసన్ దోస 
కావలసినవి 
  సెనగపిండి 1కప్
 బొంబాయి రవ్వ 2స్పూన్స్
  బియ్యం పిండి 2 స్పూన్స్
వాము 1/4 స్పూన్
 పెరుగు  1/4 కప్
 అల్లం చిన్నముక్క
  పచ్చిమిర్చి 4
 ఉల్లికాడలు 4
కొత్తిమీర 1 కట్ట
 ఉప్పు సరిపడా
 నూనె సరిపడా
  తయారుచేయువిధానం 
  ఓబౌల్ తీసుకుని ,సెనగపిండి,బొంబాయి రవ్వ ,బియ్యం పిండి,పెరుగు,వాము ,ఉప్పు తీసుకుని తగినన్ని నీరు పోసి ఉండలు కట్టకుండా దోస పిండిలా కలుపుకోవాలి ఇందులో అల్లం,పచ్చిమిర్చి ,ఉల్లికాడలు,కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని పిండిలో కలుపుకోవాలి .స్టవ్ మీద పెనం పెట్టి దోసలు వేసుకోవాలి ఇవి కొంచెం మందం గానే వస్తాయి ఇవి టమాటా సాస్ తో వేడి,వేడి వేడిగా బాగుంటై 
                                                                         దాల్ దోస 
కావలసినవి 
  మినపప్పు 1కప్
 సెనగపప్పు 1కప్
 పెసరపప్పు 1కప్
 అల్లంముక్క చిన్నది
 పచ్చిమిరపకాయలు 4  
 ఉప్పు సరిపడా
  జీలకర్ర 1 స్పూన్
  నూనె సరిపడా
  తయారుచేయువిధానం
 మూడు పప్పులు 2,,,3 గంటల ముందు నానపెట్టుకోవాలి  నానిన తరువాత మిక్సిలో వేసి పచ్చిమిర్చి ,అల్లం,ఉప్పు,జీలకర్ర చేర్చి తగినన్ని నీరు పోసి దోస పిండి గ్రైండ్ చేసుకోవాలి .స్టవ్ మీద పెనం పెట్టి దోస వేసుకోవటమే ఇవి చాలా టేస్టీ గ ఉంటాయి 

21, జులై 2012, శనివారం

                                                                   సెట్ దోస 
కావలసినవి 
 అటుకులు 1 కప్
 బియ్యం 1 కప్
 కొబ్బరి 1 కప్
 ఉప్పు తగినంత
 నూనె తగినంత
  తయారుచేయువిధానం
 అటుకులు,బియ్యం.,కొబ్బరి 2 గంటలు నాన పెట్టి తరువాత గ్రైండ్ చెయ్యాలి ఈపిండిని  8 గంటలు మారినేట్  చెయ్యాలి పెనం వేడి చేసి  దోస మందంగా వెయ్యాలి ఇది కొబ్బరి చట్ని తో బాగుంటుంది
 చట్ని తయ్యారుచేయువిధానం   కొబ్బరి తురుముకుని పుట్నాలపప్పు..,పచ్చి మిర్చి ఉప్పు చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ,.ఎండుమిర్చి,మినపప్పు,ఆవాలు,జీలకర్ర పోపు వేయించి కలుపుకోవాలి 
                                                                    శాండ్ విచ్  దోస 
కావలసినవి
 మినపప్పు.,బియ్యం కలిపి రుబ్బిన దోస పిండి
 బ్రెడ్  4 స్లైసెస్
 టమోటో  1
ఉల్లిపాయ 1
  కీర దోసకాయ 1
నిమ్మరసం 1స్పూన్
 కారం 1 స్పూన్
 ఉప్పు తగినంత
 నూనె తగినంత
 తయారుచేయువిధానం   బ్రెడ్ వేయించుకుని ఉప్పు.కారం చల్లి పక్కన పెట్టాలి .ఉల్లిపాయ..టమోటా,కీర సన్నగా కట్ చేసుకోవాలి ఈముక్కలు బ్రెడ్ మద్యలో పెట్టి పైన ఇంకో బ్రెడ్ పెట్టి శాండ్ విచ్ లా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దోస వేయించుకుని మద్యలో కట్ చేసి శాండ్ విచ్ దోసలో పెట్టి పైన చీజ్ తురుము వేసుకోవాలి
దీనిని రెడ్ చట్ని కాని గ్రీన్ చట్ని కాని తింటే బాగుంటుంది
రెడ్ చట్ని తయారుచేయువిధానం 2ఉల్లిపాయలు ,5 ఎండుమిరపకాయలు 1స్పూన్ జీలకర్ర ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే రెడ్ చట్ని రెడి

గ్రీన్ చట్ని తయారుచేయువిధానం పుదీనా 1కట్ట 1స్పూన్ పుట్నాలపప్పు,4పచ్చిమిర్చి 1స్పూన్ ధనియాలు 1స్పూన్ జీలకర్ర ఉప్పు తగినంత అన్ని వేయించుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రీన్ చట్ని రెడి 
                                                                  కలర్ ఫుల్ దో 
కావలసినవి  
 మినపప్పు,బియ్యం కలిపి రుబ్బిన దోస పిండి 
 గరం మస ల 1/2  స్పూన్ 
చీజ్ 2 స్పూన్స్ 
 పాలకూర పేస్ట్ 2 స్పూన్స్ 
 కాజు పేస్ట్  2  స్పూన్స్  
పనీర్  తరుగు 2 స్పూన్స్ 
 ఆలుగడ్డలు 2  
మిరియాలపొడి చిటికెడు  
 పాలు 4 స్పూన్స్ 
 తయారుచేయువిధానం   దోస పిండిలో గరం మసాల కలిపి స్టవ్ మీద పెనం పెట్టి దోస వేసుకోవాలి .ఆలుగడ్డ ఉడకపెట్టి మిరియాలపొడి కలిపి పక్కన ఉంచాలి స్టవ్ మీద బాణలి పెట్టి 1స్పూన్ నూనె వేసి పాలకూర వేయించాలి దానిని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .కాజు కూడా వేయించి పాలు కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .దోసమీద ఒక పక్క పాలకూర మిశ్రమం ,ఒక పక్క కాజు మిశ్రమం మద్యలో ఆలు మిశ్రమం గార్నిస్ చేసుకుంటే కలర్ ఫుల్ దోస రెడి దీనిలో కొబ్బరి చట్ని కాని అల్లం చట్ని కాని బాగుంటుంది 
                                                         స్ప్రింగ్ దోస 
కావలసినవి
 మినపప్పు,బియ్యం కలిపి రుబ్బిన దోస పిండి
 కేరట్  1
బీన్స్ 10
 ఆలుగడ్డ  1
 జీలకర్ర పొడి 1స్పూన్
    ఉప్పు తగినంత
నూనె దోస వేయించడానికి సరిపడా
  తయారుచేయువిధానం   కూరగాయలన్నీ సన్నని ముక్కలుగా కట్ చేసుకుని  స్టవ్ మీద బాణలి పెట్టి 2స్పూన్స్ నూనె వేసి ఈకూరముక్కలు వేయించాలి ఉప్పు,జీలకర్రపొడి వేసికలిపి స్టవ్ పై  నుంచి దింపి  పెనం పెట్టి వేడి అయ్యాక పల్చగా దోస పిండి దోస వేసుకుని దోస వేగాక మద్యలో కూర పెట్టి రోల్ చేసుకోవాలి దానిని డైమెండ్ ఆకారంలో కట్ చేసుకుంటే స్ప్రింగ్ దోస రెడీ  వీటిని నూడుల్స్ట్ తో కలిపి పుదీనా చట్ని కాని సాస్ తో కాని కలిపి తింటే బాగుంటుంది 

18, జులై 2012, బుధవారం

                                                                  చిలకడ దుంప స్నాక్ 


కావలసినవి
 చిలకడ దుంప 1
 ఆలివ్ ఆయిల్  1స్పూన్
  ఉప్పు తగినంత
 మిరియాలపొడి  1/2 స్పూన్
  తయారుచేయువిధానం  ఒక డిష్ లో ఉప్పు,మిరియాలపొడి,ఆలివ్ నూనె వేసి దానిలో చిలకడ దుంప ముక్కలు వేసి బాగా కలిసేలా కలపాలి ఓవెన్ లో 350 డిగ్రీల వేడిమీద 40 నిమిషాలు ఉంచి తీసేయ్యాలి 
                                                                    చిలగడదుంప బజ్జి 


కావలసినవి
 చిలగడదుంప పెద్దది 1
సెనగ పిండి 1 కప్
బియ్యం పిండి 1/4 కప్
 కారం 1 స్పూన్
 వామ్ పొడి 1/4 స్పూన్
వంటసోడా చిటికెడు
 ఉప్పు తగినంత
నూనె వేయించడానికి సరిపడా
  తయారుచేయువిధానం    ఒక గిన్నెలో సెనగ పిండి .,బియ్యంపిండి .,కారం,ఉప్పు,వాము పొడి తగినన్ని నీరు పోసి బజ్జి పిండి కలపాలి .చిలకడ దుంప  పీలర్ తో తొక్క తీసి   చక్రాలుగా కట్ చేసి పిండిలో ముంచి నూనె లో వేయించాలి 
                                                          పాల్ పిడి 
కావలసినవి
 బియ్యం పిండి 1కప్
కొబ్బరి పాలు 2 కప్
  ఉప్పు చిటికెడు
 పంచదార 1/4 కప్
 ఏలకులపొడి 1/2 స్పూన్
 తయారుచేయువిధానం  బియ్యం పిండి  వేయించు కుని  అర కప్ కొబ్బరిపాలు .,ఉప్పు కలిపి వేడి నీరు పోస్తూ ముద్దలా కలపాలి పది నిమిషాలు పక్కనుంచి తరువాత చిన్న,చిన్న ఉండలు చేసుకోవాలి ,వెడల్పాటి డిష్ తీసుకుని           మిగిలిన కొబ్బరిపాలు పోసి వేడి చెయ్యాలి మరుగు తున్నప్పుడు పంచదార.,ఏలకులపొడి వేసి మంట తగ్గించాలి ఇప్పుడు బియ్యం పిండి ఉండలువిడి,.విడిగా  వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి వీటిని వేడిగా తిన్నా ,.చల్లగా తిన్నా బాగుంటాయి 
                                                                  పాల అప్పం 
కావలసినవి  
 బియ్యం  2 కప్
అన్నం  1 కప్
వంట సోడా
 చిటికెడు
 పంచదార  2 స్పూన్స్
 కొబ్బరి పాలు 1/2 కప్
ఉప్పు తగినంత
  తయారుచేయువిధానం   బియ్యం 6 గంటల ముందు నానపెట్టాలి నానేక నీరు తీసేసి కొంచెం అరపెట్టాలి .మిక్సిలో వేసి మెత్తగా పిండి చెయ్యాలి అందులోనే అన్నం ,ఉప్పు,పంచదార వేసి కలిపి 1రోజంతాఉంచాలి తరువాత కొబ్బరి పాలు చేర్చి దోస పిండిలా కలిపి స్టవ్ మీద పెనం పెట్టి అప్పం లా పోసి కాల్చుకోవాలి