22, డిసెంబర్ 2011, గురువారం

ఇడ్లి తో మంచూరియా

ఇడ్లి తో మంచూరియా  కావలసినవి
 ఇడ్లీలు 6
మైదా 2 స్పూన్స్
కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
 అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్
 ఉప్పు సరిపడా
 వాము 1  స్పూన్
నూనె వేయించడానికి సరిపడా
సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు స్పూన్ 1
ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
కరివేపాకు 2 రెమ్మలు
 కొత్తిమీర ఉల్లిపాయలు 2
జీడిపప్పు కొంచెం          
            తయారుచేయువిధానం ఇడ్లీలు ముక్కలు చేసుకోవాలి [ 1 ఇడ్లీని 4 ముక్కలుగా ]  
ఒక గిన్నెలో మైదా,కార్న్ ఫ్లోర్,అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి పేస్ట్,వాము ఉప్పు చేర్చి కొంచెం నీరుపోసి బజ్జి పిండిలా కలుపుకుని .ఇడ్లి ముక్కలు అందులో ముంచి నూనెలో వేయించుకోవాలి . కొంచెం నూనెలో పోపు వేయించుకుని జీడిపప్పు,.ఉల్లిపాయ ముక్కలు ,కరివేపాకు,కొత్తిమీర,బాగా వేయించి అన్నికలుపుకుని నిమ్మకాయ రసం పిండితే ఇడ్లి మంచూరియ రెడి
      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి