29, నవంబర్ 2012, గురువారం

కావలసినవి                                           సన్న కారప్పూస 
 సెనగపిండి 1 కప్
 కారం 1 స్పూన్
 ఉప్పు తగినంత
నూనె వేయించడానికి సరిపడా
 తయారుచేయువిధానం   శనగపిండి జల్లించుకునిఉప్పు,కారం వేసి  తగినన్ని నీరు పోసి మరీ గట్టిగా మరీ పలచగా  కాకుండా మెత్తగా కలుపుకుని మురుకుల గొట్టం[ చిన్న రంద్రాలు ]ఉన్నది తీసుకుని  అందులోనిమ్మకాయంత  పిండి పెట్టి నూనె  వేడి అయ్యాక  వేయించుకోవాలి ఇష్టమైన వాళ్ళు వాము పొడి వేసుకోవచ్చు 

27, నవంబర్ 2012, మంగళవారం

కావలసినవి                                                         మైసూర్ బొండా 
 సెనగపిండి  1 కప్
  ఉల్లిపాయ 1 
 కొత్తిమీర చిన్న కట్ట 
 పెరుగు పావు కప్
 మిరియాలు 10 
 అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ 
 కొబ్బరి చిన్నముక్క 
 ఉప్పు సరిపడా
 బేకింగ్ షోడ చిటికెడు  
  తయారుచేయువిధానం   కొబ్బరి చిన్నముక్కలు చెయ్యాలి ,మిరియాలు కచ్చా పచ్చా గా  చెయ్యాలి,ఉల్లిపాయ సన్నగా కట్ చెయ్యాలి 
 ఒక గిన్నెలో  శనగపిండి ,పెరుగు,అల్లం,వెల్లుల్లిపేస్ట్,కొత్తిమీర,కారం,,ఉప్పు, బేకింగ్ షోడ ,ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి ముక్కలు కలిపి పెట్టుకోవాలి  
 స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక  బొండాలు వేయించుకోవాలి 
కావలసినవి                                                         పన్నీరు మిర్చి బజ్జి 
 బజ్జిమిర్చి [లావు]  10   
 శనగపిండి  కప్ 
 వంట షోడ చిటికెడు 
 పన్నీరు ముక్కలు 50 గ్రామ్ 
 ఆలు 1 
 కారం 1 స్పూన్ 
 ఉప్పు సరిపడా 
 నూనె వేయించడానికి సరిపడా
  అల్లం చిన్న ముక్క   
  కొత్తిమీర చిన్న కట్ట  
  తయారుచేయువిధానం    పచ్చిమిర్చి మద్యలో చీల్చి పెట్టుకోవాలి  ఆలు ఉడికించి  ఆలు,పన్నీర్ మిక్సిలో  వేసి మెత్తగా చేసి అల్లం,కొత్తిమీర,ఉప్పుకూడా వేసి ముద్ద చేసిపెట్టుకోవాలి 
  ఈ ముద్దని మిరపకాయలులో  కూరి పెట్టాలి  
   ఒక బౌల్ తీసుకుని శనగపిండి, ఉప్పు, వంటసోడా ,కారం వేసి తగినన్ని నీరు పోసి బజ్జిపిండిలా కలపాలి 
 స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి పన్నీర్ కూరిన మిరపకాయలు శనగ పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీస్తే కర కర లాడే పన్నీర్ మిర్చి బజ్జి రెడి 
  కావలసినవి                                             నూడుల్స్  పకోడీ
 నూడుల్స్ 1/2  కిలో
 ఉల్లిపాయ 1
 పచ్చిమిర్చి 3
 అల్లం చిన్నముక్క
 కొత్తిమీరా చిన్నకట్ట
 సెనగపిండి  1/2 కప్
 బియ్యం 2 స్పూన్స్
 బేకింగ్ షోడా  చిటికెడు
 కారం 1స్పూన్
నూనె వేయించడానికి సరిపడా
  తయారుచేయువిధానం   నూడుల్స్ తగినన్ని నీరు చేర్చి ఉడికించి  వార్చి పక్కన పెట్టాలి     ఉల్లిపాయ,అల్లం,పచ్చిమిర్చి,కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి
  ఒక గిన్నె తీసుకుని  సెనగపిండి,బియ్యంపిండి,బేకింగ్ షోడ, ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కొత్తిమీర,అల్లం ముక్కలు వేసి నూడుల్స్ ,ఉప్పు,కారం వేసి తగినన్ని నీరు చేర్చి పకోడీ పిండి కలపాలి  
. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి పకోడీలు వేయించుకోవాలి 

12, నవంబర్ 2012, సోమవారం

అందరికి  దీపావళి శుభాకాంక్షలు [ తీపివంటలుతో ]
కావలసినవి                                         బాదం బర్ఫ్హి
  బాదం 1 కప్
 చక్కెర 1
నెయ్యి  2 స్పూన్స్
 
   తయారుచేయువిధానం  2. 3 గంటలముండు  బాదం  నానపెట్టి  పైన తొక్క తీయ్యాలి  పప్పుని మిక్సిలో వేసి మెత్తగా చేసి  చక్కర కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద కలుపుతూ ఉండాలి   దగ్గర పడ్డాకా స్టవ్ ఆఫ్ చేసి  ప్లేటుకి నెయ్యి రాసి పిండి మొత్తం పరచి ముక్కలు కట్ చేసుకోవాలి 
కావలసినవి                                                     బేసిన్ లడ్డు
   సెనగపిండి  2 కప్
 పంచదార 1 1/2 కప్
  నెయ్యి 1/2 కప్
యాలకులపొడి  ఆఫ్ స్పూన్
  తయారుచేయువిధానం   పంచదార మిక్సిలో పౌడర్ చెయ్యాలి , స్టవ్ మీద బాణలి పెట్టినెయ్యి వేసి కరిగేక  సెనగపిండి వేసి కమ్మని వాసన వచ్చేదాకా వేయించాలి పంచదార,యాలకులపొడి వేసి 2 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి లడ్డూలు  చేసుకోవాలి 

2, నవంబర్ 2012, శుక్రవారం

                                                                             కెరట,కొబ్బరి బూరెలు 
కావలసినవి
  కేరట్ తురుము  1 కప్
 కొబ్బరి తురుము  1 కప్
 పంచదార  1  1/2
   యాలకుల పొడి  1/2  స్పూన్
  జీడిపప్పు  కావలసినంత
 మినపప్పు  1 కప్
  బియ్యం 2 కప్
  నూనె వేయించడానికి  సరిపడా
   తయారు చేయువిధానం    ముందుగా  బియ్యం,మినపప్పు 4 గంటలు నానపెట్టి  మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి  1 గంట నానితే బూరెలు బాగా వస్తాయి
 స్టవ్ మీద బాణలి పెట్టి  2 స్పూన్ల నెయ్యి వేసి కెరట,కొబ్బరి తురుము వేసి పచ్చి వాసనా పోయే దాక వేయించి  పంచదార వేసి కరిగి ముద్ద  అయ్యేదాకా అడుగు అంటకుండా కలపాలి  
 నూనె వేడి చేసుకుని కొబ్బరి,కెరట ఉండలు   మినపిండిలో ముంచి బూరెలు దోరగా వేయించుకోవాలి 
                                                                            మొలకెత్తిన  పెసల చాప్స్ 

కావలసినవి
 మొలకెత్తిన పెసలు   1కప్
  బంగాలదుంపలు  2
 బ్రెడ్ పౌడర్  1/2 కప్
 ఉల్లిపాయ  2
 అల్లం ముక్క చిన్నది
 పచ్చిమిర్చి 4
ఉప్పు తగినంత
జీలకర్ర 1 స్పూన్
 కారం  1/2  స్పూన్
 నూన్  వేయించడానికి  సరిపడా
  తయారుచేయువిధానం   బంగాళదుంప ఉడికించి  ముద్ద చేసుకుని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ,మిర్చి,అల్లం కలిపి  పెసలు,ఉప్పు,కారం,జీలకర్ర  కలిపి  పెట్టుకోవాలి
  స్టవ్ మీద  పెనం పెట్టి వేడి చేసి   పిండిని చిన్న చిన్న ముద్దల్లా  చేసుకుని  వడలా  చేసుకుని రెండు వేపులా దోరగా వేయించుకుని  చెట్నీ తో  సర్వ్  చెయ్యాలి
    కావలసినవి                                                     సొరకాయ  [ అనపకాయ]  పాన్  కేక్ 
 తురిమిన సొరకాయ    1 కప్
 బొంబాయి రవ్వ  1 కప్
 శనగపిండి  1/4 కప్
అల్లం ముక్క  చిన్నది
 పచ్చిమిర్చి 4
 పెరుగు  1 కప్
 కారం  1 స్పూన్
 ఉప్పు సరిపడా   
   తయారుచేయువిధానం     అల్లం.,పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని   ఒక బౌల్ లో సొరకాయ తురుము,రవ్వ,శనగపిండి ,కట్ చేసుకున్న అల్లం,పచ్చిమిర్చి ,ఉప్పు,కారం,పెరుగు వేసి తగినన్ని నీళ్ళు పోసి దోస పిండిలా కలుపుకోవాలి
 పెనం వేడి చేసి పల్చగా దోస వేసుకుని రెండు వేపులా నూనె వేసి పైన సొరకాయ తురుము చల్లుకుని    రెండు వేపులా కొంచెం కర,కర లాడేలా వేయిస్తే  బాగుంటుంది