1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

కాకరకాయ పచ్చడికి కావలసినవి                               కాకరకాయ చట్ని 
 కాకరకాయలు 1/2  కిలో
  కారం 1/2 కప్
 నువ్వులపొడి  1/2 కప్
 ఉప్పు 1/2 కప్
 నిమ్మరసం  1 కప్
 ధనియాలపొడి 1 స్పూన్
 జీలకర్రపొడి 1 స్పూన్
 పసుపు 1 స్పూన్
 నూనె 1/4 కేజీ
  తయారుచేయువిధానం కాకరకాయలల్ని చక్రాల్లా తరిగి పసుపు/.ఉప్పు కలిపి 10 నిమిషాలు ఉంచి  నీటిని పిండేయ్యాలి చేదు పోతుంది
 స్టవ్ మీద బాణలి పెట్టి 4స్పూన్ల నూనె వేసి కాకరకాయ ముక్కలు బాగా వేయించాలి  
 ఒక బౌల్ తీసుకుని  కారం.,ఉప్పు,నువ్వులపొడి,జీలకర్రపొడి,ధనియపొడి,నిమ్మరసం నూనె వేసి కలిపి వేగిన కాకరకాయ ముక్కలువేసి బాగా  కలిపి పెట్టుకోవాలి ఇది వారం,పది రోజులు ఉంటుంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి