30, జూన్ 2012, శనివారం

                                                                 దొండకాయ గుత్తికూర 
కావలసినవి
 దొండకాయలు పావుకిలో
 ఉల్లిపాయలు 2
పచ్చిమిరపకాయలు  3
అల్లం,వెల్లుల్లి ముద్ద 1 స్పూన్
కరివేపాకు 1 రెమ్మ
 గరంమసాల 1/2 స్పూన్
 ధనియాలపొడి 1స్పూన్
నువ్యులపొడి 2 స్పూన్స్
 పసుపు చిటికెడు
 చింతపండు కొద్దిగా
కారం 1స్పూన్
 ఉప్పు తగినంత
 నూనె సరిపడా
 తయారుచేయువిధానం   ముందుగా ఉల్లిపాయముక్కలు,అల్లం,వెల్లుల్లి ముద్దా,గరం మసాల ,ధనియాలపొడి ,నువ్యులపొడి,పసుపు,ఉప్పు,కారంమిక్సిలో  వేసి ముద్దచేసిపెట్టుకోవాలి .
ఇప్పుడు దొండకాయ కడిగి గుత్తిగా కోసి పెట్టుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి దొండకాయలు వేసి కొంచెం మగ్గేక మసాల ముద్దా వేసి చింతపండు గుజ్జు వేసి పది నిమిషాలు సన్నని మంటపై వేయించుకోవాలి 
                                గుత్తిబెండకాయ 


కావలసినవి
 బెండకాయలు పావుకిలో
 పల్లీలు 1కప్
 ఎండుమిరపకాయలు 4
 జీలకర్ర 1 స్పూన్
 వెల్లుల్లి రేకలు 4
 కరివేపాకు 2 రెమ్మలు
 ఉల్లిపాయ 1
 పచ్చిమిరపకాయలు 2
  కారం 1 స్పూన్
 పసుపు చిటికెడు
 ధనియాలపొడి 1 స్పూన్
 ఉప్పు తగినంత
 నూనె 2 స్పూన్స్    తయారుచేయువిధానం ముందుగా పల్లీలు వేయించుకోవాలి అందులోనే ఎండుమిరపకాయలు,ధనియాలు ,జీలకర్ర,ఉప్పు,వేయించి చల్లారేక పోడిచేసిపెట్టుకోవాలి .ఇప్పుడు బెండకాయలు కడిగి చివరలు కట్ చేసుకుని మద్యలో చీరి పొడి కూరి పెట్టుకోవాలి  .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కలు,కరివేపాకు,పచ్చిమిర్చి వేగాక కారం,పసుపు వేసి పోడికూరిపెట్టుకున్న బెండకాయలు వేసి సన్నని మంటపై వేయించుకోవాలి 

29, జూన్ 2012, శుక్రవారం

కుక్కీస్
 కావలసినవి
 మైదా 200 గ్రా
వెన్న 100గ్రా
పంచదార 50 గ్రా
 బాదం కొద్దిగా
 తయారుచేయువిధానం ఒక బౌల్ లో వెన్న,పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి మైదాకూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్రిజు లో అరగంట పెట్టాలి
ఫ్రిజ్జు లో నుంచి తీసాక చపాతి పీట మీద వత్తుకుని మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకుని వీటి మీద బాదం అలంకరించి నెయ్యి రాసిన బేకింగ్ ట్రే లో అమర్చి 10 నిమిషాలు బేక్  చెయ్యాలి 
డోనట్స్
  కావలసినవి
 మైదా పావుకిలో
 పంచదార  1కప్
 పాలు 1/2  కప్
  వెన్న 1 స్పూన్
  ఉప్పు  1 స్పూన్
 వంట  సోడా చిటికెడు
 బేకింగ్ పౌడర్  పావు స్పూన్
 జాజికాయపొడి చిటికెడు
 దాల్చినచేక్కపొడి పావు స్పూన్
కోడి గుడ్డు 1
  నెయ్యి కాని నూనె కాని వేయించడానికి సరిపడా  తయారుచేయువిధానం  ఒక బౌల్ లో మైదా తీసుకుని వంటసోడా, బేకింగ్ పౌడర్,జాజికాయపొడి,దాల్చినచేక్కపొడి,వెన్న,ఉప్పు,వేసికలపాలి తరువాత పంచదార,గుడ్డుసొన ,పాలు చేర్చి స్పూన్తో బాగా కలిపి అరగంట అయ్యాక చాపాతిపీటమీద  అంగుళం మందముగా వత్తుకుని డోనట్స్ లా కట్ చేసుకుని వేయించుకోవాలి