4, ఆగస్టు 2011, గురువారం

నవరతన్ బజ్జి

నవరతన్ బజ్జి   కావలసినవి
 పాలకూర 1 కట్ట
 తోటకూర 1 కట్ట 
మెంతికూర 1 కట్ట
 చుక్కకూర  1 కట్ట
 బచ్చలికూర 1 కట్ట 
పుదీనా 1 కట్ట
 కరివేపాకు 1 కట్ట 
కొత్తిమీర 1 కట్ట
 ఉల్లికాడలు 1 కట్ట 
 సెనగపిండి 1 1/2 కప్
 మైదా 1/2 కప్ 
 కార్న్ ఫ్లోర్ 1/2   కప్
 బియ్యం పిండి 1/2 కప్  
 ఉల్లిపాయలు  2
కారం 2 స్పూన్స్
 ఉప్పు తగినంత 
వామ్ 2 స్పూన్స్
 జీలకర్ర 2 స్పూన్స్
 వంట షోడ చిటికెడు
 అల్లం,వెల్లుల్లి పేస్ట్ 
 నూనె వేయించడానికి సరిపడా 
  తయారుచేయువిధానం  ముందుగా ఆకు కూరలన్నీ శుబ్రముగా కడుక్కుని సన్నగా కట్ చేసుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి 2 లేక 3  స్పూన్ల నూనె వేసుకుని కట్ చేసిన ఆకు కూరలన్నీ వేసి పచ్చి వాసన పోయేదాకా రెండు నిమిషాలు వేయించాలి  అర కప్పుచొప్పున  సెనగపిండి, మైదా,బియ్యంపిండి,మొక్కజొన్న పిండి ,అల్లం,వెల్లుల్లి ముద్దా,ఉప్పు,కారం,ఉల్లిపాయ ముక్కలు ,వేసి గట్టి పిండి అయ్యేదాకా కలపాలి .ఇంకో గిన్నె తీసుకుని కప్పు సెనగపిండి,సరిపడా ఉప్పు,కారం,వాము,జీలకర్ర,వంటసోడా వేసి నీరు చేర్చి బజ్జిపిండిలా కలపాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసుకుని ఆకు కూరలపిండిని చిన్న ఉండ తీసుకుని చేత్హో వత్హి బజ్జి పిండిలో ముంచి నూనెలోఎర్రగా  వేయించు కోవాలి ఇది టమాట సాసు తో తింటే బాగుంటాయి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి