30, ఏప్రిల్ 2011, శనివారం

అల్లం పెరుగు పచ్చడి

అల్లం  పెరుగు  పచ్చడి  కావలసినవి
 అల్లం చిన్న ముక్క
 పెరుగు 2 కప్స్
 పచ్చిమిర్చి 4 
 కొత్తిమీర కట్ట
 ఉప్పు సరిపడా
 పోపుకి ఎండుమిర్చి 1 
ఆవాలు,జీలకర్ర 1 స్పూన్ 
 తయారుచేయువిధానం అల్లం శుబ్రంగా కడుక్కుని మిక్సిలో అల్లం,పచ్చిమిర్చి,కొత్తిమీర,ఉప్పు మెత్తగా గ్రైండ్ చేసి పెరుగులో కలిపి .ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర పోపువేయించి కలిపితే అల్లం పెరుగు పచ్చడి రెడి ఇది అన్నంలోకి,గారేలులోకి,దోసలోకి బాగుంటుంది 

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

చాక్లెట్ కేక్


కావలసినవి :
ఎగ్స్ - 4
మైదా -1 కప్
సుగర్ -2 కప్స్
కొకొ పౌడెర్ - 3 స్పూన్స్
పాలు - 1/2 కప్
బటర్ -1/2 కప్
వెనీల ఎస్సెన్స్ - 1 స్పూన్
బేకింగ్ పౌడెర్ - 1 స్పూన్
వాటర్ - 1/2 కప్
ఈస్ట్ -1/2 కప్
ఉప్పు - చిటికెడు

తయారు చేసె విధానం:
* ముందుగా బటర్ , సుగర్ బాగ కలిసేల బీట్ చేసుకొవాలి.
* తర్వాత ఎగ్స్ వేసి బీట్ చెయాలి.
* ఇప్పుడు మైద, ఉప్పు , బేకింగ్ పౌడెర్ , కొకో పౌడెర్ కలిపి బీట్ చెయాలి.
* తర్వాత పాలు , వెనిల ఎస్సెన్స్ ,వాటర్ పోసి బీట్ చెయ్యాలి. ఇవన్ని ఒక 20 నిముషాలు బీట్ చెయ్యలి.
ఇప్పుడు ఒక పాన్ లొ నెయ్యి రాసి ,,మైదా తో గ్రీస్ చేసి బీట్ చేసిన కేక్ మిక్స్ వేసి ఒవెన్ లో బేక్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి నచ్చిన విధంగా చాక్లెట్ సిరప్ తో లేదా ఐసింగ్ సుగర్ తో గార్నిష్ చేసుకోవచ్చు .

ఆలు పరోట

ఆలు పరోట కావలసినవి
 ఆలు [బంగాలదుంపలు ] 4
మైదా పావుకిలో
 ఉల్లిపాయలు  2  
పచ్చిమిర్చి 4 
 జీలకర్ర 1  స్పూన్
 ఉప్పు తగినంత
  కారం  1  స్పూన్ 
 నూనె సరిపడా  
 తయారుచేయువిధానం మైదా పూరిపిండిలా తడిపి ముద్దా చేసుకుని పక్కనపెట్టుకోవాలి ఆలు మెత్తగా ఉడికించి స్మాస్  చేసుకోవాలి ఉల్లిపాయలు,పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని .స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి జీలకర్ర వేయించి పౌడర్ చేసి కలపాలి అలుముద్దకూడా కలిపి తగినంత ఉప్పు,కారంకలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి మైదా పిండిని పూరిల వత్తి నిమ్మకాయంత కూర ముద్దా తీసుకుని పూరిలోపెట్టి కవర్ చేసి పరోటాలు వత్తుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని పరోటాలు కాల్చుకోవాలి 

13, ఏప్రిల్ 2011, బుధవారం

చిట్టి చేగోడీలు

చిట్టి  చేగోడీలు
 బియ్యం పిండి 1  కప్
  మైదా 1 కప్
 రవ్వ 1 కప్
 ఉప్పు,కారం సరిపడా
 నూనె వేయించడానికి సరిపడా
 తయారుచేయువిధానం బియ్యంపిండి,మైదాపిండి,రవ్వ ఉప్పు,కారం అన్ని బాగా కలిపి నాలుగు చెంచాల నూనె వేడిచేసికలిపి నీరుకలిపి ముద్దచేసుకోవాలి ఉసిరికాయంత ముద్దతీసుకునిచిన్న  చేగోడీలు చుట్టుకోవాలి అన్ని అయ్యేక స్టవ్ మీద బాణలిలో నూనె పెట్టుకుని వేయించుకోవాలి 

సింగడాలు

సింగడాలు  కావలసినవి
 మైదా పావు కిలో 
కాలిఫ్లవర్ 1  కప్ 
పచ్చి బటాణి 1 కప్
 బంగాళాదుంప ఉడికించినది 1 కప్
 ఉల్లిపాయ 1 కప్
 అల్లం చిన్నముక్క
 పచ్చిమిర్చి 4
ఉప్పు తగినంత
 నూనె వేయించడానికి సరిపడా  
  తయారుచేయువిధానం మైదా పిండిలో నాలుగు చెంచాలు వేడినూనేవేసి పూరిపిండిలా కలిపి పక్కన పెట్టాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి అల్లం,పచ్చిమిర్చి వేసి వేగేక కూరముక్కలన్ని వేసి ఉప్పుకలిపి కూర చేసుకోవాలి మైదాపిండిని నిమ్మకాయంత ఉండలుచేసుకోవాలి పూరీలావత్తుకుని మద్యలో కట్ చేసుకోవాలి త్రిబుజాకారంలో వత్తుకుని పోట్లంలా మడిచి మద్యలో కూర పెట్టుకుని అంచులు అంటించి  నూనెలో దోరగా వేయించుకోవాలి 

బెంగుళూర్ వంకాయ కూటు

బెంగుళూర్ వంకాయ కూటు  కావలసినవి
 కందిపప్పు 1  కప్
 బెంగులూరువంకాయ 1  
పచ్చిమిర్చి 4 
 చింతపండు చిన్న ముద్దా
 సెనగపప్పు  2  స్పూన్స్
 ధనియాలు 2  స్పూన్స్
 కొబ్బరి చిప్పలో సగం
 మిరియాలు 4 
 ఎండుమిర్చి 4
మినపపప్పు  1  స్పూన్
 ఆవాలు,జీలకర్ర 1 స్పూన్ 
 నూనె 2  స్పూన్స్
 తయారుచేయువిధానం కందిపప్పు మరిమేత్తగా కాకుండా పలుకు లేకుండా ఉడకపెట్టుకోవాలి బెంగులూరువంకాయ ముక్కలు,చింతపండు గుజ్జు ,పచ్చిమిర్చి,పసుపు,ఉప్పు వేసిమరికాసేపు ఉడికించాలి .సెనగపప్పు,మిరియాలు,కొబ్బరి,ఎండుమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకుని పప్పులో కలపాలి చివరగా మినపప్పు,ఆవాలు,జీలకర్ర కరివేపాకు పోపు పెట్టుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కలిపితే బెంగుళూర్ వంకాయ కూటు రెడి ఇది అన్నంలోకి,పూరి,చపాతిలోకిబాగుంటుంది 

సగ్గుబియ్యం పెరుగుపచ్చడి

సగ్గుబియ్యం పెరుగుపచ్చడి కావలసినవి
 సగ్గుబియ్యం 1  కప్
 పెరుగు 2  కప్స్
 అల్లం చిన్నముక్క
 పచ్చిమిర్చి 4
కరివేపాకు 1 రెమ్మ
 కొత్తిమీర కట్ట 
మినపప్పు స్పూన్
 ఆవాలు.,జీలకర్ర స్పూన్
 ఎండుమిర్చి 2 
 పసుపు చిటికెడు
 ఉప్పు తగినంత
 నెయ్యి 2 స్పూన్స్
 తయారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యివేసి వేడి అయ్యాక మినపప్పు,ఆవాలు,జీలకర్ర ఎండుమిర్చి వేయిన్చికోవాలి అల్లం,పచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలు వేయించుకోవాలి పెరుగులోకలపాలి ,సగ్గుబియ్యం వేసి ఎర్రగా వేయించాలి కొంచెం చల్లారాకపెరుగులో కలిపి ,ఉప్పు,పసుపు కలిపి కొత్తిమీర,కరివేపాకు పైన వేస్తె సగ్గుబియ్యం పెరుగుపచ్చడి రెడి భోజనానికి 2 గంటల ముందు చేసుకుంటే సగ్గుబియ్యం  నాని పచ్చడి బాగుంటుంది 

9, ఏప్రిల్ 2011, శనివారం

మెంతికాయ

మామిడి కాయలు:-2
ఎండు మెరపకాయలు:-1/4 కిలో
మెంతులు:-100 గ్రా.
ఆవాలు:-2 స్పూన్స్.
ఇంగువ:-కొంచెం
నూనె:- 1 కప్పు.

మూకుడులో 1 స్పూన్ నూనె,మెంతులు వేసి వేయించి మెంతులు వేగాక ఎండు మెరపకాయలు ఆవాలు వేసి వేయించాలి.అవి ఒక ప్లేటులో తీసుకొని చల్లార పెట్టుకోవాలి.నూనె కాచి ఇంగువ వేసి పక్కన పెట్టుకోవాలి.వేయించిన మెంతులు మెత్తగ పొడి చేసుకోవాలి.మామిడి కాయలు చెక్కులు తీసి ముక్కలు చేసుకోవాలి.ఆ ముక్కలు,పొడి నూనె గోరువెచ్చగా ఉండగా దానిలో కలుపుకోవాలి.
సూర్యప్రభ

లడ్డు

శెనగపిండి:-1 కే.జి
పంచదార:-1 కే.1/4
నూనె:-1 కి.లో
జీడి పప్పు:-100 గ్రా.
కిస్ మిస్:-50 గ్రా.
యాలకుల పొడి:-2 స్పూన్స్.

శెనగపిండి గిన్నెలో వేసుకొని గరిట జారుగా కలుపుకోవాలి.మూకుడు పెట్టి నూనె వేడి చెయ్యాలి.బూండి గరిట తీసుకొని బూండినీ మెత్తగా చేసుకోవాలి.పక్క స్తవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీరు పొసి పంచదార వేసి తీగపాకం వచ్చే వరకు ఉంచాలి.దానిలో యాలకుల పొడి వేసి బూండి కూడ గిన్నెలో వేసి బాగా కలపాలి.జీడి పప్పు,కిస్ మిస్ కూడ వేసి కలపాలి.దాన్ని బాగా కలిపి ఉండలు చుట్టు కోవాలి.
సూర్య ప్రభ

7, ఏప్రిల్ 2011, గురువారం

సగ్గుబియ్యం కిచిడి

సగ్గుబియ్యం కిచిడి కావలసినవి
 సగ్గుబియ్యం 1/4  కిలో
 పచ్చిమిర్చి 4  
పల్లీలుకప్ లో సగం
 బంగాళదుంప ఉడికించినది 1 
 పెరుగు  2  స్పూన్స్
 సెనగపప్పు 1  స్పూన్ 
మినపప్పు 1   స్పూన్
 ఆవాలు,జీలకర్ర 1  స్పూన్ 
కరివేపాకు 1 రెమ్మ
  నెయ్యి  2  స్పూన్స్
 ఉప్పుతగినంత  
 తయారుచేయువిధానం ఒక గంటముందు సగ్గుబియ్యం నానపెట్టాలి .వేరుసెనగపప్పు వేయించి పొడి చేసుకోవాలి ..ఉడికించిన ఆలు,పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేడి అయ్యాక సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర వేగేక కరివేపాకు,ఆలు,పచ్చిమిర్చి ముక్కలువేయ్యాలి అవివేగేక నానినాసగ్గుబియ్యం,వేరుసేనగాపప్పుపొడి వేసి బాగా కలిపాలి తగినంత ఉప్పు,పెరుగువేసి    5  నిముషాలు ఉడకనివ్వాలి   

5, ఏప్రిల్ 2011, మంగళవారం

పెసరట్లకూర - పులావు

పెసరట్లకూర - పులావు కావలసినవి
  పెసలు 1/4  కిలో
 ఉల్లిపాయలు 4 
 అల్లం చిన్నముక్క 
 పచ్చిమిరపకాయలు  5 
 లవంగం 4 
  ఏలకులు 4 
 దాల్చినచెక్క
  ధనియాలు 1  స్పూన్
 గసగసాలు 1  స్పూన్ 
కొబ్బరి చిప్పలో సగం
 జీడిపప్పు 10 
 కొత్తిమీర కట్ట
 జీలకర్ర 2  స్పూన్
 బియ్యం 2 గ్లాసులు
 పసుపు చిటికెడు 
నెయ్యి 5  స్పూన్స్
  నూనె 5  స్పూన్స్ 
  తయారుచేయువిధానం పెసలు ముందురోజు నానపెట్టుకునిఅల్లం,పచ్చిమిర్చి కూడా వేసి  .గ్రైండ్ చేసుకుని .ఉప్పు,జీలకర్ర కలిపి కొంచెం మందముగా అట్లు వేసుకోవాలి పెసరట్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనెవేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేయించాలి పైన రాసిన వాటిలో సగం లవంగాలు,ఏలకులు,దాల్చినచెక్క,కొబ్బరి,గసగసాలు ,ధనియాలు నూరి ఉల్లిపాయాల్లో వేసి ,పెసరట్టు ముక్కలు వేసి,ఉప్పు,పసుపు వేసి కొంచెం నీరు పోసి మూత పెట్టి పది నిముషాలు కలిపితే కూర రెడి 
  2  ఉల్లిపాయలు,పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని .స్టవ్ మీదగిన్నే పెట్టుకుని నెయ్యి వేసి మిగిలిన ఏలకులు,లవంగాలు,దాల్చినచెక్క,వేసి వేగనిచ్చి  జీడిపప్పు వేసి వేయించాలి ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగేక కదిగిఉంచుకున్న బియ్యం వేసి అంతా కలిసేలా బాగాకలిపి నాలుగు గ్లాసుల నీరుపోసి 
ఉప్పువేసి మూతపెట్టాలి అన్నం ఉడికేక పెసరట్లకూర వేసి బాగా కలిపి స్టవ్ తగ్గించి5  నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి  
.

రసగుల్లాలు

రసగుల్లాలు  కావలసినవి
 చిక్కటి పాలు 1 లీటర్
 నిమ్మపండు 1 
 పన్నీరు 2  స్పూన్స్
 గోధుమపిండి 1 స్పూన్  
  తయారుచేయువిధానం పాలను స్టవ్ మీద కాచి మరుగుతుండగా స్పూన్ నిమ్మరసం వెయ్యాలి .పాలను కలియపెడుతూ వెయ్యాలి ముద్దలా అయ్యేవరకు కలియపెట్టాలి .శుబ్రంగా ఉన్న గుడ్డలో వడపోయాలిగుడ్డ అంచులు నాలుగు కలిపిపది నిమిషాలు  వేల్లాడదీయాలి బాగాపిండి నీరు అంతా పోయాక గుడ్డలో మిగిలిఉన్న చేన్నాని ప్లేటులో పొడి,పొడిగా చేసుకుని చేతితో పదినిమిషాలు గట్టిగ పిసికి మెత్తగా చెయ్యాలి గోధుమ పిండి కలిపి నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి    
 రసగుల్లకు రెండు పాకాలుచేస్తారు ఒక పాకం నిలువపాకం అందులో వండిన రసగుల్లాలు వేస్తారు రెండవపాకంలో రసగుల్లాలు వండాలి నిలువపాకంకు రెండు కప్పుల నీరు గిన్నెలోకి తీసుకుని రెండుకప్పుల పంచదార కలిపి స్టవ్ మీద పెట్టి సల,సలాకాగుతుండగా నాలుగు స్పూన్ల పాలు కలపాలి పాకం చేతికి అంటుకుంటుంటే పాకం తయారయినట్లు .చెన్నాఉండలు వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి  చల్లపడ్దాక పన్నీరు కలపాలి 

సందేశ్

సందేశ్ కావలసినవి
 పాలు  1 లీటర్
 నిమ్మకాయలు 2 
 పంచదార 100 గ్రామ్స్
 ఏలకులు 4    
  తయారుచేయువిధానం ఒకగిన్నెలో పాలు తీసుకుని మరిగించాలి పాలు మరుగుతున్నప్పుడే నిమ్మరసం వెయ్యాలి పాలువిరిగి చన్నాతయారవుతుంది దానికి చక్కర కలిపి స్టవ్ మీదపెట్టి సన్న మంటమీదపెట్టి 10  నిముషాలు కలిపితే గట్టి పడుతుంది ఏలకులపొడి వేసి ప్లేటులో పరిచి ముక్కలు కట్ చెయ్యాలి  

4, ఏప్రిల్ 2011, సోమవారం

బాసుంది

బాసుంది కావలసినవి
 పాలు 1 లీటర్
 పంచదార 200  గ్రామ్స్
  చారపప్పు 25 గ్రామ్స్
 కుంకుం పూవు చిటికెడు
 ఏలకులు 5 
 జీడిపప్పు 25  గ్రామ్స్
 బాదాం పప్పు 25  గ్రామ్స్
 కిస్మిస్ కొంచెం 
 తయారుచేయువిధానం నీల్లుకలవని చిక్కని  పాలు గిన్నేలోపోసి సన్నని మంటమీద మరగపెట్టాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి లీటర్ పాలు అరలిటర్ అయ్యేవరకు మరగనివ్వాలి .పంచదార వేసి కలుపుతూ మరికొంచెం సేపు కగానిచ్చి దింపాలి .ఈమరిగిన పాలలో జీడిపప్పు,చారపప్పు,బాదంపప్పు,కిస్మిస్ నేతితోవేయించి కలపాలి తరువాత ఏలకులపొడి ,కుంకుమపువ్వు కలపాలి  బాసుంది రెడి తినడానికి చాల రుచిగా ఉంటుంది 

3, ఏప్రిల్ 2011, ఆదివారం

ములక్కాడ కూర


కావలసినవి :


ములక్కాడ - 2

టొమాటొ -2

ఆలు - 2

ఉల్లిపాయ - 2

ఉప్పు - సరిపడ

కారం - 1 స్పూన్

పచ్చిమిర్చి - 2

ధనియాల పొడి - 1 స్పూన్

జీలకర్ర పొడి - 1 స్పూన్

నూనె - 4 స్పూన్స్

పసుపు - 1/2 స్పూన్


జీడిపప్పు


తయారు చేసె విధానం :

ముందుగా నూనె వేడి చేసి కట్ చేసిన ఉల్లిపాయ , పచ్చిమిర్చి ,ఆలు , జీడిపప్పు వేయించాలి.


అవి వేగాక కట్ చేసిన టొమాటొ , ములక్కాడ వెయ్యాలి.

ఇప్పుడు పసుపు , ధనియాల పొడి , జీలకర్ర పొడి , కారం , ఉప్పు కొంచుం నీళ్ళు వేసి కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే ములక్కడ కూర రెడి.

2, ఏప్రిల్ 2011, శనివారం

సెనగల ఆవకాయ

సెనగల ఆవకాయ  కావలసినవి
 మామిడికాయలు 10 
కారం 250  గ్రామ్స్
ఆవపొడి 200  గ్రామ్స్
 ఉప్పు 200  గ్రామ్స్
 సెనగలు  50  గ్రామ్స్
 నూనె 250  
  తయారుచేయువిధానం మామిడికాయలు ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పళ్ళెం తీసుకుని కారం,ఆవపొడి,ఉప్పు,నూనె కలుపుకుని మామిడికాయ ముక్కలు కలుపుకోవాలి .కొంచెం పెద్ద సెనగలు ఏరుకుని కలుపుకోవాలి  ఆవకాయలో ఊరిపుల్ల,పుల్లగా ఉంటాయి

నూపిండి ఆవకాయ

నూపిండి ఆవకాయ కావలసినవి
 కారం 250 గ్రామ్స్
 మామిడికాయలు 10 
 నూపప్పు  200  గ్రామ్స్
 ఉప్పు 200  గ్రామ్స్
 పప్పునూనే  200  గ్రామ్స్
 తయారుచేయువిధానం   నూపప్పు 2 గంటలు ఎండపెట్టి పౌడర్ చేసుకోవాలి .మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పళ్ళెం తీసుకుని కారం.ఉప్పు,నూపిండి కలిపి పప్పునూనే కలపాలి .మామిడికాయముక్కలు కలిపి జాడీలో పెట్టుకోవాలి 

పెసర ఆవకాయ

పెసర ఆవకాయ కావలసినవి
 మామిడికాయలు 10 
 కారం 250  గ్రామ్స్ 
 పెసరపప్పు 200  గ్రామ్స్
 ఉప్పు 200  గ్రామ్స్
 నూనె 250  గ్రామ్స్
  తయారుచేయువిధానంపెసరపప్పు ఎండలోపెట్టిమిక్సిలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి  మామిడికాయ శుబ్రంగా తుడిచి ముక్కలు కట్ చేసుకోవాలిఒకపల్లెం తీసుకుని కారం,పెసరపొడి,ఉప్పు,పప్పునూనే వేసిబాగా కలిపి మామిడిముక్కలు కలపాలి  .

పులిహార ఆవకాయ

పులిహార ఆవకాయ కావలసినవి
 మామిడికాయలు 10 
 కారం 250  గ్రామ్స్
ఆవపిండి 200  గ్రామ్స్
 ఉప్పు 200  గ్రామ్స్ 
  పప్పునూనే 250  గ్రామ్స్
 సెనగపప్పు  1   స్పూన్ 
 మినపప్పు  1     స్పూన్ 
 ఆవాలు,జీలకర్ర 1  స్పూన్ 
 జీడిపప్పు    10     
 నూపప్పు     2    స్పూన్ 
 కరివేపాకు      2    రెమ్మ 
 తయారుచేయువిధానం  మామిడికాయ శుబ్రంగా తుడుచుకుని చిన్న,చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పళ్ళెం తీసుకుని కారం,ఆవపొడి,ఉప్పు బాగాకలిపి నూనె కలపాలి .మామిడికాయ ముక్కలు కలపాలి జాడీలో పెట్టుకోవాలి కొంచెం కొంచెం పోపులో వేసుకోవాలి .స్టవ్ మీద బాణలిపెట్టినూనె వేసుకుని సెనగపప్పు   ,మినపప్పు,ఆవాలు.,జీలకర్ర వేయించి .జీడిపప్పు,నూపప్పు,కరివేపాకు వేసిఆవకాయలో కలిపితే  పులిహార    ఆవకాయ రెడి 

నీళ్ళ ఆవకాయ

నీళ్ళ ఆవకాయ కావలసినవి
 మామిడికాయలు 10
 కారంపొడి 250 గ్రామ్స్
ఆవపొడి 500 గ్రామ్స్
 ఉప్పు 250 గ్రామ్స్
 నూనె 150 గ్రామ్స్
 నీళ్ళు 4  గ్లాస్స్లు
 తయారుచేయువిధానం  మామిడికాయలు కడిగి ,తడిలేకుండా తుడిచిటెంకతో పాటుకట్ చేసుకోవాలి .ఒక గిన్నెలో నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి మరగపెట్టాలి కొంచెం చల్లారాకఆవపిండి,కలపాలి పూర్తిగా చల్లరేక కారం,ఉప్పు,నూనె,మామిడిముక్కలు వేసి బాగాకలపాలి జాడీలో పెట్టుకోవాలి ఇది నిలువ ఉంటుంది   

అల్లం,వెల్లుల్లి ,మామిడి ఆవకాయ

అల్లం,వెల్లుల్లి ,మామిడి ఆవకాయ కావలసినవి
 మామిడికాయలు 10 
 అల్లం 200 గ్రామ్స్
ల్లుల్లి 200  గ్రామ్స్
 కారం 250 గ్రామ్స్
 జీలకర్ర 50  గ్రామ్స్
 మెంతులు 25  గ్రామ్స్
 నూనె 500  గ్రామ్స్
 ఉప్పు 250 గ్రామ్స్
 ఎండుమిరపకాయలు 5
 ఆవాలు జీలకర్ర 1  స్పూన్ 
   తయారుచేయువిధానం మామిడికాయలను శుబ్రం చేసి తడిలేకుండా తుడిచి ముక్కలు కట్ చెయ్యాలి అల్లం,వెల్లుల్లి శుబ్రం చేసి తడిలేకుండా గ్రైండ్ చెయ్యాలి .మెంతులు,జేలకర్ర వేయించి పౌడర్  చెయ్యాలి .అల్లం,వెల్లుల్లి ముద్దలో కారం,ఉప్పు,మెంతిపొడి,జీలకర్రపొడి,మామిడికాయ ముక్కలు కలపాలి .ఒక బాణలి లో నూనె కాచి చల్లారేకపచ్చడిలో కలపాలి చివరగా ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి పోపువేయించి  కలపాలి 

మాగాయ పచ్చడి

మాగాయ పచ్చడి కావలసినవి
 మామిడికాయలు 10
కారం 250 గ్రామ్స్ 
 మెంతులు200  గ్రామ్స్ 
 ఆవాలు  100 గ్రామ్స్   
 నూనె 200  గ్రామ్స్
ఇంగువ 1/2  స్పూన్ 
  ఉప్పు 200  గ్రామ్
  పసుపు 1 స్పూన్ 
  తయారుచేయువిధానం మామికాయముక్కలు పొడవుగా కట్ చేసుకుని ఉప్పు,పసుపు కలిపిఒకరోజు ఉరపెట్టాలి తరువాత 2 రోజులు ఎండలోపెట్టాలి  నూనె  కాచి చల్లార్చి ఇంగువకలిపి  .ఎండిన మామిడిముక్కలుకుకారం,మెంతిపొడి,ఆవపొడి  కలిపి నూనె కలపాలి  

మామిడి తురుము పచ్చడి

మామిడి తురుము పచ్చడి 
  మామిడికాయలు 5 
 కారం  50 గ్రామ్స్
 మెంతిపొడి 2 స్పూన్స్
 ఉప్పు 4  స్పూన్స్
 సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1  స్పూన్
 ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
  తయారుచేయువిధానం మామిడికాయలు శుబ్రంగ తుడిచితురుముకోవాలిఎండలో2 గంటలు ఎండనివ్వాలి తురుములో కారం,మెంతిపిండి,ఉప్పు కలిపిఉంచాలి స్టవ్ మీద నూనె పెట్టి పోపు వేయించి కలపాలి  .    

నూనె మాగాయి

నూనె మాగాయి  కావలసినవి
 మామిడికాయలు  10 
 కారం 250  గ్రామ్స్  
మెంతులు 200  గ్రామ్స్
 ఉప్పు 150  గ్రామ్స్ 
 నూనె  250  గ్రామ్స్
 ఇంగువ 1  స్పూన్
 తయారుచేయువిధానంముందుగ మామిడికాయ శుబ్రంగ తుడిచి తొక్క తీసి పొడుగ్గా ముక్కలు కట్ చెయ్యాలి అవి ఒకరోజు ఎండలోపేట్టాలి .మెంతులు ఎర్రగా వేయించుకొని మెత్తగా పొడి చెయ్యాలి  .నూనెకాచి ఇంగువ వేసి చల్లార్చాలి సాయంత్రం ముక్కలు ఎండాకకారం,మెంతిపొడి,ఉప్పు,నూనె కలపాలి 

మామిడి ఆవకాయ

మామిడి ఆవకాయ కావలసినవి
 మామిడికాయలు 10 
 కారం 150  గ్రామ్స్
ఆవపొడి 100  గ్రామ్స్
 ఉప్పు 50  గ్రామ్స్
 మెంతులు 50  గ్రామ్స్
 నువులనూనే 150  గ్రామ్స్
 వెల్లుల్లి 50  గ్రామ్స్
 తయారుచేయువిధానం ముదిరిన పుల్లని మామిడి కాయలుశుబ్రం గాకడుక్కుని తడి లేకుండా తుడుచుకుని  8ముక్కలుగ కట్ చేసుకోవాలి ముక్కకిఉన్న జీడి,పొరతీసేయ్యాలి . ఒక పళ్ళెం తీసుకుని కారంపొడి,ఆవపొడి,ఉప్పు,మెంతులు ,పైన రేకులుతీసేసిన వేల్లులిపాయలు అన్ని బాగాకలిసేలా కలిపి నూనె పోసికలపాలి .మామిడికాయ ముక్కలుకుడా కలిపితే ఆవకాయ రెడి జాడిలోపెట్టి 3 రోజుల తరువాత తింటే ఊరుతుంది