13, డిసెంబర్ 2013, శుక్రవారం

చెట్టినాడు ఇడ్లీలు 
                       
కావలసినవి   బటన్ ఇడ్లీలు  4  
 ఇడ్లిలో వేసుకునే కారంపొడి [ సెనగపప్పు,మినపప్పు,ఎండుమిర్చి, కరివేపాకు,చింతపండు,ఉప్పు, అన్ని కలిపి వేయించుకుని పొడి చేసుకున్నది ]]   4 స్పూన్స్   సాంబార్  1 కప్
  నూనె వేయించడానికి సరిపడా
  తయారుచేయువిదానం ఇడ్లీ వేయించుకుని ఒక బౌల్ లో వేసుకుని పైన కారంపొడి చల్లుకుని  సాంబార్  వేసుకుంటే చెట్టినాడు ఇడ్లి రెడి 

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

ధహీ సేవ్ బటాట  పూరి  కావలసినవి                                             దహి సేవ్ బటాట 
  పానీ పూరీకి  చేసే పూరీలు  తగినన్ని
 ఉడికించిన  ఆలూ 4
 తియ్యని చట్నీకి    చింతపండు,బెల్లం,ఉప్పు
  పెరుగు 1 కప్
  మొలకెత్తిన పెసలు  1/2 కప్
 జీలకర్ర 1స్పూన్
  మిరియాలు 4
  ఉల్లిపాయలూ 2
సన్న కరప్పోస 1/2 కప్
 తయారుచేయువిధానం   ఆలూ మెదిపి పెట్టుకోవాలి   ఉల్లిపాయ కొత్తిమీర సన్నగా కట్ చేసిపెట్టుకోవాలి
  చింతపండు,బెల్లం,ఉప్పు మిక్సిలో మెత్తగా చేసిపెట్టుకోవాలి
 జీలకర్ర,మిరియాలు వేయించి పొడి చేసి పెరుగులో కలిపి పెట్టుకోవాలి    ఇప్పుడు పూరి తీసుకుని పైన కన్నం చేసి ఆలూ ముక్క ,తియ్యని చట్ని వేసి దాని పైన పెసలు,ఉల్లిపముక్కలు వేసి  దాని పైన పెరుగు వేసి పైన సేవ్ ,కొత్తిమీర చల్లాలి 
వంకాయ పులుసు  కావలసినవి                                       వంకాయ పులుసు          
 వంకాయలు పెద్దవి  2
 పచ్చిమిరపకాయలు  5
 చింతపండు చిన్న ముద్దా
వెల్లుల్లి రేకలు  4
 ఎండుమిర్చ్చి  4
 జీలకర్ర,ఆవాలు,పోపుకి సరిపడా
  కొత్తిమీర కట్ట  1
 కరివేపాకు 2 రెమ్మలు
 పసుపు  చిటికెడు
 తయారుచేయువిధానం  వంకాయలు  కత్తితో గాటు పెట్టి  అందులో వెల్లుల్లి రేకలు,పచ్చిమిరపకాయముక్కలు గుచ్చి వంకాయకి నూనె రాసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి
  కాల్చిన వంకాయను నీళ్ళతో కడిగితే పైన పొట్టు పోతుంది
  ఉడికించిన వంకాయను మెత్తగా చేసి  చింతపండు పులుసు కలిపి ఉప్పు,పసుపు కలపాలి
 స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల  నూనె వేసి ఆవాలు,జీలకర్ర,ఎందుమిర్చ్చి,వేయించి పోపు వేయించి  కరివేపాకు వేసి కలపాలి
 చివరగా కొత్తిమీర చల్లుకుంటే వంకాయ పులుసు రెడి 
కార్న్ ప్లెక్స్ మిక్సర్  కావలసినవి                                         కార్న్ ప్లేక్స్ మిక్సర్ 
 కార్న్ ప్లేక్స్  1/4   కేజీ
  పల్లీలు  100 గ్రామ్స్
  పుట్నాలు  100  గ్రామ్స్
  బూంది  100 గ్రామ్
 సన్న కారపూస  50  గ్రామ్స్
 మిరియాలపొడి  1 స్పూన్
 పంచదార 1 స్పూన్
 ఉప్పు 1  స్పూన్
నూనె వేయించడానికి సరిపడా
  కరివేపాకు
  తయారుచేయువిధానం  స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి కాగేక కార్న్ ప్లేక్స్ వేయించి పేపర్ మీద పోస్తే అదనపు నూనె పేపర్కి ఉండిపోతుంది
  కొంచెం నూనెలో పల్లీలు,.పుట్నాలు వేయించుకోవాలి
  ఒక బౌల్ తీసుకుని  కార్న్ ప్లేక్స్,పల్లీలు,పుట్నాలు,బూంది ,కారపూస,మిరియాలపొడి,పంచదార,ఉప్పు కరివేపాకు, కలిపితే  కార్న్ ప్లేక్స్ మిక్సర్ రెడి 

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

అరటికాయ పచ్చడి  కావలసినవి                     అరటికాయ పచ్చడి  
 అరటికాయలు 2
 కారం 1/2 కప్
 అవాలపొడి  1/2 కప్
మెంతిపొడి 2 స్పూన్స్
నిమ్మకాయలు 4
 నూనె 1/4 కిలో
 ఉప్పు తగినంత
  తయారుచేయువిధానం  అరటికాయముక్కలు సన్నగా తరుక్కుని  నూనెలో ఎర్రగా వేయించాలి
ఒక బౌల్ తీసుకుని కారం,ఉప్పు,అవాలపొడి,మెంతిపొడి నిమ్మరసం  నూనె వేసి బాగా కలిపి అరటికాయ ముక్కలు కలిపి పెట్టుకోవాలి 
కాకరకాయ పచ్చడికి కావలసినవి                               కాకరకాయ చట్ని 
 కాకరకాయలు 1/2  కిలో
  కారం 1/2 కప్
 నువ్వులపొడి  1/2 కప్
 ఉప్పు 1/2 కప్
 నిమ్మరసం  1 కప్
 ధనియాలపొడి 1 స్పూన్
 జీలకర్రపొడి 1 స్పూన్
 పసుపు 1 స్పూన్
 నూనె 1/4 కేజీ
  తయారుచేయువిధానం కాకరకాయలల్ని చక్రాల్లా తరిగి పసుపు/.ఉప్పు కలిపి 10 నిమిషాలు ఉంచి  నీటిని పిండేయ్యాలి చేదు పోతుంది
 స్టవ్ మీద బాణలి పెట్టి 4స్పూన్ల నూనె వేసి కాకరకాయ ముక్కలు బాగా వేయించాలి  
 ఒక బౌల్ తీసుకుని  కారం.,ఉప్పు,నువ్వులపొడి,జీలకర్రపొడి,ధనియపొడి,నిమ్మరసం నూనె వేసి కలిపి వేగిన కాకరకాయ ముక్కలువేసి బాగా  కలిపి పెట్టుకోవాలి ఇది వారం,పది రోజులు ఉంటుంది 
కుర్కురే  కాజూ  కావలసినవి                                             కుర్ కురు కాజూ 
  బియ్యంపిండి  1/2 కప్
 మైదా 1/2 కప్
 నూపప్పు  1/4 కప్
  కారం 1 స్పూన్
 మిరియాలపొడి చిటికెడు
  బొంబాయి రవ్వ  1/4 కప్
 ఉప్పు తగినంత
 కాజు 20
 నూనె వేయించడానికి సరిపడా   తయారుచేయువిధానం  మైదా,బియ్యంపిండి  తీసుకుని కారం,మిరియాలపొడి,ఉప్పు కలుపుకుని తగినన్ని నీరు పోసి  ముద్దా చేసుకోవాలి  స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేడి చేసుకుని  ముద్దచేసుకున్న పిండిలో జీడిపప్పు పెట్టి చిన్న ఉండ తీసుకుని నూపప్పులో  దొర్లించి నూనెలో వేయిస్తే  కుర్ కుర్ కాజు రెడి 
సెవెన్ కప్స్  కావలసినవి                                                  సెవన్ కప్స్ 
 శనగపిండి  1 కప్
 నెయ్యి  1 కప్
 కొబ్బరి తురుము 1 కప్
 పాలు  1 కప్
 పంచదార  3 కప్పులు
  తయారుచేయువిధానం  కప్పులో సగంనెయ్యి  వేసి వేడి చేసి సెనగపిండి  కమ్మని వాసన వచ్చేల వేయించాలి   స్టవ్ మీద మూకుడు పెట్టి పంచదారవేసి 1/2 కప్ నీళ్ళు పోసి కరిగించాలి  బాగా కరిగేక  సెనగపిండి,కొబ్బరి,పాలు కలిపి  మిగిలిన నెయ్యి కొద్ది,కొద్దిగా వేస్తూ కలుపుతూ  బాగా దగ్గర పడ్డాక  ప్లేటులో పరచి  ముక్కలు కట్ చేసుకోవాలి   
కేరట్ పాయసం  కావలసినవి                                          కేరట్ పాయసం 
 1 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు
 1 1/2 కప్  కేరెట్ తురుము
 1 కప్ పంచదార
  చిటికెడు కుంకుం పువ్వు
 బాదాం పప్పులు  10  
    తయారుచేయువిధాన,ము ముందుగ    అర కప్ పాలులో కుంకుం పువ్వు వేసి అరగంట నానపెట్టాలి
 ఒక పాన్ తీసుకుని కేరట్ తురుము వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి
   పాలు ఇంకో గిన్నెలో 20 నిమిషాలు మరగించాలి
  బాదాం నానా పెట్టి తొక్క తీసి  బద్దలు చేసి పెట్టుకోవాలి     మరిగిన పాలల్లో ఉడికించిన కేరట్ తురుము,పంచదార,బాదాం ,కుంకుం పువ్వు కలిపినా పాలు  కలిపి 10 నిమిషాలు మరిగిస్తే కేరట్ పాయసం రెడి