18, ఆగస్టు 2011, గురువారం

కాప్సికం బోండా

కాప్సికం బోండా   కావలసినవి
 కొంచెం చిన్న సైజు  కాప్సికం  4
 బంగాలదుంపలు 2 
 ఉల్లిపాయ 1 
 శనగపిండి   2 కప్
 ఉప్పు సరిపడా 
 కారం 2 స్పూన్స్ 
 నూనె వేయించడానికి సరిపడా  
 వంటసోడా చిటికెడు  
  తయారుచేయువిధానం ఆలూ ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదిపి పెట్టుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి రెండు స్పూన్ల నూనెవేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించి ఆలూ ముద్దా,ఉప్పు ,కారం వేసి బాగా కలిపి కూర చేసిపెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకో బాణలి పెట్టి నూనె వేడి చేసుకొని ..సెనగ పిండిలో ఉప్పు ,కారం,వంటసోడావేసి నీరుపోసి బజ్జి పిండి కలుపుకోవాలి .కాప్సికం ఒకవేపు కొంచెంకట్ చేసి ఆలూ కూర మద్యలో పెట్టి కప్సికంను బజ్జిపిండిలో ముంచి నూనెలో వేయించుకోవాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి