31, జులై 2011, ఆదివారం

కొబ్బరి అన్నం

కొబ్బరి అన్నం కావలసినవి
 అన్నం 1 కప్ 
కొబ్బరి తురుము 1 కప్
 శనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1 స్పూన్ 
ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
 కరివేపాకు 2 రెమ్మలు 
నూనె 2  స్పూన్స్
 జీడిపప్పు కావలసినంత
 నెయ్యి 2 స్పూన్స్ 
 నూనె  2 స్పూన్స్ 
ఎండుమిర్చి  2
 పచ్చిమిర్చి  2
 కొత్తిమీర కట్ట 
   తయారుచేయువిదానం   ముందుగా అన్నం పొడి,పొడిగా వండుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి   అనూనేలోనే సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,పచ్చిమిర్చి ,కరివేపాకు వేయించి కొబ్బరి తురుము వేసి రెండు నిమిషాలు వేయించి అన్నం వేసి బాగా కలపాలి చివరగా రెండు స్పూన్ల నెయ్యి వేసి వేయించిన జీడిపప్పు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే కొబ్బరి అన్నం రెడి 

29, జులై 2011, శుక్రవారం

సగ్గు బియ్యం హల్వా

సగ్గు బియ్యం హల్వా కావలసినవి 
సగ్గు బియ్యం 1 కప్ 
పంచదార 1 కప్ 
కేసరి రంగు చిటికెడు 
నెయ్యి 1/2 కప్ 
 జీడిపప్పు,బాదం కావలసినంత 
ఏలకులు 2  
 తయారుచేయువిధానం  సగ్గు బియ్యాన్ని 5 గంటల ముందు నానపెట్టు కోవాలి నానిన సగ్గు బియ్యాన్ని నీరు వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి కొంచెం నెయ్యివేసి జీడిపప్పు,బాదం వేయించి వేరే ప్లేటులోకి తీసుకుని గ్రైండ్ చేసిన సగ్గు బియ్యం ముద్దని వేసి రెండు నిమిషాలు వేయించి పంచదార వేసి కలుపుతూ ఉండాలి మిశ్రమం దగ్గర పడ్డాక కేసరి రంగు ,ఏలకులపొడి వేసి బాగా కలిపి ప్లేటులోకి తీసుకుని వేయించిన జీడిపప్పు,బాదాం పైన అలంకరించాలి  

కాలీ ఫ్లవర్ 65

కాలీ ఫ్లవర్ 65  కావలసినవి
 కాలీ ఫ్లవర్ 1 
 మైదా 1 కప్ 
కార్న్ ఫ్లోర్ 1/2 కప్
  కారం 2  స్పూన్స్ 
 గరంమ్మసాల పొడి 2 స్పూన్స్
 అల్లం,వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్
 ఉప్పు తగినంత 
 నూనె వేయించడానికి సరిపడా 
 తయారుచేయువిధానం ముందుగా కాలీ ఫ్లవర్ చిన్న పూవులుగా విడదీసి ఉప్పు వేసిన వేడి నీళ్ళల్లో 5 నిమిషాలు ఉంచాలి .ఒక బౌల్ తీసుకుని మైదా,కార్న్ఫ్ ఫ్లోర్ ,కారం,ఉప్పు,అల్లం,వెల్లుల్లి పేస్ట్ ,గరం మసాల వేసి తగినన్ని నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలపాలి . స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక కాలీ ఫ్లవర్ పిండిలో ముంచి నూనెలో వేయించాలి వేడి,వేడిగా తింటే బాగుంటాయి   సాసు తో కాని పుదీనా చట్నీ తో కానీ తిన వచ్చు 

ఆలు 65

ఆలు 65 కావలసినవి
 ఆలు 4 
 మైదా 1 కప్
 కార్న్ ఫ్లోర్ 4 స్పూన్స్
 బియ్యం పిండి 4 స్పూన్స్
 కారం 2 స్పూన్స్
 గరం మసాలాపొడి 2 స్పూన్స్
 అమ్ చూర్ పొడి 2 స్పూన్స్
 చాట్ మసాలాపొడి 1 స్పూన్ 
 టమాటా సాసు 1 కప్
  ఉప్పు తగినంత 
 నూనె వేయించడానికి సరిపడా
 కొత్తిమీరకట్ట
 తయరుచేయువిధానం ముందుగ ఆలుగడ్డలు పీలర్ తో సుబ్రం చేసుకుని సన్నగా ,పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉప్పు వేసి కొంచెం ఉడికించాలి .ఒక బౌల్ తీసుకుని మైదా.బియ్యంపిండి.కార్న్ ఫ్లోర్ .,కారం,ఉప్పు,గరం మసాలాపొడి వేసి తగినన్ని నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలపాలి .స్టవ్ మీద నూనె పెట్టుకుని వేడి అయ్యాక పిండిలో ఆలు ముక్కలు ముంచి వేయించాలి అన్ని వేగేకా పైన అమ్ చూర్ ,చాట్ మసాల ,కొత్తిమీర చల్లాలి 

28, జులై 2011, గురువారం

పన్నీర్ 65

పన్నీర్ 65 కావలసినవి 
 పన్నీర్ ముక్కలు 1 కప్
 కార్న్ ఫ్లోర్ 1 కప్ 
మైదా 4 స్పూన్స్
 కారం 2 స్పూన్స్
 ధనియాల పొడి 2 స్పూన్స్
 అమ్ చూర్ పొడి 2 స్పూన్స్
 కొత్తిమీర కట్ట
 అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1  స్పూన్ 
ఉప్పు సరిపడా
 నూనె వేయించడానికి సరిపడా 
 తయారుచేయువిధానం ముందుగా పన్నీరు ముక్కలు వేడి నీళ్ళల్లో 5 నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టాలి .ఒక బౌల్ తీసుకుని మైదా ,కార్న్ ఫ్లోర్ ,ఉప్పు,ధనియాలపొడి ,అల్లం,వెల్లుల్లి పేస్ట్ ,గరం మసాల వేసి నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలపాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి అయ్యాక ఈ పిండిలో పన్నీర్ ముక్కలు ముంచి డీప్ ఫ్రాయ్ చెయ్యాలి అన్ని అయ్యాక పైన అమ్ చూర్ ,సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే పన్నీర్ 65 రెడి ఇవి టమాట సాసు తో తింటే బాగుంటాయి 

బేబీ కార్న్ 65

బేబీ కార్న్ 65   కావలసినవి
 బేబీ కార్న్ 4 
 మైదా 1 కప్
 బియ్యం పిండి 1/2 కప్
 కారం 2 స్పూన్స్
 అమ్ చూర్ పొడి 2 స్పూన్స్
 గరం మసాల 1 స్పూన్
 ఉప్పు సరిపడా
  అల్లం,వెల్లుల్లి ముద్దా 1 స్పూన్ 
నూనె వేయించడానికి సరిపడా 
కొత్తిమీర కట్ట 
  తయారుచేయువిధానం బేబీ కార్న్ పొడవుగా కట్ చేసుకుని ఉప్పు.నీరు పోసి ఉడకపెట్టి నీరు పిండేసి పెట్టుకోవాలి .ఒక బౌల్ తీసుకుని మైదా ,బియ్యం పిండి ,తీసుకుని కారం,గరం మసాలఅల్లం,వెల్లుల్లి ముద్దా , వేసి తగినన్ని నీరు 
కలిపి బజ్జి పిండిలా కలపాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక కార్న్ ముక్కలు పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించాలి అన్ని అయ్యాక ఒక బౌల్ లో తీసుకుని వీటిమీద అమ్ చూర్ పొడి ,సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే  బేబీ కార్న్ 65 రెడీ 

27, జులై 2011, బుధవారం

జీరా సర్భతు

జీరా సర్భతు  కావలసినవి 
జీలకర్ర 1 కప్
 పంచదార 4 కప్పులు
 పైనాపిల్ ఎసన్సు 1 స్పూన్
 సిట్రిక్ ఆసిడ్ 4 స్పూన్స్
 రెడ్ కలర్ 1 స్పూన్  
 నీళ్ళు  4 గ్లాసులు  
తయారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి  జీలకర్ర వేయించి చల్లారాక మిక్సిలో పొడి చెయ్యాలి గిన్నెలో నీరు పోసి ఈ పొడి వేసి మరిగించాలి .కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి వడ కొట్టాలి .ఇంకో గిన్నెలో పంచదార లో కొంచెం నీరు పోసి తీగ పాకం పట్టాలి పాకం తయారయ్యాక సిట్రిక్ ఆసిడ్ ,కలర్ వేసి చల్లార పెట్టాలి బాగా చల్లారాక జీలకర్ర రసం వేసి ఎసన్సు వేసి బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి 

20, జులై 2011, బుధవారం

ఫ్రూట్ కస్టర్ద్

ఫ్రూట్ కస్టర్ద్  కావలసినవి
 పాలు 1/2 లీటర్
కస్టెర్డ్ పౌడెర్ 3స్పూన్స్
పంచదార4స్పూన్స్
ఆపిల్ 1
అరటిపళ్ళు 2
ద్రాక్ష పళ్ళు 10
దానిమ్మ గింజలు పావు కప్పు
జీడిపప్పు,బాదం పావుకప్పు    తయారువిదానం గిన్నెలొ పాలు తీసుకుని మరిగించాలి ఒక చిన్న కప్పులొ చల్లని పాలు తీసుకుని కస్టెర్ద్ పౌడెర్ వెసి బాగ కలిపి మరుగుతున్న పాలల్లొ కలుపుతు పొయ్యాలి పంచదార కూడా వెసి బాగా కలిసెకా దింపెసి చల్లార పెట్టాలి .ఇప్పుడు పళ్ళు అన్ని పైన తొక్కలు తీసి చిన్న ముక్కలు కట్ చెసుకొవాలి .కస్టెర్డ్ లొ కలుపుకుని  ఫ్రిజు లొ పెట్టి బాగ చల్లగా తింటె బాగుంటుంది

19, జులై 2011, మంగళవారం

కాజు భరె కొఫ్తా కర్రీ

కాజు భరె కొఫ్తా కర్రీ   కావలసినవి
 ఆలు 2
 కెరట్ 1
బీన్స్ 10
 బటాని1కప్
స్వీట్ కార్న్ 1కప్
 పనీర్ క్యుబ్స్2స్పూన్స్
 మీగడ 1 స్పూన్
జీలకర్ర పొడి 1స్పూన్
 ధనియాపొడి 1 స్పూన్
కారం 1/2స్పూన్
జీడిపప్పు పావు కప్
ఉప్పు తగినంత
నూనె సరిపడ
ఉల్లిపాయలు 2
 టమొటాలు 2
అల్లం,వెల్లుల్లి పెస్ట్ 2 స్పూన్స్
గసగసాలు 1స్పూన్   తయారుచెయువిదానం గసగసాలు వెయించి పొడిచెయ్యాలి సగం జీడిపప్పు మిక్సిలొ పెస్ట్ చెయ్యలి ఆలు,కెరట్,బీన్స్,బటాని పనిర్ ,మీగడ మెత్తగ ఉడికించి చెత్తొ చిదిమి మద్యలొ జీడిపప్పు ఉంచి ఉండలు చెసుకునినూనెలొ  డీప్ ఫ్రై చెయ్యలి .గ్రెవి కొసం ఇంకొ ప్యాన్ పెట్టి 3స్పూన్ల నూనె వెసి ఉల్లిపాయముక్కలు వెయించాలి .టామొట,అల్లం,వెల్లుల్లిపెస్ట్ ,కొత్తిమీర,జీలకర్రపొడి,ధానియలపొడి,కారం ,గసగసాలపొడి ,జీడిపప్పు పెస్ట్ అన్ని కలిపి మెత్తగా గ్రైండ్ చెసుకొవాలి గ్రైండ్ చెసుకున్న ముద్దని వెగిన ఉల్లిపాయ ముక్కలుకి కలిపి నూనె విడివడే వరకు వెయించాలి 1కప్ నీరు పొసి గ్రెవీ లొ వెయించుకున్న ఉండలు వెసి 2 నిమిషాలు కలపాలి కాజు భరె కొఫ్తా కర్రీ  రెడి

కెరట్ రైస్

కెరట్ రైస్ కావలసినవి
 బాస్మతి రైస్ 1 కప్
కెరట్ తురుము 1కప్
 ఉల్లిపాయ 1
బఠాని  పావ్ కప్
పచిమిర్చి 2
 జీడిపప్పు కావలసిననంత
మినపప్పు 1స్పూన్
 అవాలు 1స్పూన్
ఉప్పు తగినంత
 పసుపు చిటికెడు
 నిమ్మరసం 2స్పూన్స్
 కారం 1స్పూన్
 నూనె 2స్పూన్స్
తయారుచెయువిదానం బాణలి పెట్టినూనెవెడిచెసుకొవాలి మినపప్పు,అవాలు ,మిరపకాయలు,జీడిపప్పువెసివెయించుకొవాలి.ఉల్లిపాయముక్కలుకూడవెసిదోరగావెయించుకొవాలికెరట్ తురుము,బటాని  కూడావెసి బాగాకలిపి పసుపు,ఉప్పు,కారం వెసి కొద్దిగా నీరు పొసి మూతపెట్టి ఉడ్కనివ్వాలి చివరగా అన్నం వెసి బాగ కలిపి సన్నగ తరిగిన కొత్తిమీర చల్లితె కెరట్ రైస్ రెడి

18, జులై 2011, సోమవారం

బెంగాలీ వెజిటబుల్ స్ట్యూ

 బెంగాలీ వెజిటబుల్ స్ట్యూ   కావలసినవి 
వంకాయలు 4
ఆలు 1
అరటికాయ 2
 బొప్పాయికాయ చిన్నది
ములక్కాడ 1
 బీన్స్ 10
చిలకడ దుంప 2
 కాకరకాయ 1
అవాలు 1స్పూన్
జీలకర్ర 1స్పూన్
 మెంతులు 1స్పూన్
ఎండుమిర్చి 4
పాలు పావు కప్
బియ్యం పిండి 1స్పూన్
 పలావ్ ఆకు 2
 అల్లం ముద్ద 1స్పూన్
 అవాలు ముద్ద 1స్పూన్
పంచదార 1స్పూన్
 తయారుచెయువిదానం కూరలన్ని సుబ్రముగా కడుక్కుని ముక్కలు కట్ చెసుకొవాలి స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వెసి అవాలు,జీలకర్ర,మెంతులు,ఎందుమిర్చి,పలావ్ ఆకు వెసి ,అల్లం ముద్ద వెయించాలి ఇప్పుడు కూరముక్కలన్ని వెసి ఉప్పు,పసుపు వెసి కొంచెం నీరు చల్లి మూత పెట్టి ఉడికించాలి బాగా ఉడీకిన థరువాత బియ్యం పిండీని పాలల్లొ కలిపి కూరలొ కలపాలి చివరగా ఆవముద్ద కలిపి 2స్పూనల నెయ్యి కలిపి దించెయ్యలి

అవియల్

అవియల్ కావలసినవి
 కెరట్ 2
ములక్కాడ 2
ఉల్లిపాయ 2
దొసకాయ 1
అనపకాయ చిన్నముక్క
కెప్సికం2
కొబ్బరికాయసగం చిప్ప
 సెనగపప్పు1స్పూన్
మినపప్పు1స్పూన్
మిర్చి 4
కొత్తిమీర కట్ట 1
 నెయ్యి 3 స్పూన్స్
ఇంగువ చిటికెడు
పసుపు చిటికెడు
 తయారుచెయువిధానం ముందుగా కూరగాయలన్ని సుబ్రముగా కడుక్కుని ముక్కలుగాసన్నగ కట్ చెసుకొవాలి .సెనగపప్పు,మినపప్పు వెయించి కొబ్బరిమిర్చి,ఇంగువ,పసుపుకలిపి తగినన్ని నీరు కలిపి  గ్రైండ్ చెసుకొవాలి .స్తొవ్ మీద బానలి పెట్టీ నెయ్యివెసి గ్రైండ్ చెసిన ముద్ద వెసి వెయించాలి   కూరముక్కలన్ని వెసి ఉప్పు వెసి తగినన్ని నీల్లు పొసి ఉడికించాలి బాగ ఉడికిన తరువాత కొత్తిమీర చల్లి  దించెయ్యాలి ఇది చపాతిలొకి ,అన్నం లొకి బాగుంటుంది

మాంగొ రైస్

మాంగొ రైస్  కావలసినవి 
బాస్మతి బియ్యం 150 గ్రాం
 మామిడి తురుము 2కప్స్
కరివెపాకు 2 రెమ్మలు
అవాలు 1 స్పూన్
ఎండుమిరపకాయలు 4
కొబ్బరితురుము1 కప్
ఇంగువచిటికెడు
నూనె 4 స్పూన్స్
 పల్లిలు కావలసిన్నన్ని
గరం మసాలపొడి 1స్పూన్
ఉప్పుతగినంత
 తయారుచెయువిదానం అన్నం ఉడికించి బెసిన్ లొ చల్లారనివ్వాలి .బానలిలొ నూనె వెసి వెడి చెసి పల్లిలు వెయించి అవాలు,ఎండుమిర్చి,కరివెపాకు  గరం మసాలపొడి వెసి వెయించాలి .అన్నం,మామిడితురుము,కొబ్బరి,తురుము వెసి సరిపడా ఉప్పు కలిపితె మాంగొ రైస్ రెడి

8, జులై 2011, శుక్రవారం

కంద పాటొలి

కంద పాటొలి  కావలసినవి
కంద  1/4కెజి
 నూనె 4 స్పూన్స్
ఎండుమిర్చీ 2
అవాలు 1 స్పూన్
జీలకర్ర1స్పూన్
ఇంగువ చితికెడు
కరివెపాకు2 రెమ్మలు
ఉప్పు సరిపడ
  తయారుచెయువిధానం కందను  తొక్కతీసి ఉడకపెట్టలి. నీరు వంచెసి పొడి,పొడి గా చెసుకొవాలి  మూకుడు పెట్టి నూనె వెడి చెసి పొపు వెయించి  ,కరివెపాకు ,ఇంగువ వెసి పొడీ,పొడిగ చెసుకున్న కందను వెసి వెయించుకొవాలి 5నిమిషాలు గరిటీ తొ కలుపుతు ఉంటె కంద పాటొలి రెడి

6, జులై 2011, బుధవారం

బెండకాయ.పల్లి కూర

బెండకాయ.పల్లి కూర కావలసినవి
 బెండకాయలు కేజీ \
పల్లీలు 1/2 కప్ 
జీడిపప్పు 10 గ్రామ్స్ 
 నూనె 4 స్పూన్స్ 
సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1 స్పూన్  
ఆవాలు 1
 జీలకర్ర  1 స్పూన్
 ఎండుమిర్చి  5  
పెరుగు 1  స్పూన్ 
 పసుపు చిటికెడు
 వెల్లుల్లి 5  రెబ్బలు
 కరివేపాకు 2  రెమ్మలు
 ఉల్లిపాయలు 2 
 ఉప్పు తగినంత 
 తయారుచేయువిధానం బెండకాయలు శుబ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి .ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జీలకర్ర,వెల్లుల్లి ,ఎండుమిర్చి ,ఉప్పు మిక్సిలో పొడి చేసుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పల్లీలు,జీడిపప్పు వేయించుకొని ప్లేటులోకి తీసి అదే బాణలిలోసెనగపప్పు.మినపప్పు,ఆవాలు వేయించి  బెండకాయ ముక్కలు వేసి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు ,పసుపు,పెరుగు వేసిబాగా వేయించాలి బాగా వేగిన తరువాత మిక్సిలో గ్రైండ్ చేసుకున్న పొడి చల్లి కలపాలి చివరగా పల్లీలు,జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి     

పైనాఆపిల్ జామ్

పైనాఆపిల్ జామ్ 
  అనాస పండు 1  
పంచదార అనాస  పల్పుఎంత ఉంటె అంత 
 నిమ్మ ఉప్పు 2 స్పూన్స్ 
అనాస ఎస్సన్సు 2 స్పూన్స్ 
ఫోటాసియం మేటబై సల్ఫేటు చిటికెడు
 ఎల్లోకలర్ చిటికెడు 
 తయారుచేయువిధానం అనాస పండు పైనతొక్క తీసి ఉప్పు వేసి పండుకి రుద్ది పంపు కింద బాగా కడగాలి .పండు మద్య గట్టిగ ఉన్న బాగం తీసేసి ముక్కలు కట్ చేసుకుని మిక్సిలో వేసి గ్రైండ్ చెయ్యాలి జ్యుసు వడపోసుకుని జ్యుసు ఎంత ఉంటె అంత పంచదార వేసి స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉండాలి పంచదార కరిగి మరుగుతున్నప్పుడు సిట్రిక్ ఆసిడ్ వేసి కలపాలి దగ్గర పడుతున్నప్పుడు ఎసన్సువేసి పొటాసియం మేటబై సల్ఫేట్ వేసిఎల్లో కలర్ వేసి  స్టవ్ ఆఫ్ చెయ్యాలి వెంటనే బాటిల్ లో పోసెయ్యాలి బాటిల్ చెక్క కాని పీట మీద కానీ పెట్టి పోస్తే బాటిల్ విరగదు 

4, జులై 2011, సోమవారం

ఓట్స్ భేల్ పూరి

ఓట్స్ భేల్ పూరి   కావలసినవి
 ఓట్స్ 1 కప్ 
నెయ్యి 2 స్పూన్స్
 కేరట్ 1  
కేప్సికం 1 
ఉల్లిపాయ 1 
 టమేటా 1  
పచ్చిమిర్చి  2 
 కొత్తిమీర చిన్న కట్ట
 పల్లీలు1 కప్
 ఉప్పు తగినంత 
 తయారుచేయువిధానంనెయ్యి వేడి చేసి  పల్లీలు వేయించాలి ఓట్స్ కూడా వేసి వేయించాలి .కేరట్,కేప్సికం,ఉల్లిపాయ,టమేటో,పచ్చిమిర్చి,కొత్తిమీర చాలాసన్నగా కట్ చేసుకోవాలి అన్ని ఒక బౌల్ లో వేసి కలుపుకుంటే ఓట్స్ భేల్ పూరి రెడి 

మొక్క జొన్న దోశ

మొక్క జొన్న దోశకావలసినవి
 మొక్కజొన్న గింజలు 4 కప్పులు 
పచ్చిమిర్చి 4   
అల్లం చిన్నముక్క
 బియ్యం పిండి 2 స్పూన్స్
 ఉల్లిపాయ 2
 ఉప్పు తగినంత 
నూనె తగినంత  
 తయారుచేయువిధానం మొక్కజొన్న గింజలు,అల్లం,పచ్చిమిర్చి,ఉప్పు  తగినన్ని నీళ్ళు పోసి దోసపిండిలా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక మొక్కజొన్న పిండి దోశ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని రెండు  వేపులాకాల్చుకోవాలి 

బాసుంది

బాసుంది కావలసినవి 
చిక్కటి పాలు 1 లీటర్ 
పంచదార చిన్న కప్పు
 ఏలకులు 2  
 స్టవ్ మీద బాణలి పెట్టి పాలు పోసి మరుగుతున్నప్పుడు పైన మీగడ తీస్తూ ఉండాలి అలాపాలు పావు లీటర్ అయ్యేవరకు మరిగించి  మీగడ లన్ని వేసి పంచదార .ఏలకులపొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి 

1, జులై 2011, శుక్రవారం

బాదాం బాసుంది

బాదాం బాసుంది కావలసినవి 
బాదాం 150 గ్రామ్స్
 పాలు అరలిటర్ 
కోవా 50 గ్రామ్స్
 పంచదార 150 గ్రామ్స్ 
ఏలకులు 4 
తయారుచేయువిధానం బాదంను రాత్రి నీళ్ళల్లో నానా పెట్టాలి నానిన బాదంను తొక్క తీసి గ్రైండ్ చేసి బాగా మెత్తగా చెయ్యాలి .పాలు స్టవ్ మీద పెట్టి బాగా మరిగిన తరువాత అందులో బాదాం పేస్ట్ వేసి కలపాలి .కోవా,పంచదార ,ఏలకుల పొడి కూడా వేసి కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి దీనిని  ఫ్రిజు లో పెట్టి చల్లగా అయ్యాక తింటే చాల రుచి కరంగా ఉంటుంది