20, ఆగస్టు 2011, శనివారం

క్యాప్సికం పచ్చడి

క్యాప్సికం పచ్చడి కావలసినవి
 క్యాప్సికం  4 
 టమాటాలు  2 
 మెంతులు   1/2  స్పూన్
 నువ్వులపొడి 2  స్పూన్స్
 ఆవాలు,జీలకర్ర 1 స్పూన్ 
 కరివేపాకు 2  రెమ్మలు
 ఎండుమిర్చి 5 
 ఇంగువ చిటికెడు
 నూనె 4  స్పూన్స్ 
 ఉప్పు తగినంత 
  పసుపు 1/2 స్పూన్  
  తయారుచేయువిధానం క్యాప్సికం,టమాటాలు కట్ చేసిపెట్టుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేడి చేసి మెంతులు ,ఎండుమిర్చి వేయించి టమాటాలు,కరివేపాకు వేసి కొంచెం వేగిన తరువాత క్యాప్సికం వేసి  మగ్గిన తరువాత  స్టవ్ ఆఫ్ చెయ్యాలి .చల్లారిన తరువాత  మిక్సిలో వేసి నువ్వులపొడి,పసుపు ,ఉప్పు చేర్చి గ్రైండ్ చెయ్యాలి  బాణలిలో  మిగతా 2  స్పూన్ల  నూనె వేసి వేడి చేసి ఆవాలు,జీలకర్ర,ఇంగువ వేయించి   పచ్చడిలో కలిపితే క్యాప్సికం పచ్చడి రెడి               



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి