9, జూన్ 2011, గురువారం

మెంతి పులుసుకూర

మెంతి పులుసుకూర కావలసినవి
 మెంతి ఆకూ 2 కట్టలు
 సెనగపిండి చిన్న కప్
 కారం 1 స్పూన్
 కొబ్బరి చిన్న ముక్క 
నూనె వేయించడానికి సరిపడా
 ఉప్పు తగినంత 
చింతపండు పులుసు 1 కప్
  పోపులోకి ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి 
 తయారుచేయువిధానం మెంతికూర సన్నగా తరగాలి .సెనగపిండిలో ఉప్పు.కారం.కొబ్బరి తురుముకలిపి కొంచెం నీరుచేర్చి కలుపుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె కాగేకసెనగపిండి చిన్న.చిన్న ఉండలుగా వేయించుకోవాలిఇంకో గిన్నె స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల నూనె వేసి ఆవాలు..జీలకర్ర,ఎండుమిర్చి వేయించి మెంతి ఆకూ ,చింతపండు పులుసు వేసి కొంచెం మగ్గేక సెనగపిండి ఉండలువేసి  5 ని ..మగ్గించి స్టవ్ ఆఫ్ చెయ్యలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి