27, నవంబర్ 2012, మంగళవారం

కావలసినవి                                                         పన్నీరు మిర్చి బజ్జి 
 బజ్జిమిర్చి [లావు]  10   
 శనగపిండి  కప్ 
 వంట షోడ చిటికెడు 
 పన్నీరు ముక్కలు 50 గ్రామ్ 
 ఆలు 1 
 కారం 1 స్పూన్ 
 ఉప్పు సరిపడా 
 నూనె వేయించడానికి సరిపడా
  అల్లం చిన్న ముక్క   
  కొత్తిమీర చిన్న కట్ట  
  తయారుచేయువిధానం    పచ్చిమిర్చి మద్యలో చీల్చి పెట్టుకోవాలి  ఆలు ఉడికించి  ఆలు,పన్నీర్ మిక్సిలో  వేసి మెత్తగా చేసి అల్లం,కొత్తిమీర,ఉప్పుకూడా వేసి ముద్ద చేసిపెట్టుకోవాలి 
  ఈ ముద్దని మిరపకాయలులో  కూరి పెట్టాలి  
   ఒక బౌల్ తీసుకుని శనగపిండి, ఉప్పు, వంటసోడా ,కారం వేసి తగినన్ని నీరు పోసి బజ్జిపిండిలా కలపాలి 
 స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి పన్నీర్ కూరిన మిరపకాయలు శనగ పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీస్తే కర కర లాడే పన్నీర్ మిర్చి బజ్జి రెడి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి