ఆలు., కొబ్బరి కూర కావలసినవి
బంగాలదుంపలు 4
కొబ్బరి సగంచిప్ప
ఆవాలు ,జీలకర్ర 1 స్పూన్
ఎండుమిర్చి 2
పచ్చిమిర్చి 2
కరివేపాకు 2 రెమ్మలు
అల్లం ముక్కలు 1 స్పూన్
తయారుచేయువిధానం ఆలుగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి .కొబ్బరికోరుకుని కొంచెము నీరుపోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని కొబ్బరిపాలుతీసి ఆలు ముక్కలులో పోసి 5 నిముషాలు ఉడికించి కొంచెం కూర గట్టిగ అయ్యేక పోపు వేయించి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి ఇది చపాతి,పూరి,అన్నం లో బాగుంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి