30, జూన్ 2011, గురువారం

బిసి బేలే బాత్

బిసి బేలే బాత్ కావలసినవి
 ఉడికిన అన్నం 2 కప్పులు
 కందిపప్పు చిన్న కప్
 సెనగపప్పు 2 స్పూన్స్
 ధనియాలు 1 స్పూన్ 
మిరియాలు 4  
మెంతులు 1/2 స్పూన్
 కొబ్బరి చిన్న ముక్క
 చింతపండు నిమ్మకాయంత ముద్దా
 బెల్లం చిన్న ముక్క 
అనపకాయముక్కలు 4 
ఉల్లిపాయ ముక్కలు 4 
ములక్కాడ ముక్కలు 4
 కేరట్ ముక్కలు 4 
ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
 జీడిపప్పు
 కరివేపాకు
 కొత్తిమీర 
ఇంగువ 
ఎండుమిర్చి  
   తయారుచేయువిధానం ముందుగా చింతపండు నాన పెట్టుకోవాలి .కందిపప్పు,కూర ముక్కలు ఉడకపెట్టాలి .స్టవ్ మీద బాణలి  పెట్టుకుని సెనగపప్పు,మెంతులు,మిరియాలు,ఎండుమిర్చి ధనియాలు వేయించుకొని కొబ్బరి కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .చింతపండు పులుసులో గ్రైండ్ చేసిన ముద్దా కలిపి ,ఉడికించిన పప్పు,కూర ముక్కలు ,ఉప్పు,బెల్లం కలిపి సాంబార్ కాచుకోవాలి . ఇప్పుడు సాంబార్ లో అన్నం బాగా కలిసేలా కలిపిస్టవ్ మీద  ఇంకో గిన్నేపెట్టి 4 స్పూన్ల నెయ్యి వేసి వేడి అయ్యాక ఆవాలు.జీలకర్ర వేసివేగేకా జీడిపప్పు,కరివేపాకు ,కొత్తిమీర చిటికెడు ఇంగువ వేసి వేగాక ఈ సాంబార్ అన్నం వేసి కొంచెం గట్టి పడేవరకు కలపాలి ఘుమ ఘుమ లాడే బిసి బేలే బాత్ రెడి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి