ఇంటికోసం-ఇల్లాలి చిట్కా







ఈ రోజు ఆ రోజులు అని లేదు మన దైనందిన జీవితంలో చిట్కాలు యెంత అవసరమో మన అందరికి తెలిసినదే.అందుకే మన కోసం ఈ రోజు చిట్కాలు అనే కొత్త పుట ఆరంభిస్తున్నాము.
  • 1 స్పూన్ గసగసాలు నానపెట్టి మిక్సిలోవెయ్యాలి.దానిని వెచ్చని పాలల్లో వేసుకుని తాగాలి.అప్పుడు బాగ నిద్ర పడుతుంది--ప్రభ
  • విరోచనాలు తగ్గాలి అంటే కొంచెం మెంతులు ఒక 1/2  టీ స్పూన్ నోట్లో వేసుకుని నీళ్ళతో మింగేస్తే వెంటనే తగ్గుతాయి- సుశీల
  • పిల్లలకి జలుబు వెంటనే తగ్గాలంటే ,తులసాకుని నలిపితే వచ్చ్చే రసంలో ,ఒక చుక్క తేనే వేసి కలిపి నాకించాలి-సుశీల 
  • చలికాలంలో పెరుగు త్వరగా,గట్టిగా తోడుకోదు.
    పాలు తోడు పెట్టినప్పుడు వాటిలో ఒక ఎండుమిరపకాయ వేస్తే పెరుగు గట్టిగా త్వరగా తోడుకుంటుంది.
     -దీప్తి 
  •  విరోచనం ఫ్రీగా అవ్వని వాళ్ళు పొద్దున్నే లేవగానే [బ్రెష్ చేసుకున్నాక ] 2 గ్లాసుల వాటర్ తాగితే మంచిపలితం కనబడుతుంది    
  •   పులిత్రేనుపులు వస్తుంటే ఒక 1/2 స్పూన్ జీలకర్ర నమిలితే ఫలితం ఉంటుంది        
  • స్పూన్ వంటసోడలో 4లేక 5 చుక్కల నీరు కలిపి  పేస్టులాచేసి వెండి,బంగారు వస్తువులని  బ్రెష్ తో తోమితే కొత్తవాటిలామెరుస్తాయి
  •          తుమ్ములు బాగా వస్తుంటే కొత్తిమీరనలిపి రసం వాసనచుస్తే తుమ్ములు తగ్గుతాయి
  • వాతపరమైననొప్పులుతో బాధపడేవారు దాల్చిన చెక్కనుఎండపెట్టి  చూర్ణంచేసుకుని రోజు వేడిపాలలో ఒక స్పూన్ వేసుకుని తాగితే వాతపరమైన సమస్త నొప్పులు తగ్గుతాయి
  •  ఎంతకీతగ్గని పుండుపై సీతాఫలం ఆకులుమెత్తగా నూరి కట్టు కడితే వారంరోజుల్లో తగ్గిపోతుంది
  • మంచి ఇంగువ ,హారతి కర్పూరం సమానంగా తీసుకుని కందిగింజంత ఉండలు చేసుకుని ఒక్కొక్క ఉండ రోజు వేసుకుంటే ఉబ్బసం ,ఆయాసం,గుండె దడతగ్గుతాయి
  • నోటిపూత బాగా ఇబ్బంది పెడుతుంటే కరక్కాయ అరగదీసి అగంధం నాలికమీద రాసి తరువాత కరక్కాయ బెరడును చూర్ణంచేసి అరచెంచా చూర్ణాన్నివేడి నీళ్ళలోకలుపుకుని తాగితే నోటిపూత తగ్గుతుంది  
  • వేరుసనగానూనే వంటికి రాసుకుని మసాజు చేస్తే ఒళ్లునోప్పులు,కండరాల నొప్పులు తగ్గుతాయి      
  • కాలినగాయాలపై కొబ్బరినూనె అరారగారాస్తే మచ్చలు పడవు 
  • సెగగడ్డలువస్తే బియ్యం పిండి నీటితో కలిపి ఉడకపెట్టికొంచెం వేడిగా సేగ్గడ్డపై వేసి కట్టు కడితే సెగగడ్డ చితుకుతుంది   
  • కొబ్బరినూనెలో హారతి కర్పూరం పొడిచేసి,కలిపి రాస్తే దద్దురులు,దురద తగ్గుతాయి 
  • గాజు సామాను మీద మరకలు వినిగర్ వేసిన నీళ్ళతో కడిగితే పోతాయి
  • ఫేము కుర్చీలు సోడా కలిపిననీళ్ళతో తుడిస్తే తళ,తళ లాడుతాయి 
  • బోజనంలో నూనేపదార్ధాలు,వేపుళ్ళు ఎక్కువైతే భోజనం అయినతరువాత పళ్ళు తింటే సరిపోతుంది
  •  కొత్తచీరలు తడిపినప్పుడునీళ్ళల్లో ఉప్పు కలిపితే రంగు పోవు
  • ద్రాక్షపళ్ళు,టమాటాలు ,నారింజపల్లుతొక్కలు సులువుగా రావాలంటే మరుగుతున్న నీళ్ళల్లో రెండు నిమిషాలు ఉంచి తీసి చన్నీల్లల్లో వేసి వలిస్తే తొక్కలు బాగావస్తాయి
  • ఉల్లిపాయలు తరిగేక ఉప్పు పట్టించి చేతులు కడిగితే వాసనపోతుంది
  • పాలు విరుగుతాయని అనుమానం వస్తే .కాచేముందు పాలల్లో చిటికెడు వంటసోడా కలిపితే పాలువిరగవు
  • గోరింటాకు పొడిచేసి కొబ్బరినూనెలో వేసి తలకు రాసుకుంటే చుండ్రు ,పేలు ఉండవు
  • రోజు పొద్దున్న పరకడుపున గ్లాసు నీళ్ళల్లో సగం నిమ్మకాయ చెక్క రసం ,ఉప్పు కలుపుకుని తాగితే బరువు తగ్గుతారు
  • సెనగపిండిలో నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాస్తే  జిడ్డు తగ్గి రంగు వస్తుంది
  • బల్లులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఎటునుంచి లోపలి వచ్చేదోవ ఉంటె అక్కడ కోడిగుడ్డు డోల్లలు[షెల్ పెట్టాలి] 
  •  కడుపు నొప్పి ఉపసమనం పొందేందుకు ఉసిరికాయలరసం తీసి అందులో పంచదార కలుపుకుని తాగా
  • ఆవపొడి కొట్టేప్పుడు చేదు రాకుండా ఉండాలంటే 2  పసుపుకొమ్ములు 
    వేసి పౌడర్ చెయ్యాలి     మాధవి   
  • కరివేపాకు కొబ్బరినూనెలో మరిగించి అ నూనె తలకు రాసుకుంటే జుట్టు వత్తుగా పెరుగుతుంది,తొందరగా తెల్లపడదు
  • గంధం చెక్క అరగదీసి అ పేస్ట్ వాపులమీద రాస్తే తొందరగా తగ్గుతాయి 
  • కరక్కాయ ముక్క నోట్లో బుగ్గన పెట్టుకుంటే పొడి దగ్గు ఉపసమనం కలుగుతుంది 
  • తలకి నిమ్మకాయ రసం పట్టించి అరcఘంటఅయ్యాక  స్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది,చుండ్రు ఉండదు 
  • గొంతు నొప్పి జలుబు ,భారం ఉంటె వేడి పాలల్లో మిరియాలపొడి వేసుకుని తాగితే బాగా ఉపసమనం ఉంటుంది 
  • బాగా వేడి చేసినప్పుడు  పుచ్చాకాయరసం తాగితే తగ్గుతుంది 
  • టమాట రసం ఒకేసారి తీసి ఐస్ ట్రేలో వేసి ఫ్రీజర్లో పెడితే ఒక వారం వరకు బాగుంటుంది కావలసి వచ్చినప్పుడు వాడుకోవచ్చు 
  • కార్పెట్ మీద కార్న్ ఫ్లోర్ పిండి చల్లి వాక్యుం క్లీనర్తో  శుబ్రపరిస్తే కొత్తవాటిలాఉంటాయి 
  • ఇత్తడి సామాను ఆవనూనె,చింతపండు తో క్లీన్ చేస్తే కొత్తవాటిలమెరుస్తాయి
  • తుప్పు పట్టిన సూదులు సోప్ లో గుచ్చి ఉంచితే పని చేస్తాయి 
  • మిక్సిలో ఉప్పు వేసి గ్రైండ్ చేస్తే బ్లేడులు బాగా పనిచేస్తాయి 
  • తేనె చిక్కపడితే అసీసాని వేడి నీటిలో ఉంచితే వాడుకోటానికి ఉపయోగిస్తుంది 
  • పులిహోరకు వాడె మామిడితురుము దోరగా వేయిస్తేపచ్చి వాసనా ఉండదు 
    సగ్గుబియ్యం వడియాలు పెట్టేటప్పుడు సగ్గుబియ్యం ఉడికేక కొంచెం పెరుగు కలిపితే వడియాలు తెల్లగా వస్తాయి
    ఒక కప్  వెనిగర్లో ఒక కప్ వంట సోడా కలిపి సింక్ పైపులో పోసి పావు గంట తరువాత నీళ్ళు వదిలితే చెత్త అంతా పోయి క్లీన్ అవుతుంది
    బియ్యం డబ్బాలో కొన్ని వేపాకులు మూట కట్టి పెడితే బియ్యంలో పురుగులు రావు
    బొద్దింకలు తిరిగేచోట దోసకాయ ముక్క ఉంచితే బొద్దింకలు  తగ్గుతాయి
    మిక్సిలో బ్లేడు జిడ్డుగా ఉంటె అగిన్నేలో వెనిగర్ కొంచెం వేసి తిప్పితే జిడ్డు పోతుంది

    పావు కప్ టమాట గుజ్జులో కొంచెం పెరుగు కలిపి ముఖానికి రాసి  15 నిముషాలు తరువాత చల్లని నీటితో కడిగేస్తే 
    మెరుపు వస్తుంది 

    చిట్లిన కురులు పెరగాలంటే అర కప్పు పెరుగులో కొంచెం తేనే కలిపి రాసి 20 నిముషాలు తరువాత స్నానం చెయ్యాలి జుట్టు పట్టుకుచ్చులా ఉంటుంది 
    అరకప్పు పొట్టు మినపప్పులో 3 చెంచాల మెంతులు కలిపి మిక్సిలో పౌడర్ చేసి అపౌదర్ లో పెరుగు కలిపి జుట్టుకి ప
    ట్టించి అరగంట తరువాత శాంపుతో స్నానం చేస్తే జుట్టు మెరుపు వస్తుంది 

    ముఖం మీద నల్ల మచ్చలు పోవాలంటే వాడేసిన నిమ్మకాయ చేక్కల్ని ఎండపెట్టి పొడి చేసి సున్ని పిండిలో కలిపి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి

    దుప్పట్లు ఉతికేటప్పుడు నానపెట్టేటప్పుడు షొప్ తో వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేస్తె మరకలు,మచ్చలు వదులుతాయి

    కొత్తిమీర రసంలో చిటికెడు పసుపు కలిపి మొటిమల మీద రాస్తే ఫలితం కనపడుతుంది 

    పెసరపిండిలో 4 చుక్కల నిమ్మరసం ,పాలు కలిపి మొహానికి పూతలా రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో మొహం కడిగేసుకుంటే కాంతి వంతంలా మెరుపు వస్తుంది.,....... రాధమ్మ గారు


    ఒక స్పూన్ వంట సోడాలో 5 చుక్కల నీరుకలిపి వెండి వస్తువులు తోమితే కొత్త వాటిలామెరుస్తాయి  
      

    గోదుమలు మర పట్టించే టప్పుడు అందులో కొన్ని బార్లిగింజలు కలిపి పట్టిస్తే చపాతీలు తెల్లగా .,మృదువుగా వస్తాయి 

    ఇనుప వస్తువులు వాడేక వాటిని కిరోసిన్ తో తుడిస్తే తుప్పు పట్టవు 

    కళ్ళు మండుతుంటే కాస్త ఆముదం తీసుకుని అరికాళ్ళకి రాసుకుంటే మంచి పలితం ఉంటుంది

    దుస్తుల మీద షూపాలిష్ పడితే యూకలిప్టస్ఆకుల రసంతో రుద్ది శుబ్ర పరిస్తే సులువుగా వదిలిపోతుంది 

    దగ్గు ఎక్కువ రోజులు తగ్గకపోతే గ్లాస్ నీళ్ళల్లో అర చెంచ అల్లంరసం,అరచెంచ లవంగాలపొడి,దాల్చినచేక్కపొడి అరచెంచ తేనే కలిపి మరగించి తాగితే ఉపసమనం కలుగుతుంది 

    జ్యుసులు,కాఫీ,టీ లాంటి మరకలు పోవాలంటే ముందుగా చల్లని నీటితో కడగాలి తరువాత కొద్దిగా ఉప్పు చల్లి షొప్ తో రుద్దితే మరకలు త్వరగా పోతాయి 

    సిరా మరకలు పోవాలంటే సిరా పడిన చోట సోడా చల్లిబ్రెష్ తోరుద్దితే పోతాయి 

    తెల్ల దుస్తులు రంగు మారితే సబ్బు పోడిలోకొంచెం వంటసోడా కలిపి అరగంట నానపెట్టి ఉతికితే తెల్లగా మెరుస్తాయి

    ఒక కప్ నీటిలోవాడేసిన నిమ్మ చెక్కలు ,లవంగాలు మరిగించి దాన్ని ఓవెన్ లో పెడితే పదార్దాలు తాలూకవాసనలు రావు 

    నారింజ పండు తొక్కలు పారవేయకుండా ఎండలో పెట్టి పొడి చేసి అపోడిని డబ్బాలో బద్రపరిస్తే రసం కాచినప్పుడు అరచెంచా పొడి వేస్తె చాల రుచిగా ఉంటుంది  

    ఆపిల్ పండు,కేరట్లు ఒక చోట ఉంచితే చేదు ఉంటాయి 

    పుదీనా పచ్చడి చేసేటప్పుడు కొద్దిగా పెరుగు కలిపితే రంగు.,రుచి బాగుంటాయి  

    ఆకు కూరలు,బటానీలు తడపకుండా ఫ్రిజు లో పెట్టాలి

    ఓట్స్ పొడిలోకొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది 

    పావు కప్ పాలలో చెంచాడు చందనం పొడి అరచెంచ పసుపు కలిపి ముఖానికి పూతలా వేసి అరగంట తరువాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది

    పచ్చి బఠానీలు ఉడికించేటప్పుడు అందులో కొంచెం వెనిగర్ వేస్తె రంగు మారవు  

    తేనే ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే తేనే సీసాలో బియ్యం గింజలు వెయ్యాలి 

    చపాతి పిండి పలచగా అవుతే 5 నిమిషాలు ఫ్రిజులో పెట్టాలి

    • చర్మం కోమలంగా ఉండాలంటే అర కప్పు టమాటరసంలో రెండు చెంచాల నిమ్మరసం కలిపి రాసుకోవాలి పదిహేను నిమిషాలు అయ్యేక కడిగేసుకోవాలి 

    • పసుపు,గోధుమపిండి రెండు చెంచాల చొప్పున తీసుకుని నువ్యుల నూనెతో మిశ్రమంల చేసుకోవాలి దీన్ని ముఖానికి పూతలా పట్టించి అరగానే కడిగేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది 

    • పావుకప్పు కేబేజీ రసంలో చెంచాతేనే కలిపి ఈ మిశ్రమాన్ని తరుచు రాసుకుంటుంటే చర్మం ముడతలు రాకుండా నివారించవచ్చు 


    • వారానికోసారి కాసిని వేపాకులు వేసి మరిగించిన వేడి నీటితో ఆవిరి పడితే బ్లాక్ హెడ్స్ నివారించవచ్చు ,ముఖం తేటగాను ఉంటుంది 
    • వెండి వస్తువులు వంట షోడాతో రుద్ది మరిగిన నీటిలో పది నిమిషాలు ఉంచి బ్రెష్ తో రుద్ది పొడి గుడ్డతో తుడిస్తేకోత్హ వాటిలామెరుస్తాయి 
      • వెండి సామానులుజిడ్డు పేరుకుని ఉంటె అల్యూమినియం ఫాయిల్ తో రుద్దితే సుబ్రపడతాయి
      • కప్పు వెనిగర్ లో పావుకప్పు గోధుమపిండి చెంచాఉప్పు కలిపి ముద్దలా తయారుచేసి వెండి సామాను రుద్ది వేడి నీటితో కడిగితే కోత్హ వాటిలా ఉంటాయి 
      • టీ డికాసన్లో వెండి వస్తువులు అరగంటపాటు నానపెట్టి టూత్ పేస్ట్ తో రుద్దాలి తరువాత వేడి నీటితో కడిగి పొడి వస్త్రం తో తుడవాలి వెండి తరుగు పోకుండా ఉంటుంది 
      • చిన్న పాత్రలో చక్రాల్లాతరిగిన నిమ్మకాయ ముక్కలు కాసిని నీరు తీసుకుని ఈపాత్రనిగదిలో ఓమూల ఉంచితే గది అంతా పరిమళ భరిత మయుతుంది 
      • పూరి పిండి తదిపెటప్పుడు చిటికెడు పంచదార వేసి కలిపితే రుచితో పాటు ఎక్కువ సేపు క్రిస్పిగా ఉంటై 
      • కూరలు వండేటప్పుడు కొద్దిగా పాలు పోసినట్టైతేవాటికీ మంచి రంగుతో పాటు రుచి కూడా వస్తుంది 
      • రెండు స్పూన్ల నిమ్మరసంలో చిటికెడు పంచదార కలిపి అమిశ్రామాన్ని చేతులుకు రాసుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి
      • కంటికింద మచ్చలు పోవాలంటే 2 లేకా ,3  బాదంపప్పులు పాలల్లో వేసి మెత్తగా నూరి కళ్ళకింద పట్టిలావేసుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రము చేసుకోవాలి ఈవిధముగా కొన్నిరోజులు చేస్తే మచ్చలు తగ్గుతాయి మెత్తగా నూరిన పసుపులో తేనే కలిపి రాస్తే అన్నిరకాల చర్మ సంబందితసమస్యలు తగ్గుతాయి 
      • ఎండకు కమిలిన చర్మాన్ని కీరాముక్కలుతో ప్రతి రోజు పది నిముషాలు రుద్దితే ఫలితం ఉంటుంది.
      • ప్రతిరోజు ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేస్తే స్వేదం వల్లవచ్చిన ర్యాష్ తగ్గుతుంది కీరానుగుండ్రముగా చక్రాలు కోసి వాటిని కంటిమీద పెట్టుకుని ఒపావు గంట పాటు విశ్రాంతిగా పడుకోవాలి అలసిన కళ్ళకు విశ్రాంతి ని ఇస్తాయి
      • కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని దానిలో దూది ముంచి నల్లటి వలయాలమీద సున్నితంగా మర్దనా చెయ్యాలి పది,పదిహేను నిమిషాలు మూడు వారాలు చేస్తే క్రమముగా నల్లటివలయాలు,మచ్చలు దూరమవుతాయి 
      • కడుపునొప్పి నుంచి ఉపసమనం పొందేందుకు ఉసిరికాయ రసంలో పంచదార కలుపుకుని తాగాలి 
      • కొబ్బరి చేక్కలిని రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కలిపిననీటిలో ఉంచి రోజూనీరు మారుస్తుంటే 15 రోజులు తాజాగా ఉంటాయి 
      • ఎయిర్ -ప్రేసనర్ తో అద్దాలు తుడిస్తే అవి మిల మిల లాదడమే కాకుండా సువాసన భరితంగా ఉంటాయి పెనం ఉపయోగించే ముందు దాని మీద కొంచెం వెన్న వేసి కరిగిస్తే పదార్ధాలు రుచిగా వస్తాయి 
      • నేల మీద మరకలుపొవలంటే నీల్లల్లొ బ్లీచింగ్ పౌడెర్ వెసి బాగా కలపాలి మరకలున్నచొట అనీరు చల్లీ అరఘంట అయ్యక బ్రెష్ తొ రుద్ది  మంచినీల్లతొ తుడవాలి
      • ఒ కప్ చల్లని పాలు నెమ్మదిగా సిప్ చెస్తుంటె ఎసిడిటినుండి ఉపసమనముపొందవఛు
      • నొటిదుర్వాసనకి యాలకులు.వాము మంచిది
      • కాలిపగుల్లు తగ్గాలంటే వేపాకు పొడి ఒక స్పూన్ చిటికెడు పసుపు కొంచెం నిమ్మరసంలో కలిపి కాలి పగుల్లుకు రాస్తుంటే తగ్గుతాయి 
    • వేలు తెగి రక్తంవస్తుంటెకొద్దిగాపసుపు,కానికాఫిపౌదెర్ కాని చల్లితె రక్తస్రావం అగి
      పొతుంది
      వెల్లుల్లి యాంటీబయూటిక్ గా పనిచెస్తుందీ అన్న విషయం తెలిసిందె  వెల్లుల్లి రసాన్ని వేలు తెగిన చోట రాయాలి బేక్టీరియా చేరదు

      కొన్ని ఐష్ ముక్కలుతీసుకునికొద్దిసెపు రుద్దినట్లయితె  రక్తస్రావం అగిపొథుంది
      ముక్కు లొనుంచి రక్తం వస్తుంటె ఐష్ ముక్కను పొడి బట్టలొచుట్టి నెత్తిమీద కొద్దిసెపు ఉంచుకున్నా రక్తం కారడం తగ్గుతుంది
      పచ్చి పాలలో 3 బాదం పప్పులురాత్రి  నానపెట్టి  పేస్ట్ చెయ్యాలి 2 చుక్కలు తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాలు తరువాత కడిగెయ్యాలి మెరుపు వస్తుంది

      జీడిపప్పు,తురిమిన కొబ్బరి ఫ్రిజులో ఉంచితే పాడవు 

      ఐబ్రో పెన్సిల్ రాత్రి ఫ్రిజులో ఉంచి ఉదయం చెక్కితే తేలిగ్గా చెక్క బడుతుంది 

      ప్లాస్టిక్ పెట్టి మూతకి చిల్లులు చేసి అందులో కొత్తిమీర ఉంచి ఫ్రిజులో పెడితే కొత్తిమీర తాజాగా ఉంటుంది

      ఫ్రిజులో నుంచి తీసిన నిమ్మకాయను గది ఉస్ట్నోగ్రతకి వచ్చేదాకా ఆగి కోసి పిండాలి రసం బాగా వస్తుంది 

      ఐసు ముక్కలు గాజు గ్లాసులో కాని,జగ్స్ లో కాని ఉంచకూడదు అ పాత్రలు చిట్లే ప్రమాదం ఉంది 
      అల్లాన్ని కొద్ది రోజులు ఫ్రిజు లో అడుగు షెల్ఫు లో ఉంచి తరువాత నెమ్మదిగా అరనిస్తే  చాల రోజులు నిలవ ఉంటుంది 

      కొవ్వొత్తులు ఫ్రిజులో ఉంచి అవసర మోచ్చినప్పుడు వెలిగిస్తే మైనం తక్కువ కారుతుంది ఎక్కువ సేపు కాలుతుంది 

      ఫ్రిజు బయటి బాగాన్ని వెనిగర్ లో ముంచిన బట్టతో తుడిస్తే సుబ్రముగా ఉండటమే కాకుండా నిగ,నిగ లాడుతుంది 

      ఉల్లిపాయలు కోయడానికి ముందు డీప్ ఫ్ర్రజర్లో ఉంచి కొస్తే కళ్ళల్లో నీళ్ళు రావు


      ఫ్రిజుని డీ ప్రాస్టు చేసినప్పుడు కరిగిన నీటిని వడపోసి కారు బెటరిలో డిస్టిల్ వాటర్ బదులు పోయడానికి ఉపయోగించవచ్చు 

      చిన్నపిల్లలికి పార్టీలో బెలూన్స్ లో ముందరే ఓ చాక్లెట్ ఉంచి ఊది కడితే అవి పగిలినప్పుడు పిల్లలికి సర్ప్రైజుగాచాక్లెట్స్ లబిస్తాయి

      చిన్న పిల్లలికి గిఫ్ట్ ఇచ్చేప్పుడు చక్కని హేండ్ కర్చీఫ్ లేదా నాప్కిన్ లో దాన్ని కట్టి ఇస్తే డబల్ గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుంది

      బిస్కట్ డబ్బాలో బియ్యం కొద్దిగా ఉంచితే బిస్కట్స్ మెత్తబడకుండా ఉంటాయి

      చిన్నపిల్లలు వంటికి కాటుక రాసుకుంటే అ ప్రదేశంలో కోల్డ్ క్రీమ్ రాసి తుడిచేస్తే కాటుక పోతుంది 

      చిన్న పిల్లల కాళ్లల్లో ముళ్ళు గుచ్చుకుంటే అప్రదేసంలో ఐసు ముక్కని ఉంచితే తిమ్మిరెక్కి నొప్పి తెలియదు అప్పుడు ముల్లుని తీయాలి 

      బొద్దింకలు రాకుండా కలరా ఉండాలే కాక బట్టల్లో కర్పూరం కూడా ఉంచవచ్చు 

      ఎయిర్ టైట్ డబ్బాలో బ్లాటింగ్ పేపర్ ఉంచి బిస్కట్స్ పెడితే కరకర లాడుతూ ఉంటాయి 

      తేనె టీగ కుట్టిన చోట ఉల్లిరసం రాస్తే బాధ తెలియదు 

      రాయల్ బ్లూఇంక్ లో కొద్దిగా రెడ్ ఇంకు కలిపితే దాని రంగు బ్లూ బ్లేక్ గ మారుతుంది

      ఆలు గడ్డలు మెత్త పడితే తరగాబోయే ముందు అర గంట సేపు ఐసు నీళ్ళల్లో పెడితే గట్టిగ అవుతాయి 

      కూర గాయలు ఉదకపెట్టేప్పుడుముందు నీరు వేడి అయ్యేదాకా ఆగి తరువాత కూరగాయలని అనీతిలో వెయ్యాలి ఉప్పు కూడా ముందే వెయ్యాలి ఇందువల్ల ఇంధనం సేవ్ అవుతుంది 

      రాత్రి ఉప్పు నీళ్ళల్లో టమాటాలు ఉంచితే మర్నాడు ఉదయం ఎంతో తాజాగా ఉంటాయి ఆకూ కూరాలకి కూడా ఇచిట్కవర్తిస్తుంది 

      పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి గాలి చొరబడని సీసాలో ఉంచితే పాడవవు చిటికెడు పసుపు వాటిమీద చల్లి చల్లని ప్రదేశంలో ఉంచాలి 

      ఉల్లిపాయ తొక్కలు త్వరగా రావాలంటే ముందర వాటిని వేడి నీళ్ళలో వేసి తరువాత చల్లని నీళ్ళలో వెయ్యాలి


      నిమ్మకాయలు తాజాగా ఉండాలంటే వాటిని చల్లని నీళ్ళలో ఉంచాలి కానీ రోజు నీరు మార్చాలి  

      దోస కాయలు తాజాగా ఉండటానికి నేల మీద ఉంచాలి మూత పెడితే చాల రోజులు తాజాగా ఉంటాయి 

      అరటికాయలు ,వంకాయలు నల్ల పడకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు కలిపినా నీళ్ళలో ఉంచాలి 

      కేబేజీ కాలిప్లవార్ నీటిలో ఉప్పు కానీ వెనిగర్ కానీ వేసి ఉంచితే వాటిలోని క్రిములు పోతాయి 


      ములక్కాడలు,వంకాయలు,బీరకాయలు వంటి కూరగాయలు నిలువ ఉండటం వల్లఎండిపోతే వాటిని తాజాగా చేయాలంటే 1 గంట ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉంచితే సరి ,,,     
           ,
      ,  బియ్యం కడిగిన నీటిలో వంకాయ ముక్కలు వేస్తె కసరేక్కవు ,నల్లబడవు

      ఉల్లిపాయలేప్పుడు గాలి తగిలే బుట్టలో ఉంచాలి


      కూరల్లో చెంచాడు పాలు వేసి ఉడకపెడితే చక్కటి రుచి వస్తుంది

      వెల్లుల్లికి కొంచెం నూనె రాసి ఎండపేడితే వాటి మీద పొట్టు తేలిగ్గా వచ్చేస్తుంది
        కేరట్ జూసులో కొద్దిగా తేనే కలిపి ముఖానికి రాస్తే మొటిమలు.,మచ్చలు తగ్గిపోతాయి

      షాంపు వేసి స్కబ్ చేసి నీటితో కడిగేస్తే షర్టు కాలర్ మురికి త్వరగా పోతుంది

      ఉల్లిపాయలు,పచ్చి టమాటాలు కలిపి ఒక వస్త్రం లో చుడితే టమాటాలు త్వరగా పండుతాయి

      శరీరంలో అధిక ఉస్ట్నం వల్ల జలుబు చేసినప్పుడు కొబ్బరి నీళ్ళు బాగా తాగాలి

      ఉప్పు కలిపినా నీటితో శిరోజాలు కడిగితే చుండ్రు తగ్గి జుట్టు రాలటం తగ్గుతుంది

      శరీరమంతా ఆముదం రాసి అరఘంటాగి వేడి నీటితో స్నానం చేస్తే శారీరక నొప్పులు తగ్గి నిద్ర పడుతుంది

      వాము ,మెంతిపొడి కలిపి తయారు చేసిన కషాయంలో కొంచెం తేనే కలుపుకు తాగితే దగ్గు తగ్గుతుంది

      బటానీలు ఉడికించేటప్పుడు 3,,4  చుక్కలు వెనిగర్ కలిపితే ఆకుపచ్చ రంగు అలాగే ఉంటుంది

      సబ్బు బదులుగా సెనగపిండి రుద్దుకుని స్నానం చేస్తే చర్మం నిగారింపు వస్తుంది

    2 కామెంట్‌లు: