28, సెప్టెంబర్ 2011, బుధవారం

శరన్నవరాత్రి శుభాకాంక్షలు

దసరా నైవేద్యాలు పోస్ట్ చేస్తున్నాను.మీకు తెలిసినవి కొత్తవి ఉంటె నా బ్లాగ్ కి పంపండి.

మీ,
సుశీల 

పులగం

పులగం  కావలసినవి
 బియ్యం 2 కప్
 పెసరపప్పు గుప్పెడు 
 పసుపు చిటికెడు
 ఉప్పు తగినంత
  తయారుచేయువిధానం బియ్యం,పెసరపప్పు కడిగి 4 కప్ నీళ్ళు పోసి ఉప్పు,పసుపు కలిపి అన్నం వండాలి  ఇది తప్పనిసరిగా పండగలలో అమ్మవారికి నైవేద్యం పెడతారు 

బొంబాయి రవ్వ బూరెలు

బొంబాయి రవ్వ బూరెలు కావలసినవి
 బొంబాయి రవ్వ 1 కప్ 
పంచదార 1
 మినపపప్పు1  కప్  
  బియ్యం 2  కప్ 
ఏలకులపొడి 1 స్పూన్
 నూనె వేయించడానికి సరిపడా
జీడిపప్పు,కిస్మిస్ తగినంత 
  నెయ్యి 2  స్పూన్  
   తయారుచేయువిధానం ముందుగా బియ్యం,మినపప్పు 5  ముందు నానపెట్టి మిక్సిలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి . స్టవ్ మీద బాణలి పెట్టి  నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి రవ్వ కూడా వేసి కమ్మని వాసనా వచ్చేదాకా వేయించి  పెట్టుకోవాలి ఇంకో గిన్నెలో పంచదార వేసి కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పీట్టిపంచదార కరిగి పాకం వచ్చేక రవ్వ  వేసి ఉడికించాలి గట్టిగ అయ్యేక 2  స్పూన్ల నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి  .చల్లారక చిన్న ఉండలు చేసి మినపప్పు,బియ్యం రుబ్బి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రాయ్ చెయ్యాలి 

26, సెప్టెంబర్ 2011, సోమవారం

పులిహార

పులిహార  కావలసినవి
 బియ్యం 2 కప్
 చింత పండు చిన్న ముద్దా 
సెనగపప్పు 1 స్పూన్ 
మినపప్పు 1 స్పూన్ 
ఆవాలు.జీలకర్ర 1 స్పూన్
 ఆవపొడి 1 స్పూన్
 కరివేపాకు 2 రెమ్మలు
 జీడిపప్పు కావలసినంత
 నుపప్పు 1 స్పూన్
 నూనె 4  స్పూన్స్ 
 ఉప్పు తగినంత  
 ఎండుమిర్చి 2 
 పసుపు చిటికెడు 
  తయారుచేయువిధానం బియ్యం సుబ్రముగా కడుక్కుని 4  కప్ ల నీరు పోసుకుని కుక్కర్లో అన్నం వండుకుని ఒక పెద్ద ప్లేటులోకి తీసి పెట్టుకోవాలి చింతపండు రసం తీసి ఉప్పు,సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి వేసి ఉడికించాలి అన్నంలో చిటికెడు పసుపు వేసి పైన 1 స్పూన్ నూనె వెయ్యాలి . స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి ,జీడిపప్పు,నూపప్పు,కరివేపాకు వేయించుకోవాలి చింతపండు రసం,పోపు అన్నం లో బాగా కలిపి ,అవపోడిలో 1 స్పూన్ నూనె కలిపి అన్నంలో కలిపితే పులిహార రెడి  ఇష్టమైన వారు పోపులో ఇంగువ కూడా వేసుకుంటారు 

పరమాన్నం

పరమాన్నం  కావలసినవి 
 బియ్యం 1 కప్ 
పాలు 1/2 లీటర్
 బెల్లం చిన్నకప్  
  తయారుచేయువిధానం ఒక గిన్నెలో పాలు తీసుకుని కాగుతున్నప్పుడుబియ్యం కడిగి పాలల్లో వెయ్యాలి బియ్యం పాళ్ళల్లో బాగా ఉడికేక బెల్లం వేసి బాగా కలపాలి బెల్లం బాగా కరిగిదగ్గర పడి కలిసేక స్టవ్ ఆఫ్ చెయ్యాలి  ఇది అమ్మ వారికీ చాలా ప్రీతీ దసరా పండక్కి అమ్మ వారికి నైవేద్యం పెడతారు తప్పకుండా  

పన్నీరు బూరెలు

పన్నీరు బూరెలు కావలసినవి
బియ్యం 4 కప్
 మినపప్పు 2 కప్ 
పన్నీర్ 200 గ్రామ్
 పచ్చి కోవా 100 గ్రామ్
 సెనగపప్పు 2 కప్ 
 బెల్లం తురుము 2 కప్ 
ఎండుకొబ్బరి తురుము  1/2 కప్
 ఏలకులపొడి 1 స్పూన్
  నెయ్యి 4 స్పూన్  
  నూనె తగినంత  
 తయారుచేయువిధానం ముందుగా మినపప్పు,బియ్యం కలిపి 5 గంటలముండు నానపెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి .  సెనగపప్పు తగినంత నీరు పోసి ఉడికించి చిల్లుల ప్లేటులో నీరు వార్చి చల్లరేక బెల్లం తురుము ,ఏలకుల పొడి కలిపి మిక్సిలో గ్రైండ్ చెయ్యాలి .అందులో పన్నీరు తురుము,కోవా,నెయ్యి కలిపి చిన్న,చిన్న ఉండలు చేసిపెట్టుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి అయ్యాక మినపప్పు,బియ్యం కలిపి రుబ్బిన పిండిలో ఈ ఉండలు ముంచి నూనె లో ఎర్రగా వేయించుకోవాలి 

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

బేబీ కార్న్ మంచూరియా

బేబీ కార్న్ మంచూరియా  కావలసినవి
 బేబీ కార్న్ 6 
 కార్న్ ఫ్లోర్ 1  కప్
 బియ్యం పిండి 5 స్పూన్స్
 అల్లం.వెల్లుల్లి ముద్దా  
  నూనె తగినంత 
 జీడిపప్పు 
  కొత్తిమీర కట్ట
 వెల్లుల్లి రెబ్బలు  4 
 టమాట సాస్ 1 స్పూన్ 
 చిల్లి సాస్ 1 స్పూన్
 పచ్చి మిర్చి 4 
 ఉల్లిపాయలు 2 
 తయారుచేయువిధానం బేబీ కార్న్ ముక్కలు కోసి ఉప్పునీల్లల్లో కాసేపు నానపెట్టాలి .ఒక బౌల్ తీసుకుని కార్న్ ఫ్లోర్ ,బియ్యం పిండి ,అల్లం,వెల్లుల్లి ముద్దా ,ఉప్పు ,పచ్చిమిర్చి వేసి కొంచెం నీరు పోసి బజ్జి పిండిల కలపాలి నానిన కార్న్ ఫ్లోర్ ముక్కలు అపిండిలో ముంచి నూనెలో వేయించుకోవాలి అన్ని అయ్యాక  .వేరే బాణలి పెట్టి కొంచెం నూనె వేసిజీడిపప్పు, ఉల్లిపాయ ,పచ్చిమిర్చి వేయించి బేబీ కార్న్ బజ్జీలు వేసి టమాట సాస్,చిల్లిసాస్ కొత్తిమీర వేసి సన్నటి మంట మీద అన్ని కలిసేలా కలిపితే కార్న్ మంచూరియా రెడి ఇది రైస్ లో చపాతి లోను బాగుంటుంది