26, సెప్టెంబర్ 2011, సోమవారం

పన్నీరు బూరెలు

పన్నీరు బూరెలు కావలసినవి
బియ్యం 4 కప్
 మినపప్పు 2 కప్ 
పన్నీర్ 200 గ్రామ్
 పచ్చి కోవా 100 గ్రామ్
 సెనగపప్పు 2 కప్ 
 బెల్లం తురుము 2 కప్ 
ఎండుకొబ్బరి తురుము  1/2 కప్
 ఏలకులపొడి 1 స్పూన్
  నెయ్యి 4 స్పూన్  
  నూనె తగినంత  
 తయారుచేయువిధానం ముందుగా మినపప్పు,బియ్యం కలిపి 5 గంటలముండు నానపెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి .  సెనగపప్పు తగినంత నీరు పోసి ఉడికించి చిల్లుల ప్లేటులో నీరు వార్చి చల్లరేక బెల్లం తురుము ,ఏలకుల పొడి కలిపి మిక్సిలో గ్రైండ్ చెయ్యాలి .అందులో పన్నీరు తురుము,కోవా,నెయ్యి కలిపి చిన్న,చిన్న ఉండలు చేసిపెట్టుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి అయ్యాక మినపప్పు,బియ్యం కలిపి రుబ్బిన పిండిలో ఈ ఉండలు ముంచి నూనె లో ఎర్రగా వేయించుకోవాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి