6, జులై 2011, బుధవారం

బెండకాయ.పల్లి కూర

బెండకాయ.పల్లి కూర కావలసినవి
 బెండకాయలు కేజీ \
పల్లీలు 1/2 కప్ 
జీడిపప్పు 10 గ్రామ్స్ 
 నూనె 4 స్పూన్స్ 
సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1 స్పూన్  
ఆవాలు 1
 జీలకర్ర  1 స్పూన్
 ఎండుమిర్చి  5  
పెరుగు 1  స్పూన్ 
 పసుపు చిటికెడు
 వెల్లుల్లి 5  రెబ్బలు
 కరివేపాకు 2  రెమ్మలు
 ఉల్లిపాయలు 2 
 ఉప్పు తగినంత 
 తయారుచేయువిధానం బెండకాయలు శుబ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి .ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జీలకర్ర,వెల్లుల్లి ,ఎండుమిర్చి ,ఉప్పు మిక్సిలో పొడి చేసుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పల్లీలు,జీడిపప్పు వేయించుకొని ప్లేటులోకి తీసి అదే బాణలిలోసెనగపప్పు.మినపప్పు,ఆవాలు వేయించి  బెండకాయ ముక్కలు వేసి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు ,పసుపు,పెరుగు వేసిబాగా వేయించాలి బాగా వేగిన తరువాత మిక్సిలో గ్రైండ్ చేసుకున్న పొడి చల్లి కలపాలి చివరగా పల్లీలు,జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి