7, ఏప్రిల్ 2011, గురువారం

సగ్గుబియ్యం కిచిడి

సగ్గుబియ్యం కిచిడి కావలసినవి
 సగ్గుబియ్యం 1/4  కిలో
 పచ్చిమిర్చి 4  
పల్లీలుకప్ లో సగం
 బంగాళదుంప ఉడికించినది 1 
 పెరుగు  2  స్పూన్స్
 సెనగపప్పు 1  స్పూన్ 
మినపప్పు 1   స్పూన్
 ఆవాలు,జీలకర్ర 1  స్పూన్ 
కరివేపాకు 1 రెమ్మ
  నెయ్యి  2  స్పూన్స్
 ఉప్పుతగినంత  
 తయారుచేయువిధానం ఒక గంటముందు సగ్గుబియ్యం నానపెట్టాలి .వేరుసెనగపప్పు వేయించి పొడి చేసుకోవాలి ..ఉడికించిన ఆలు,పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేడి అయ్యాక సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర వేగేక కరివేపాకు,ఆలు,పచ్చిమిర్చి ముక్కలువేయ్యాలి అవివేగేక నానినాసగ్గుబియ్యం,వేరుసేనగాపప్పుపొడి వేసి బాగా కలిపాలి తగినంత ఉప్పు,పెరుగువేసి    5  నిముషాలు ఉడకనివ్వాలి   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి