5, ఫిబ్రవరి 2013, మంగళవారం

వంకాయ పులుసు  కావలసినవి                                       వంకాయ పులుసు          
 వంకాయలు పెద్దవి  2
 పచ్చిమిరపకాయలు  5
 చింతపండు చిన్న ముద్దా
వెల్లుల్లి రేకలు  4
 ఎండుమిర్చ్చి  4
 జీలకర్ర,ఆవాలు,పోపుకి సరిపడా
  కొత్తిమీర కట్ట  1
 కరివేపాకు 2 రెమ్మలు
 పసుపు  చిటికెడు
 తయారుచేయువిధానం  వంకాయలు  కత్తితో గాటు పెట్టి  అందులో వెల్లుల్లి రేకలు,పచ్చిమిరపకాయముక్కలు గుచ్చి వంకాయకి నూనె రాసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి
  కాల్చిన వంకాయను నీళ్ళతో కడిగితే పైన పొట్టు పోతుంది
  ఉడికించిన వంకాయను మెత్తగా చేసి  చింతపండు పులుసు కలిపి ఉప్పు,పసుపు కలపాలి
 స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల  నూనె వేసి ఆవాలు,జీలకర్ర,ఎందుమిర్చ్చి,వేయించి పోపు వేయించి  కరివేపాకు వేసి కలపాలి
 చివరగా కొత్తిమీర చల్లుకుంటే వంకాయ పులుసు రెడి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి