18, జూన్ 2011, శనివారం

కేబేజీ అవకూర

కేబేజీ అవకూర కావలసినవి
 కేబేజీ 1/2  కేజీ
 పచ్చిమిర్చి 4 
 ఆవాలు 2  స్పూన్స్
 కరివేపాకు 2  రెమ్మలు
 సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1  స్పూన్
 ఆవాలు,జీలకర్ర 1  స్పూన్
 ఎండుమిర్చి 2  
 నూనె 4స్పూన్స్
 ఉప్పు తగినంత 
 చింతపండుచిన్నముద్దా   
తయారుచేయువిధానం ముందుగా కేబేజీ సన్నగా కట్ చేసుకుని ఉప్పుకలిపి ఉడికించుకోవాలి చిల్లుల ప్లేటులో వార్చుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి పోపు వేయించుకోవాలి .కరివేపాకు,పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఉడికిన కేబేజీ నీరు పిండేసి పోపులో వేసిచిన్తపండునీరుపోసి నీరు ఇగిరేవరకు  బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి .ఆవాలు కొంచెం నీరు కలిపి మెత్తగా నూరుకోవాలి .నూరిన ముద్దలో రెండు స్పూన్ల నూనె కలిపి కూరలో బాగా కలపాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి