28, నవంబర్ 2011, సోమవారం

వెజ్ టబుల్ బర్గర్

కావలసినవి:
బర్గర్ రోల్(చిన్నసైజు బన్స్):-8
కీరదొసకాయ:2
టమోటాలు:-4
ఉల్లిపాయలు చక్రాల్లాగా తరిగినవి:-8 ముక్కలు.
వెన్న:-200గ్రా.
టమోట సాస్:1/2 కప్పు.
టూత్ పిక్స్:8

వెజ్ టబుల్ కట్ లెట్ కు కావలసినవి:-
క్యారెట్స్:1/4కిలో.
బంగాళదుంపలు:1/4కిలో
బీన్స్:- 200గ్రాములు.
మిరియాలపొడి:1/4చెంచా
కారం:1/4చెంచా
మైదాపిండి:-4 గరిటెలు
అల్లం ముక్కలు:2 చెంచాలు
నూనె:-2 గరిటెలు
ఉప్పు:-సరిపడ

తయారు:-
1)బంగాళదుంపలను ఉడికించి తొక్కుతీసి మెత్తగా మెదిపి ఉంచాలి.
2)దీనికి ఉడికించిన బీన్స్,క్యారెట్స్ సన్నని ముక్కలు,మిరియాలపొడి,ఎర్రకారం,నిమ్మరసం,సరిపడ ఉప్పు వేసి బాగ కలిపి దాన్ని 8 బాల్స్ గా చేసుకొని వడలాగా తట్టి మైదాపిండిలో ముంచి బాగా మెదపాలి.
3)తర్వాత కాగిన పెనం మీద నూనె వేసి కట్ లెట్స్ ను బాగా ఎర్రగా కాల్చి వుంచాలి.
4)బన్స్ ని మధ్య అడ్డంగా కోసి,వెన్న రాసి వేడి పెనం మీద కాల్చి వుంచండి.
5)కట్ లెట్ కి పైన చక్రాల్లాగా కోసిన కీర,టమోటా ముక్కలను వుంచి దాన్ని బన్ మధ్యలో ఉంచి పైన టమోటా సాస్ పూసి చక్రాల్లాగా కోసి ఉల్లిముక్కలను బన్ మీద వుంచి టూత్ పిన్ గుచ్చేలా అలా అన్నింటిన తయారుచేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి