26, ఆగస్టు 2011, శుక్రవారం

ఆవడలు [పెరుగు ,వడలు ]

ఆవడలు [పెరుగు ,వడలు ]  కావలసినవి                                        
 మినపప్పు 1/4 కిలో
 పెరుగు 4 కప్  
పచ్చిమిర్చి 4  
కొత్తిమీర  1 కట్ట
 మెంతులు 1 స్పూన్
 మినపప్పు  1 స్పూన్  
ఆవాలు 1 స్పూన్ 
 జీలకర్ర  1 స్పూన్  
 అల్లం చిన్నముక్క 
 ఉప్పు తగినంత  
   నూనె వేయించడానికి సరిపడా 
 తయారుచేయువిదానం మినపప్పు4 గంటలముందు నానపెట్టుకోవాలి నానేక కొంచెం నీరు పోసి మెత్తగా గారేలపిండి మిక్సి చేసుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి పోపు వేయించుకుని పెరుగులో కలపాలి .పచ్చిమిరపకాయలు ,కొత్తిమీర ,అల్లం మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెరుగులోకలపాలి ఉప్పువేసిపెరుగు బాగా కలిపి పెట్టుకోవాలి స్టవ్ మీదబాణలి పెట్టినూనె వేడి చేసుకుని  గారెలు వేయించుకుని  ఒకసారి నీళ్ళల్లో ముంచి పెరుగులో వెయ్యాలి నీళ్ళల్లో వేస్తె పెరుగులో లో త్వరగా నానుతై ఇష్టమైన వాళ్ళు ఆవ నూరి పెట్టుకోవచ్చు .,,పైన బూంది వేసుకోవచ్చు ఎలా చెసుకున్నాచాల టేస్తీగానే ఉంటై   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి