12, ఫిబ్రవరి 2012, ఆదివారం

స్టఫ్డ్ పొటాటో

కావలసినవి
గొధుమపిండి:-1/4 కిలో
బంగాళదుంప:-1/4 కిలో
పచ్చిమిర్చి సన్నని ముక్కలు:1/4 కప్పు.
కారం:1 చెంచా.
ఉల్లి ముక్కలు:-1 1/2 కప్పులు
కర్వేపాకు:-4 రెబ్బలు.
నూనె:సరిపడ.
కొత్తిమీర:1/2 కప్పు తరిగినది.
పసుపు,ఉప్పు:సరిపడ.

తయారు:-
1)బంగాళదుంపలని మెత్తగా ఉడకబెట్టి చెక్కు తీసి మెదిపి దానికి ఉప్పు,కొత్తిమీర తరుగు,కారం,పసుపు వేసి కలిపి ఉంచాలి.దీనికి ముందే గొధుమపిండికి తగినంత నీరు,ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి ఉంచాలి.
2)బాండీలో నాలుగు చెంచాల నూనె వేసి అందులో ఉల్లి,మిర్చిముక్కలు వేసి వేపాలి.
3)వేగిన తర్వాత స్టౌ మీద నుంచి దింపి బంగాళదుంప మిశ్రమాన్ని కలపాలి.
4)మొత్తం కలిసిన తర్వాత చల్లారనిచ్చి నిమ్మకాయంత ఉండలు తేసుకొని పూరీ సైజులో వత్తుకోవాలి.
5)దీని మధ్య బంగాళదుంప ఉండని పెట్టి చుట్టురా మడిచి మళ్ళీ పూరీలా వత్తాలి.
6)పెనం వేడి చేసి చపాతీని వేసి నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి