26, సెప్టెంబర్ 2011, సోమవారం

పులిహార

పులిహార  కావలసినవి
 బియ్యం 2 కప్
 చింత పండు చిన్న ముద్దా 
సెనగపప్పు 1 స్పూన్ 
మినపప్పు 1 స్పూన్ 
ఆవాలు.జీలకర్ర 1 స్పూన్
 ఆవపొడి 1 స్పూన్
 కరివేపాకు 2 రెమ్మలు
 జీడిపప్పు కావలసినంత
 నుపప్పు 1 స్పూన్
 నూనె 4  స్పూన్స్ 
 ఉప్పు తగినంత  
 ఎండుమిర్చి 2 
 పసుపు చిటికెడు 
  తయారుచేయువిధానం బియ్యం సుబ్రముగా కడుక్కుని 4  కప్ ల నీరు పోసుకుని కుక్కర్లో అన్నం వండుకుని ఒక పెద్ద ప్లేటులోకి తీసి పెట్టుకోవాలి చింతపండు రసం తీసి ఉప్పు,సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి వేసి ఉడికించాలి అన్నంలో చిటికెడు పసుపు వేసి పైన 1 స్పూన్ నూనె వెయ్యాలి . స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి ,జీడిపప్పు,నూపప్పు,కరివేపాకు వేయించుకోవాలి చింతపండు రసం,పోపు అన్నం లో బాగా కలిపి ,అవపోడిలో 1 స్పూన్ నూనె కలిపి అన్నంలో కలిపితే పులిహార రెడి  ఇష్టమైన వారు పోపులో ఇంగువ కూడా వేసుకుంటారు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి