27, జులై 2011, బుధవారం

జీరా సర్భతు

జీరా సర్భతు  కావలసినవి 
జీలకర్ర 1 కప్
 పంచదార 4 కప్పులు
 పైనాపిల్ ఎసన్సు 1 స్పూన్
 సిట్రిక్ ఆసిడ్ 4 స్పూన్స్
 రెడ్ కలర్ 1 స్పూన్  
 నీళ్ళు  4 గ్లాసులు  
తయారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి  జీలకర్ర వేయించి చల్లారాక మిక్సిలో పొడి చెయ్యాలి గిన్నెలో నీరు పోసి ఈ పొడి వేసి మరిగించాలి .కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి వడ కొట్టాలి .ఇంకో గిన్నెలో పంచదార లో కొంచెం నీరు పోసి తీగ పాకం పట్టాలి పాకం తయారయ్యాక సిట్రిక్ ఆసిడ్ ,కలర్ వేసి చల్లార పెట్టాలి బాగా చల్లారాక జీలకర్ర రసం వేసి ఎసన్సు వేసి బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి