9, డిసెంబర్ 2011, శుక్రవారం

రాజస్తాని మిర్చి వడలు

రాజస్తాని మిర్చి వడలు కావలసినవి
 పెద్ద పచ్చిమిరపకాయలు  5
సెనగపిండి 1/2 కప్
వంటసోడా చిటికెడు
 ఉప్పు సరిపడా
 కొత్తిమీర సగం కట్ట
 అల్లం ముక్కలు 1 స్పూన్
 ఉడికించిన బంగాళదుంప 1
 పన్నీర్ కొద్దిగా
నూనె వేయించడానికి సరిపడా
  తయారుచేయువిధానం పచ్చిమిరపకాయలు మద్యలో చీరి మరుగుతున్న నీళ్ళల్లో 2 నిమిషాలు ఉడకనిచ్చి వెంటనే నీల్లల్లోంచి తీసి పక్కన పెట్టాలి .ఆలూ ,పన్నీర్ ,అల్లం,కొత్తిమీర మిక్సిలో మెత్తగాచేసి మిరపకాయ్యల్లో కూరాలి .సెనగపిండిలో ఉప్పు,వంటసోడా నీళ్ళు పోసి బజ్జి పిండి కలిపి నూనె వేడి చేసుకుని పచ్చిమిరపకాయలు పిండిలో ముంచి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి .రాజస్తాని మిర్చి వడలు రెడి ఇవి హరి మిర్చి చట్నీ తోవేడి..వేడి గ  బాగుంటాయి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి