30, జూన్ 2012, శనివారం

                                                                 దొండకాయ గుత్తికూర 
కావలసినవి
 దొండకాయలు పావుకిలో
 ఉల్లిపాయలు 2
పచ్చిమిరపకాయలు  3
అల్లం,వెల్లుల్లి ముద్ద 1 స్పూన్
కరివేపాకు 1 రెమ్మ
 గరంమసాల 1/2 స్పూన్
 ధనియాలపొడి 1స్పూన్
నువ్యులపొడి 2 స్పూన్స్
 పసుపు చిటికెడు
 చింతపండు కొద్దిగా
కారం 1స్పూన్
 ఉప్పు తగినంత
 నూనె సరిపడా
 తయారుచేయువిధానం   ముందుగా ఉల్లిపాయముక్కలు,అల్లం,వెల్లుల్లి ముద్దా,గరం మసాల ,ధనియాలపొడి ,నువ్యులపొడి,పసుపు,ఉప్పు,కారంమిక్సిలో  వేసి ముద్దచేసిపెట్టుకోవాలి .
ఇప్పుడు దొండకాయ కడిగి గుత్తిగా కోసి పెట్టుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి దొండకాయలు వేసి కొంచెం మగ్గేక మసాల ముద్దా వేసి చింతపండు గుజ్జు వేసి పది నిమిషాలు సన్నని మంటపై వేయించుకోవాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి